శ్రద్ధ
మిరప లేదా కాప్సికం నైట్ షేడ్ కుటుంబంలో పుష్పించే మొక్క . ఇది అమెరికాలో పుట్టి
( ఈ పంట సాగు అవశేషాలు మెక్సికోలో 3,000 BC లో కనిపించాయి.) 16 వ శతాబ్దంలో మిగిలిన ప్రపంచానికి పరిచయం చేయబడింది. 50% మిరప పంట చైనా లో ఆ తర్వాత మెక్సికో, టర్కీ, ఇండోనేసియా మరియు స్పెయిన్ దేశాలలో పండిస్తున్నారు.
మట్టి
చాలా రకాల నేలల్లో మిరప పంటను సాగు చేయవచ్చు. కానీ లోతైన, లోమి మరియు మంచి మురుగు నీటి సౌకర్యం వున్న నేలల్లో ఇది బాగా పెరుగుతుంది. మట్టిలో ph 5.5 – 7.0 వరకు ఉండాలి. వీటి వేర్లు బాగా లోతుగా, ఒక్క మీటర్ లోతువరకు వెళ్తాయి. ఒకే రీతిలో వాలు ఉంటే మంచిది ఆలా ఉంటే నీరు సులువుగా బైటకు పోతుంది. పొలంలో మట్టి గట్టిపడివుంటే నీరు నిలువ ఉండిపోతుంది.
వాతావరణం
మిరపకు అనువైన పెరుగుదల పరిస్థితులు వెచ్చని లోమీ నేలలతో సహా మంచి ఎండ 21 నుండి 29°C ఉష్ణోగ్రత ఉండి నీరు నిల్వ ఉండకుండా తేమ కలిగిన ఉంటే ఈ పంటకు మంచిది. తేమ అధికంగా వుండే నేలల్లో విత్తనాలు నానిపోయి సరిగ్గా మొలకెత్తవు. 12°C ఉష్ణోగ్రత వరకు ఇవి తట్టుకోగలవు. ( కానీ ఇష్టపడవు) వీటికి మంచు పడదు. ఈ మొక్కల పుష్పించే దశను పగటి పూట సమయం ప్రభావితం చేస్తుంది. ఇవి స్వయం సంపర్కం చెందుతాయి. కానీ 33 నుండి 38°C వరకు ఉష్ణోగ్రతలు ఉంటే దాని పుప్పొడి యొక్క సామర్ధ్యం తగ్గిపోతుంది. పుష్పాలు ఫలదీకరణం చెందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.