వ్యవసాయంలో సమూల మార్పును సృష్టిస్తోంది

మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న-స్థాయి రైతులు మరియు వ్యవసాయ-రిటైలర్లకు సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్ మరియు శాస్త్రీయ పరిశోధనలను ఉపయోగించి, సరైన పరిష్కారాలను అందించడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం మరియు వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం మా లక్ష్యం.

డిజిటల్ వ్యవసాయంతో చిన్న తరహా రైతులకు సాధికారత కల్పిస్తున్నాము

ప్రపంచానికి ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో వారు ఎంత ముఖ్యమైనవారో మరియు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మేము అర్థం చేసుకున్నాము. వనరులు, సాంకేతికత మరియు సమాచారానికి వారికి ఉన్న పరిమిత ప్రాప్యత వారి వ్యవసాయాన్ని మెరుగుపరచడం కష్టతరం చేస్తుంది. అందుకే మేము రైతులకు సమాచారం, సాంకేతికత మరియు వ్యవసాయ చిట్కాలను అందచేసే ఉచిత యాప్ ప్లాంటిక్స్‌ని రూపొందించాము.

స్థిరమైన మరియు లాభదాయక వ్యవసాయానికి మద్దతు ఇస్తుంది

మన వ్యవసాయ వ్యవస్థ యొక్క వెన్నెముక అయిన సన్నకారు రైతులు మరియు వ్యవసాయ-రిటైలర్లను శక్తివంతం చేయాలని మేము నమ్ముతున్నాము. మా రెండు యాప్‌లు, ప్లాంటిక్స్ మరియు ప్లాంటిక్స్ పార్టనర్, కేవలం సాధనాలు మాత్రమే కాదు; వ్యవసాయ పరిశ్రమను మార్చే ఉద్యమానికి అవి పునాది, రైతులకు వారి జీవన ఆదాయం మరియు జీవనోపాధిని మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి మరియు వ్యవసాయ-రిటైలర్లు వారి వ్యవసాయ సమాజానికి మెరుగైన సేవలందించగలరు.

మీ వ్యవసాయ ఆదాయాన్ని మరింత పెంచుకోండి

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

మీ అగ్రి రిటైల్ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోండి

ప్లాంటిక్స్ పార్ట్‌నర్ అవ్వండి

ఫోకస్, కేర్, ఎనేబుల్, షేర్!

మేము దేనిని విశ్వసిస్తామో మరియు మా వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో వాటిని మా బ్రాండ్ విలువలు సూచిస్తాయి. అవి మేము చేసే ప్రతి పనిని తీర్చిదిద్దే మార్గదర్శక సూత్రాలు.

దృష్టి

సంప్రదాయ ఆలోచనలను సవాలు చేసినప్పటికీ సరైన పని చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. సాధ్యమైనంత పెద్ద ప్రభావాన్ని మరియు గొప్ప విలువను సృష్టించడానికి మేము కట్టుబడి ఉన్నాము.

సంరక్షణ

సంరక్షణ అంటే మన చర్యలు మన సామాజిక మరియు సహజ పర్యావరణాలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడం. అంతా ఒకదానితో మరొకటి కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి మేము చేసే ప్రతి పనిలో దయ, సానుభూతి మరియు సహాయకారిగా ఉండటానికి ప్రయత్నిస్తాము.

ఎనేబుల్

మేము వ్యక్తులు ఎదగడానికి మరియు మెరుగైన జీవితాలను గడపడానికి సహాయపడే స్మార్ట్ ఎంపికలను ఎంచుకోవడంలో సహాయపడతాము. ఇది మరింత స్వాతంత్య్రం, స్వావలంబన మరియు విజయానికి దారితీస్తుంది.

షేర్ చేయండి

విశ్వసనీయమైన సమాచారం మా వినియోగదారులకు మెరుగైన ఫలితాలను సాధించడంలో సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాము. కాబట్టి మేము ఖచ్చితమైన, వ్యవసాయ సంబంధిత మరియు నిష్పాక్షికమైన సమాచారాన్ని ఎక్కడ మరియు ఎప్పుడు అవసరమో ఆ విధంగా అందిస్తాము.

ఒక ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం

జర్మనీ మరియు భారతదేశంలో కార్యాలయాలను కలిగి ఉన్న అంతర్జాతీయ కంపెనీగా, అన్ని వర్గాల మరియు విభిన్న సామాజిక నేపథ్యాల వ్యక్తులకు సమాన అవకాశాలను అందించడం మా లక్ష్యం. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందగల వాతావరణాన్ని సృష్టించడం, పురోగతి, చాతుర్యత మరియు నిజాయితీకి విలువనిచ్చే కార్యాలయ సంస్కృతిని పెంపొందించడానికి మేము అంకితభావంతో ఉన్నాము.

కస్టమర్ ఫస్ట్
కస్టమర్ యొక్క వాయిస్
మా వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించడానికి మేము కస్టమర్ ఫీడ్ బ్యాక్ మరియు ఆకాంక్షలపై దృష్టి పెడతాము.
పీపుల్ ఫోకస్డ్
పని-జీవితం సమతుల్యత
మేము ఉద్యోగుల వ్యక్తిగత అవసరాలను పరిగణనలోకి తీసుకుంటాము మరియు పని సమయంలో మరియు తరువాత వారి సమయాన్ని ఆస్వాదించమని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తాము.
ప్రగతికి మూల స్తంభాలు
దార్శనికుడు
మేము బలమైన లక్ష్యంతో కూడిన ఆశయం కలిగి ఉన్నాము. మా ప్రయత్నాలలో వినూత్నంగా మరియు రాబోయే కాలానికి అనుగుణంగా ఉండాలని మేము నిశ్చయించుకున్నాము.
నైతిక ప్రవర్తన
ఇంక్లూజీవిటి
లింగం, మతం, కులం, జాతి, ఆదాయ వర్గం మరియు వైకల్యంతో సంబంధం లేకుండా మేము అందరినీ సమానంగా చూస్తాము మరియు స్వాగతిస్తాము.