శ్రద్ధ
మంచి వృద్ధికి అరటిపండ్లకు చాలా వెచ్చదనం అవసరం. అవసరమైతే, భవనం లేదా తారు / సిమెంట్ షెడ్ పక్కన నాటడం ద్వారా అదనపు వేడిని ఇవ్వవచ్చు. ఇవి అధికంగా నీటిని ఉపయోగిస్తున్నందున, వెచ్చని వాతావరణంలో క్రమం తప్పకుండా అధికంగా నీరు పెట్టాలి. మొక్కలు ఎండిపోకూడదు. మరోవైపు ముఖ్యంగా చల్లని వాతావరణంలో , నీరు నిలువ వుండినట్లైతే వేరు కుళ్ళు తెగులు ఏర్పడడానికి కారణం అవుతుంది. మట్టిపైన మందపాటి పొర( మల్చింగ్) తేమను కాపాడుతుంది. అరటి మొక్కలకు అధిక మొత్తంలో పోషకాల అవసరం ఉంటుంది. అందువలన కాండం నుండి 4-8 అడుగుల దూరంలో నెలకు ఒకసారి 0.25 నుండి 1 కిలో సమతుల్య ఎరువులను(వృద్ధి దశను బట్టి) వేయాలి. అరటిపండ్లు గాలికి దెబ్బతినే అవకాశం ఉంది అందువలన మంచి రూపానికి మరియు గరిష్ట దిగుబడికి రక్షణ అవసరం. పరిపక్వత చెందిన అరటి మొక్కల చుట్టూ కొత్త పిలకలు వృద్ధి చెందుతాయి. ప్రధాన మొక్కకు అది ఎదిగే సమయంలో అవసరమైన పూర్తి శక్తిని ఇవ్వడానికి వాటిని కత్తిరించాలి. పండ్లు కాసే దశకు మొక్కలు చేరుకున్నప్పుడు ఈ పిలకలను (కనీసం 3 అడుగుల పొడవు ఉన్నప్పుడు) కొత్త పంటకు మొలకలుగా వాడుకోవచ్చు. నాటడానికి విత్తనాలను కూడా ఉపయోగించవచ్చు.
మట్టి
అరటి చెట్లు చాలా రకాల నేలల్లో పెరుగుతాయి కానీ బాగా వృద్ధి చెందాలంటే, వీటికి మంచి సారవంతమైన, లోతైన, బాగా ఆరిన నేలలో నాటాలి, అవి అటవీ గరప నేలలు, రాతి ఇసుక, మార్ల్, ఎర్ర లాటరైట్ నేలలు, అగ్నిపర్వత బూడిద, ఇసుక బంకమన్ను లేదా భారీ బంకమన్ను నేలలు కావచ్చు . ఇవి 5.5 నుంచి 6.5 మధ్య పీహెచ్ ఉన్న ఆమ్ల మట్టిని ఇష్టపడతాయి. ఉప్పు నేలలను అరటి తట్టుకోలేదు. అరటి మొక్కలు బాగా పెరగడానికి మట్టి రకంలో కీలకమైన అంశం మంచి మురుగు నీటి వ్యవస్థ. నది లోయల్లోని ఒడ్డున కొట్టుకుపోయిన నేలలు అరటి పండించడానికి బాగా అనుకూలం.
వాతావరణం
అరటి పువ్వు ఏర్పడడానికి అరటి మొక్కకు 15-35°C ఉష్ణోగ్రత వద్ద 10 - 15 నెలల మంచు లేని పరిస్థితులు అవసరం. ఉష్ణోగ్రత 53°F (11.5°C) కంటే తగ్గినప్పుడు చాలా అరటి రకాల ఎదుగుదల ఆగిపోతుంది. 80°F (26.5°C) వద్ద ఎదుగుదల మందగిస్తుంది మరియు ఉష్ణోగ్రత 100°F (38°C) కి చేరుకున్నప్పుడు ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. పూర్తి ఎండలో అరటిపండ్లు బాగా ఎదిగినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు మరియు ప్రకాశవంతమైన సూర్యకాంతి ఆకులు మరియు పండ్లను మాడ్చి వేస్తాయి. గడ్డకట్టే ఉష్ణోగ్రతలు ఆకులను చంపుతాయి. అరటి చెట్లు గాలికి పడిపోయే అవకాశం ఉంది.