Erysiphaceae
శీలీంధ్రం
ఆకులు, కాండం మరియు కొన్ని సార్లు పండ్లను ప్రభావితం చేసే గుండ్రటి, పౌడర్ లాంటి తెల్లని చుక్కలు గా ఈ సంక్రమణ ప్రారంభమవుతుంది. సాధారణంగా ఇది ఆకుల ఉపరితలాన్ని కవర్ చేస్తుంది, కాని కొన్ని సార్లు ఆకుల క్రిందిభాగం పైన కూడా పెరగవచ్చు. ఈ ఫంగస్, కిరణజన్య సంయోగక్రియను అడ్డుకుని ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండిపోయేటట్టు చేస్తుంది. మరియు కొన్ని ఆకులు వంకర్లు తిరిగి, విచ్చిన్నం చెంది రూపం కోల్పోవచ్చు. తరువాతి దశల్లో మొగ్గలు మరియు ఎదుగుతున్న చిగుర్ల రూపు మారిపోతుంది.
గంధకం, వేప నూనె, కావోలిన్ లేదా ఆస్కార్బిక్ యాసిడ్ ఆధారిత పిచికారీలు తీవ్రమైన సంక్రమణను నిరోధిస్తాయి.
వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవసంబంధమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. బూడిద తెగులు వల్ల చాలా పంటలు ప్రభావితం అయ్యే అవకాశం ఉండడం వలన ఈ తెగులును నివారించడానికి ప్రత్యేకంగా ఎటువంటి శిలీంద్ర నాశినులను సిఫార్స్ చేయడం కష్టం. నీటిలో కరిగే గంధకం (3 గ్రా/లీ), హెక్సాకోనజోల్ట్ ట్రైఫ్లుమిజోల్, మైక్లోబ్యూటనిల్ ఆధారిత శిలీంధ్ర నాశినులు (అన్నీఒక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు) కొన్ని పంటలలో ఫంగస్ ఎదుగుదలను తగ్గించడానికి తోడ్పడుతాయి.
శిలీంధ్ర బీజాంశాలు ఆకు మొగ్గలు మరియు మొక్కల అవశేషాలలో ఉంటాయి. గాలి, నీరు మరియు క్రిములు, ఈ బీజాలను దగ్గరగా ఉన్న మొక్కలకు అంటుకునేటట్టు చేస్తాయి. బూడిద తెగులు ఒక శిలీంధ్రం అయినప్పటికీ సాధారణంగా ఇది పొడి వాతావరణంలో పెరుగుతుంది. ఇది 10 నుండి 12°C మధ్యలో ఉన్న ఉష్ణోగ్రతల్లో జీవిస్తుంది. కానీ 30°C వీటికి సరైన పరిస్థితులు. కొద్దిపాటి వర్ష పాతం మరియు ఉదయం సమయాల్లో పొగ మంచు ఈ బూడిద తెగులు వ్యాపించటానికి సహకరిస్తాయి.