Phytophthora cactorum
శీలీంధ్రం
ఆపిల్ మరియు పియర్ చెట్లపై మొదటి లక్షణాలు ఆకుల పైన కనిపిస్తాయి మరియు పేలవమైన టెర్మినల్ ఎదుగుదల, చిన్నగా పాలిపోయిన, వాడిపోయిన ఆకులు మరియు ఎదుగుదల తగ్గిన చెట్లు ఈ తెగులు మొదటి లక్షణాలు. ఈ సమయానికి వేర్లు మరియు చెట్టు పైభాగాల్లో ఇప్పటికే బాగా వృద్ధి చెందిన దశలో కుళ్లిపోవడం జరుగుతుంది. బెరడు తొలగించిన తరువాత, కాండం యొక్క అంతర్గత కణజాలం నారింజ నుండి ఎరుపు-గోధుమరంగు గల బాగా సృష్టమైన ప్రాంతాలను చూపుతుంది. వ్యాధి పెరిగేకొద్దీ ఇవి విస్తరించి గోధుమరంగులోకి మారతాయి. వాస్కులర్ కణజాలం నిర్జీవమవ్వడం లేదా కుళ్ళిపోవడం వలన మొత్తం మొక్కకు పోషకాలను సరఫరా చేయడాన్ని పరిమితం చేస్తుంది. పాలిపోయిన, వాడిపోయిన ఆకులు మరియు ఆకులు రాలిపోవడం వంటి సాధారణ ఒత్తిడి లక్షణాలు ఏర్పడటం మరియు మొక్కల పెరుగుదల కుంచించుకుపోవడం వంటివి దీనికి కారణం. అనేక సీజన్ల వెంబడి చెట్లు క్షీణించి చివరికి చనిపోతాయి. పండ్లు కుళ్లిపోవచ్చు. ఇది మొత్తం పండ్లను ప్రభావితం చేసే ముదురు-గోధుమ గాయాలుగా కనబడతాయి. పండ్ల చెట్లు పరిపక్వత యొక్క వివిధ దశలలో కుళ్ళిపోయే అవకాశం ఉంది.
ఇప్పటివరకు ఈ శిలీంధ్రాలకు వ్యతిరేకంగా జీవ నియంత్రణ పద్ధతులు అభివృద్ధి చేయబడలేదు. అయినప్పటికీ, రాగి ఆధారిత శిలీంధ్ర నాశినులను తెగులు సోకిన కాండం యొక్క చికిత్సకు ఉపయోగించవచ్చు.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మెఫెనోక్సామ్, ఎట్రిడియాజోల్ లేదా ఫోసెటైల్-అల్యూమినియం కలిగిన వాణిజ్య శిలీంధ్ర నాశినులు మట్టిలో కలుషితాన్ని తొలగించడానికి ఉపయోగించవచ్చు, కాని తెగులు సోకిన మొక్క భాగాల చికిత్సకు పనికిరావు. చెట్ల మొదలు చుట్టూ మెటలాక్సిల్ + మాంకోజెబ్ కలయికతో చికిత్స చేసినట్లయితే కాండాల్లో పి. కాక్టోరం పెరుగుదలను నివారించవచ్చు.
మట్టిలో వుండే ఫంగస్ ఫైటోఫ్తోరా కాక్టోరం వలన ఈ లక్షణాలు సంభవిస్తాయి, ఇది చాలా ఎక్కువ సంఖ్యలో అతిధి మొక్కలను కలిగి ఉంటుంది. ఇది తడి నేలల్లో బాగా వృద్ధి చెందుతుంది. దీనివలన లోతట్టు ప్రాంతాలలో, వరదలకు గురయ్యే లేదా తేమతో కూడిన నేల పరిస్థితులలో ఇది సమస్యగా ఉంటుంది. వెచ్చని కాలాలు బీజాంశాల ఉత్పత్తికి అనుకూలంగా ఉంటాయి. ఆ పరిస్థితుల్లో అప్పుడు ఈ తెగులు సంక్రమిస్తుంది. ఇది ఆపిల్ మరియు పియర్ చెట్లపై దాడి చేస్తుంది, అయితే ఇది చాలా అరుదుగా వచ్చే సమస్య. పుష్పించే దశకు ముందు సంక్రమణకు క్లిష్టమైన దశగా చెప్పవచ్చు. రాలిన పండ్లు విడుదల చేసే ఫంగల్ బీజాంశాలు మరియు తెగులు సోకిన అంటు మొక్కలు తెగులు సంక్రమణకు ప్రధాన మూలం. నేలకు దిగువన సంక్రమణ ఉన్నప్పుడు క్రౌన్ మరియు వేరు కుళ్ళు యొక్క లక్షణాలు సంభవిస్తాయి. మట్టికి పైభాగాన దిగువ కాండంపై కాలర్ కుళ్ళు తెగులు సంభవిస్తుంది. రెండు సందర్భాల్లోనూ ఆకుల లక్షణాలు వేర్ల యొక్క అంతర్గత కణజాలం కుళ్ళిపోవడాన్ని మరియు వాస్కులర్ కణజాలాల పనిచేయకపోవడాన్ని సూచిస్తాయి.