లెట్టూస్

డౌనీ బూజు తెగులు (డౌనీ మైల్డ్ డ్యూ)

Peronosporales

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకులపై పసుపు మచ్చలు -తర్వాత బూడిద రంగు చనిపోయిన ప్యాచీలు.
  • ఆకు క్రింది భాగంలో, ఈ మచ్చల కింద, తెలుపు నుండి బూడిద రంగు దూది లాంటి పూత.
  • ఆకులు రాలిపోతాయి.
  • లేత చిగుర్లు, పువ్వులు, పండ్లు మరుగుజ్జు లాగ ఉండడం లేదా చనిపోవడం జరగవచ్చు.
  • ఎదుగుదల మందగిస్తుంది.

లో కూడా చూడవచ్చు

11 పంటలు

లెట్టూస్

లక్షణాలు

వృద్ధి చెందుతున్న లేత ఆకులపై వివిధ పరిమాణాల్లో పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తరువాత ఈ మచ్చలు పెద్దవై, కోణాకారంలోకి మారి ఈనేలతో వేరు చేయబడతాయి. వీటి మధ్యభాగం వివిధ గోధుమ రంగు షేడ్స్ తో నిర్జీవంగా వెచ్చని తేమతో కూడిన రాత్రుల తర్వాత మచ్చల క్రింద దట్టమైన తెలుపు నుండి బూడిద రంగు ప్రత్తి లాంటి పొర వృద్ధి చెందుతుంది మరియు ఎండ వచ్చిన వెంటనే ఇవి అదృశ్యమవుతాయి. లేత చిగుర్లు రాలిపోతాయి లేదా ఎదుగుదల తగ్గిపోతుంది. ఈ వ్యాధి పండ్లు మరియు ఇతర మొక్కల భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది.మారతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

డౌనీ బూజు తెగులుపై పోరాడేందుకు వాణిజ్య జీవనివారణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. డౌనీ బూజు తెగులు తీవ్రత తక్కువగా ఉంటే వాతావరణం మెరుగు పడేవరకు వేచి ఉండడం మంచిది. కొన్ని సందర్భాలలో సేంద్రియ ప్రీ ఇన్ఫెక్షన్ శీలింద్ర నాశినులు ఈ తెగులు వ్యాపించకుండా ఉపయోగించవచ్చు. బోర్డెయక్స్ మిశ్రమం లాంటి రాగి కలిగిన ఫంగస్ నిరోధకాలను వాడి ఈ తెగులు బెడదను అరికట్టవచ్చును.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. క్రిమినాశినిలు ఈ తెగులు ఇతర మొక్కలకు వ్యాపించకుండా ఉండడానికి ఆకు కింది భాగమున తగిలే లాగ పిచికారీ చేయాలి. దైథియోకార్బమేట్స్ కోవకు చెందిన శీలింద్ర నాశినులను వాడొచ్చు. తెగులు తొలి లక్షణాలు గమనించిన వెంటనే శీలింద్ర నాశినులను వాడడం ప్రారంభించండి. సాధారణంగా ఫాసెటిల్-అల్యుమినమ్, అజోక్సీస్ట్రోబిన్ మరియు ఫెనలమైడ్స్ వంటి శిలీంద్ర నాశకాలను ఉపయోగించవచ్చు(ఉదా. మెటలాక్సిల్ ఎం).

దీనికి కారణమేమిటి?

పేరోనోస్పోరాలెస్ గ్రూప్ ఫంగస్ వలన ఈ తెగులు లక్షణాలు ఏర్పడతాయి. అడపాదడపా వర్షాలు, వెచ్చని వాతావరణం(15-23°C) నీడ ఆధికంగా వున్న ప్రాంతాలలో ఈ తెగులు చాల తీవ్రమైన నష్టాన్ని కలుగచేస్తుంది. ఈ తెగులు తన అతిధి మొక్కలతో చాలా సులువుగా కలిసిపోతుంది. దానివలన ప్రతీ పంటకు ఒక కొత్త రకం ఫంగస్ సోకుతుంది. పంట లేని కాలంలో ఈ ఫంగస్ మట్టిలో, మొక్కల అవశేషాలలో, రెమ్మలలో లేదా ప్రత్యామ్న్యాయ అతిధి మొక్కలపై ( పంటలు మరియు కలుపు మొక్కలు) జీవిస్తుంది. అనుకూల పరిస్థితులలో గాలి మరియు వర్షపు తుంపర్లు వలన బీజాంశాలు వ్యాప్తి చెందుతాయి. ఈ బీజాంశాలు ఫలదీకరణ చెంది ఆకుల క్రింది భాగంలో సహజంగా వుండే రంద్రాల ద్వారా ఆకులలోకి ప్రవేశిస్తాయి. అక్కడనుండి కణజాలాల ద్వారా వ్యాపించి కణజాలాల కన్నా అధికంగా వ్యాపించి పైభాగంలో మైల్డ్యూ పూత ఏర్పరుస్తుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధక విత్తనాలను ఎంచుకోండి.
  • గాలి సరిగా ప్రసారం అయ్యేటట్టు చేసి మొక్కలను పొడిగా ఉంచండి.
  • మట్టిలో నీరు అధికంగా లేకుండా చేసుకోండి.
  • మొక్కకి మొక్కకి మధ్య తగినంత దూరం ఉంచండి.
  • సూర్యరశ్మి బాగా అందే స్థలం ఎంచుకొని మొక్కలు నాటండి.
  • పొలంలోను మరియు పొలం చుట్టూ కలుపు మొక్కలు లేకుండా నియంత్రించండి.
  • మొక్కల వ్యర్థ పదార్ధాలను తొలగించి నాశనము చేయండి.
  • పని ముట్లు, వ్యవసాయ పరికరాలు శుభ్రంగా ఉంచండి.
  • కలుషితమైన మట్టిని మరియు మొక్కలను వాడకండి.
  • బలవర్ధకాల సహాయంతో మొక్క ఆరోగ్యాన్ని బలపరచవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి