శ్రద్ధ
టమోటా నైట్ షేడ్ (సొలనేసియా) కుటుంబానికి చెందిన ఒక మొక్క. అనువైన పరిస్థితులలో దీనిని చాలా సులభంగా పెంచవచ్చు, అలాగే మంచి దిగుబడులు పొందవచ్చు. కానీ టమోటా మొక్కలు చాలా త్వరగా చీడ పీడలకు లోనవుతాయి. చల్లని పరిస్థితులు వుండే ప్రాంతాలలో ఈ పంటను వెచ్చని వాతావరణం వుండే నేలలలో మాత్రమే పెంచవచ్చు (ఒక పంట). వెచ్చని వాతావరణంలో వుండే ప్రాంతాలలో మాత్రం ఈ పంటను వార్షిక పంటగా వేయవచ్చు (రెండు సార్లు).
మట్టి
కొద్దిగా ఆమ్లతత్వం అంటే 6 నుండి 6.8 pH ఉండి, నీరు బాగా పారే లోమీ నేలలలో టమోటా మొక్కలు బాగా వృద్ధి చెందుతాయి. వేర్ల కుదురు వద్ద తేమ వుండేటట్టు చూడాలి కానీ బురదగా ఉండకూడదు. సరైన పరిస్థితులలో టమోటా మొక్కల వేర్లు భూమిలో మూడు మీటర్ల వరకు చోచ్చుకుంటాయి. అందువలన మట్టి వదులుగా ఉండి నీరు సులువుగా ఇంకేటట్టు ఉండాలి. గట్టి నేలలు మరియు ఒండ్రుమట్టి నేలలు వీటి వేర్లను ఎదగకుండా చేస్తాయి. అందువలన మొక్కలు ఆరోగ్యంగా ఉండక, ఎదుగుదల క్షీణించి, పంట దిగుబడి తగ్గుతుంది.
వాతావరణం
స్వయం సంపర్క సామర్థ్యం గల, వెచ్చని సీజన్ పంట టమోటా. ఇవి వెచ్చని వాతావరణంలో బాగా వృద్ధి చెందుతాయి. అందువలన వసంత ఋతువులో మంచు ఆఖరిసారి పడిన తర్వాత ఈ పంటను సాగుచేయాలి. మూడున్నర నెలలకన్నా తక్కువ మంచు కురవని ప్రదేశాలలో టమోటా సాగు లాభదాయకం కాదు. సూర్యరశ్మి పూర్తిగా తగలడం చాలా ముఖ్యం. మొక్కకు రోజుకు కనీసం ఆరు గంటలు అయినా సూర్యరశ్మి తగలాలి. 21 నుంచి 27°C మధ్య ఉష్ణోగ్రత అంకురోత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. 10°C కన్నా తక్కువ మరియు 35°C కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలలో అంకురోత్పత్తి సరిగా జరగదు. ఆ తర్వాత, పంటను ఎప్పుడైనా వేయవచ్చును గాని, పగటి ఉష్ణోగ్రతలు 16°C పై బడి, రాత్రి సమయాలలో 12°C ఉష్ణోగ్రతల కన్నా తక్కువ కాకుండా ఉంటే మాత్రమే ఈ మొక్కలు బాగా వృద్ధి చెందుతాయి. ఇటువంటి వాతావరణ పరిస్థితులు లేకపోతే గ్రీన్ హౌస్ వెంటిలేషన్/హీటింగ్ సౌకర్యం కల్పించాలి.