ఇతరములు

పండ్ల చెట్టు గజ్జి తెగులు

Neonectria ditissima

శీలీంధ్రం

క్లుప్తంగా

  • అంటువ్యాధులు తరచుగా కొమ్మలలో ఎర్రటి పల్లపు గాయాల రూపంలో ప్రారంభమవుతాయి.
  • ఈ గాయాలు తరువాత క్యాంకర్ లాగ పెరిగి కొమ్మలను చుట్టుముట్టి నడికట్టుగా మారి కొమ్మలను చంపుతాయి.
  • పెద్ద కొమ్మలపై చనిపోయిన బెరడు సంవత్సరాల తరబడి ఉండి కేంద్రీకృత వలయాలు మరియు ఉబ్బెత్తుగా వున్న అంచులను చూపుతుంది.
  • అప్పుడప్పుడు, వృద్ధి చెందుతున్న పండ్ల కాలిక్స్ చుట్టూ పొడి "కంటి కుళ్ళు" ను చూపుతాయి.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
ఆపిల్
పియర్

ఇతరములు

లక్షణాలు

కాండం మరియు కొమ్మలపై చనిపోయిన బెరడు (క్యాంకర్లు) యొక్క గుండ్రని లేదా కోలాకారపు పల్లపు ప్యాచీలను గమనించవచ్చు. తరచుగా ఎర్రటి పల్లపు గాయాల రూపంలో కొమ్మలు మరియు లేత రెమ్మల గాయాలు లేదా మొగ్గల వద్ద అంటువ్యాధులు ప్రారంభమవుతాయి. గాయాలు తరువాత క్యాంకర్ల వలే పెరుగుతాయి. ఇవి కొమ్మల చుట్టూ నడికట్టుగా మారి ఒక్క సీజన్లోనే కొమ్మలను చంపుతాయి. పెద్ద కొమ్మలపై, అవి గోధుమ-ఎరుపు, పుటాకార, పల్లపు మచ్చల రూపాన్ని కలిగి ఉంటాయి. ఇవి తరువాత పేలిపోయి తెరుచుకుని మధ్యలో వున్న చనిపోయిన కలపను చూపుతాయి. చనిపోయిన బెరడు సంవత్సరాలుగా పేరుకుపోయిన కేంద్రీకృత వలయాలు మరియు విలక్షణమైన ఉబ్బిన అంచులను ప్రదర్శిస్తుంది. క్యాంకర్ పైన ఉన్న శాఖలు బలహీనపడి క్రమంగా చనిపోతాయి. వృద్ధి చెందుతున్న పండ్లు కొన్నిసార్లు దాడి చేయబడతాయి మరియు కాలిక్స్ చుట్టూ పొడి "కంటి కుళ్ళు" ను ప్రదర్శిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ ఫంగస్ యొక్క జీవ నియంత్రణ ఇప్పటివరకు అందుబాటులో లేదు. పండ్ల చెట్టు క్యాంకర్ యొక్క సంక్రమణను పరిమితం చేయడానికి రాగి ఆధారితమైన గాయాలను కప్పే ఉత్పత్తులను ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తెగులు సోకిన కొమ్మలను కత్తిరించిన తరువాత, బహిర్గతమైన గాయాన్ని, గాయాన్ని కప్పి ఉంచే రక్షణ ఉత్పత్తి లేదా పెయింట్‌తో చికిత్స చేయాలి. పండ్ల చెట్టు క్యాంకర్ యొక్క సంక్రమణను పరిమితం చేయడానికి కాపర్ హైడ్రాక్సైడ్ లేదా కప్టాన్ ఆధారిత శిలీంద్ర నాశినులను ఉపయోగించవచ్చు. ఆకు పతనం మరియు మొగ్గ వాపు సమయంలో కూడా రాగి ఆధారిత చికిత్సలు చేయవచ్చు.

దీనికి కారణమేమిటి?

నెక్ట్రియా గల్లిజెనా అనే ఫంగస్ వలన లక్షణాలు సంభవిస్తాయి, ఇవి అనేక రకాల చెట్ల బెరడుపై దాడి చేస్తాయి, వాటిలో ఆపిల్ ఒకటి. వేసవిలో నీటి ద్వారా వ్యాప్తి చెందే బీజాంశాల ద్వారా, శీతాకాలం మరియు వసంతకాలంలో గాలి ద్వారా వ్యాప్తి చెందే బీజాంశాల ద్వారా ఫంగస్ వ్యాపిస్తుంది. ఈ రెండు రకాల బీజాంశాలు మచ్చలు మరియు గాయపడిన కణజాలాలపైకి చేరినపుడు అంటువ్యాధులను ప్రారంభించగలవు. కత్తిరింపు కోతలు, మంచు, పొక్కులు మరియు పేను బంక ద్వారా సంభవించే గాయాలు వీటికి అనుకూలంగా ఉంటాయి. తేమ నేలలు, భారీ నేలలు మరియు ఆమ్ల నేలలపై క్యాంకర్ మరింత తీవ్రంగా కనిపిస్తుంది. తెగులు వ్యాప్తి చెందడానికి వాంఛనీయ ఉష్ణోగ్రత 14-15.5°C. చెట్లపై దీర్ఘకాలిక తేమ కూడా ఒక ముఖ్యమైన అంశం (6 గంటలు లేదా అంతకంటే ఎక్కువ). చెట్ల సత్తువ మరియు తెగులు సోకిన కణజాలాలపై బెరడు పెరుగుదల సామర్థ్యాన్ని బట్టి క్యాంకర్ల మైనపు పరిమాణం మరియు క్షీణత పైన ఆధారపడి ఉంటుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే, నిరోధక రకాన్ని ఉపయోగించండి.
  • తోటలో పనిచేస్తున్నప్పుడు లేదా పంట కోత సమయంలో మొక్కలకు గాయం కాకుండా చూడండి.
  • సమతుల్య ఎరువుల వాడకం, కోత ఉండేలా చూసుకోండి.
  • పొడి వాతావరణంలో మాత్రమే కత్తిరించండి అలాగే ఎప్పుడూ కట్టింగ్ పరికరాలను పూర్తిగా శుభ్రం చేయండి.
  • పండ్ల తోటను క్రమం తప్పకుండా గమనిస్తూ వుండడమే కాక తెగులు సోకిన శాఖలు మరియు కొమ్మలను తొలగించండి.
  • గాయాన్ని కప్పి ఉంచే రక్షణ ఉత్పత్తితో గాయాలను పెయింట్ చేయండి.
  • పొలంలో మంచి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి.
  • అవసరమైతే సున్నం వాడి నేల పిహెచ్ (pH) ను పెంచండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి