శ్రద్ధ
నాటడానికి ముందు పొలాన్ని 35 సెంటీమీటర్ల లోతు వరకు దున్నడం సిఫారసు చేయబడినది. ఇలా చేయడం వలన మొక్కలు మట్టిలో బాగా స్థిరపడతాయి. కలుపు మొక్కల కోసం పొలాన్ని క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలి. పంట కోత పూర్తైన వెంటనే పొలాన్ని బాగా లోతుగా దున్ని తరువాత పంటకు సిద్ధం చేయాలి. విత్తనాలను
4-5 సెంటీమీటర్ల లోతులో నాటాలి. ఒక్క హెక్టారుకు సుమారు 25 కిలోల విత్తనాలు మరియు 200 కిలోల సమతుల్య ఎరువును వాడవలసివుంటుంది. విత్తనాలు వేసే సాళ్ళలో 7.5 సెంటీమీటర్ల అంతరం పాటించాలి. ఒక్క హెక్టారుకు ఒకటి లేదా రెండు తేనె పట్టులను పొలంలో ఉంచితే మంచిది. వర్షపాతం తక్కువగా వుండే ప్రాంతాలలో విత్తనాలను వేయకముందే నీరు పెట్టాలి. తర్వాత పుష్పించే దశలో మరియు ప్రత్తి బోల్స్(కాయలు) పగిలే వరకు నీరు పెట్టాలి.
మట్టి
అన్ని రకాల నేలలలోను ప్రత్తిను సాగుచేయవచు. కానీ నేలలు బాగా నీరు ఇంకేవి అయ్యి ఉండాలి. కానీ దిగుబడి అధికంగా రావాలి అంటే సరిపడా బంకమన్ను వున్న ఇసుక నేలలు, సేంద్రియ పదార్ధాలు మరియు నత్రజని మరియు భాస్వరం మధ్యస్థముగా అందుబాటులో వుండే నేలలు ఉత్తమం. సున్నితమైన వాలు ఉండడం వలన నీరు బైటకు పోవడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రత్తి మొక్కలు బాగా ఎదగాలి అంటే మట్టిలో pH 5.8 నుండి 8 మధ్యన ఉండాలి, మరియు 6 నుండి 6.5 pH ఉంటే ఉత్తమమైనది.
వాతావరణం
ప్రత్తి మొక్కలు బాగా వృద్ధి చెందడానికి మంచు కురవని, అధిక ఉష్ణోగ్రతలు మరియు అధిక మొత్తంలో సూర్యరశ్మి అవసరం. 60 సెంటిమీటర్ల నుండి 120 సెంటీమీటర్ల వరకు ఒక్క మోస్తరు వర్షపాతంతో వెచ్చని మరియు తేమ వాతావరణం ఈ మొక్కలకు అనుకూలం. మట్టిలో ఉష్ణోగ్రత 15°C కన్నా తక్కువగా ఉంటే కొన్ని ప్రత్తి విత్తనాలు మాత్రమే మొలకెత్తుతాయి. బాగా చురుకుగా పెరిగే దశలో 21-37°C మధ్య ఉష్ణోగ్రతలు ఉండాలి. ప్రత్తి మొక్కలు కొంత సమయం వరకు 43°C ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. పరిపక్వత దశలో ( వేసవికాలం) లేదా పంట కోత సమయంలో( శరద్ ఋతువులో) తరుచు వర్షాలు పడితే దిగుబడి తగ్గుతుంది.