పెండలం

పెండలంలో మొగ్గ కణ నాశము (కాసావా బడ్ నెక్రోసిస్)

Unknown Pathogen

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • కాండం పైన గోధుమరంగు లేదా బూడిదరంగు శిలీంధ్ర కవరింగ్ ప్యాచీలుగా ఈ వ్యాధి కనిపిస్తుంది.
  • నిర్జీవమైన ప్రాంతాలు మొగ్గలను కప్పివేసి వాటి మొలకెత్తే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
పెండలం

పెండలం

లక్షణాలు

కాండం పైన గోధుమరంగు లేదా బూడిద శిలీంధ్ర కవరింగ్ ప్యాచీలుగాఈ పెండలం మొగ్గ నెక్రోసిస్ వ్యాధి కనిపిస్తుంది. ఈ ప్యాచీలు కాండం అంతటా విస్తరిస్తాయి మరియు పైపొరపై ఇవి క్రమంగా పెరిగి శిలీంధ్ర ద్రవ్యరాశికి అనుగుణంగా ఉంటాయి. అప్పుడప్పుడు ఇవి ఆకులపై కూడా కనిపిస్తాయి. ఫంగస్ పెరిజి మొక్కను తినడం వలన మొక్కల కణజాలాలు నిర్జీవమవుతాయి ఈ నిర్జీవ ప్రాంతాలు తరచూ కాండం మీద మొగ్గలను కప్పివేస్తాయి మరియు ఇవి చనిపోయి, కాండం అంటు యొక్క మొలకెత్తే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ ఫంగస్‌ ను నియంత్రించడానికి తెలిసిన జీవ నియంత్రణ పరిష్కారాలు ఏవీ లేవు. మీకు ఏమైనా తెలిస్తే మమ్మల్ని సంప్రదించండి

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సాధారణ శిలీంధ్ర నాశక పిచికారీలు చాలా అరుదుగా సిఫారసు చేయబడతాయి. అందువలన, నివారణా చర్యలు మరియు పొలంలో మంచి సాగు పద్ధతులపై దృష్ఠి కేంద్రీకరించాలి.

దీనికి కారణమేమిటి?

పెండలంలో మొగ్గ కణ నాశనం, కాండం మరియు ఆకుల ఉపరితలంపై సంభవించే ఫంగస్ వలన వస్తుంది. తెగులు సోకిన పెండలం మొక్కలు వ్యాధి యొక్క ఐనోకులం యొక్క ప్రధాన మూలం. పంటకోత తర్వాత భూమిపై అవశేషాలుగా ఉండే కాండం మరియు ఆకులు కూడా వ్యాధిని వ్యాపింపచేస్తాయి. తరువాత ఈ అవశేషాలపై ఉత్పత్తి చేయబడిన శిలీంధ్ర బీజాంశాలు గాలి ద్వారా మొక్క నుండి మొక్కకు లేదా ఇతర పొలాలకు వ్యాపిస్తాయి. అయినప్పటికీ, తెగులు సోకిన మొక్క అంట్లను నాటడానికి ఉపయోగించడం ఈ వైరస్ యొక్క ప్రధాన వాహకం. తెగులు సోకిన మొగ్గలతో ఉన్న ఈ అంటు మొక్కలు మొలకెత్తడంలో విఫలమవుతాయి మరియు పొలంలో వీటిని సులభంగా గుర్తించవచ్చు. గడ్డి, తృణధాన్యాలు, అరటి మరియు మామిడి ఈ ఫంగస్ కు ప్రత్యామ్నాయ అతిథేయ మొక్కలు. సాధారణంగా ఈ వ్యాధి తేమతో కూడిన వాతావరణంలో పెరిగే పెండలంలో కనిపిస్తుంది. అధిక సాపేక్ష ఆర్ద్రత కలిగి, సరైన శుభ్రత పాటించని పొలాల్లో ఈ వ్యాధి వృద్ధి చెందే అవకాశం అధికంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • నాటడానికి (ధృవీకరించబడిన మూలాలు) కోసం వ్యాధి రహిత కాండం అంట్లను ఉపయోగించాలని నిర్ధారించుకోండి.
  • అందుబాటులో ఉంటే నిరోధక రకాలు వాడండి.
  • వెంటిలేషన్ ఉండేలా కలుపు నిర్వహణ మరియు మొక్కల మధ్య తగినంత స్థలం వదలడం చాలా ముఖ్యం, ఇది పొలంలో ఫంగస్ మొత్తాన్ని తగ్గిస్తుంది.
  • పంటను గమనిస్తూ, తెగులు సోకిన మొక్కలను (కాల్చడం లేదా పాతిపెట్టడం ద్వారా) తొలగించి నాశనం చేయండి మరియు వాటి స్థానంలో ఆరోగ్యంగా వున్న మొక్కలతో భర్తీ చేయండి.
  • మొక్కల అవశేషాలను తొలగించి పొలం నుండి తగినంత దూరంలో నాశనం చేయాలి.
  • ఈ తెగులును అతిథేయులు కాని మొక్కలతో పంట మార్పిడి చేయడం వలన పొలంలో ఫంగస్ మనుగడను నివారిస్తుంది.
  • పొలం పని తర్వాత మీ పరికరాలను బాగా శుభ్రం చేయండి.
  • తెగులు సోకిన పొలంలో అంటు మొక్కలను ఇతర పొలాలకు రవాణా చేయవద్దు.
  • వ్యాధిని నివారించడానికి, పొలంలో ఉపయోగించిన తరువాత వ్యవసాయ పరికరాలను సాధారణ బ్లీచ్ ద్రావణంతో శుభ్రం చేయాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి