పరిచయం
మినుము అనేది నిటారుగా వెంట్రుకల వంటి ఆకులతో పెరిగే వార్షిక పంట మరియు ఇవి సన్నని 4-6 cm పొడవుతో కాయలు వుంటాయి. పలు కొమ్మలు కలిగిన కాండంతో, ఈ మొక్క ఒక్క పొదలాగా ఉంటుంది. దీని కాండం బాగా వృద్ధి చెంది, మట్టి లోపల వరకు ఉంటుంది. భారత దేశంలో సంవత్సరానికి సుమారుగా 15 లక్షల టన్నుల మినప గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. మయన్మార్ మరియు థాయిలాండ్ దేశాలలో కూడా ఈ పంటను అధిక మొత్తంలో పండిస్తున్నారు.