వంకాయ

వంకాయలో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు

Leucinodes orbonalis

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • పువ్వులు మరియు మొగ్గలపై ఆహారంగా తిన్న గుర్తులు కనిపిస్తాయి.
  • లేత రెమ్మల కొనలు మరియు కాడలు వాడిపోతాయి.
  • పండుపైన ప్రవేశం మరియు బైటకుపోయే రంధ్రాలను పురుగుల ఎండిపోయిన మలంతో మూసేస్తాయి.
  • పండు లోపల ఖాళి అయ్యి మలపదార్ధంతో నిండి పోతుంది.

లో కూడా చూడవచ్చు


వంకాయ

లక్షణాలు

లార్వా తినడం వలన రెమ్మ కొనలు వాడిపోయి వుంటాయి. ఇది ఈ పురుగు మొక్కలను తినడం వలన కనిపించే మొట్టమొదటి లక్షణం. తరువాత పువ్వులు, పూమొగ్గలు మరియు కాండాలు కూడా ప్రభావితమవుతాయి. లేత లార్వా పెద్ద ఆకు మధ్య ఈనెల వద్ద మరియు ఉప రెమ్మల ద్వారా రంద్రాలు చేసి కాండం దగ్గరికి చొచ్చుకొనిపోయి "డెడ్ హార్ట్" కు కారణం అవుతుంది. పెద్ద లార్వా పండ్లలోకి రంద్రాలు చేసి దానిని ఎండిన మలంతో మూసివేస్తుంది. పండు లోపల డొల్లగా వుండి, రంగుమారి మరియు పొడితో నిండి ఉంటుంది. తెగులు ఉదృతంగా ఉన్నప్పుడు వాడిపోవడం మరియు మొక్కలు బలహీనపడటం జరిగి దిగుబడి నష్టానికి దారి తీస్తుంది. అటువంటి మొక్కల కాయలు వాడకానికి పనికి రాకపోవచ్చు. కీటకాల సంతతి ఎక్కువగా ఉన్నప్పుడు అనేక కాలాలపాటు చాలా తీవ్రంగా నష్టం ఉంటుంది

Recommendations

సేంద్రీయ నియంత్రణ

చాల రకాల పరాన్నజీవులు L.ఒర్బనలిస్ లార్వాను తింటాయి. ఉదాహరణకు ప్రిస్టోమెరస్ టెస్టసేస్, క్రెమాస్టస్ ఫ్లవూర్బిటాలిస్ మరియు షిరాకియా స్యెనోబిక్ వంటి అనేక పరాన్న జీవులు. స్యుడోపెరిచట, బ్రాకోనిడ్స్, ఆరుయి ఫనేరోటోమా వంటి పరాన్నజీవులను పొలంలో ప్రవేశపెట్టాలి. వేప విత్తన గుజ్జు సారం (NSKE) 5% లేదా స్పినోసాడ్ ను కూడా తెగులు సోకిన కాయలకు వాడవచ్చు. గుడ్లను పొదగకుండా చేయుటకు జిగురు వంటి అతుక్కునే వలలను 10 సెం.మీ.పై అంచు మీద ఉంచవచ్చు. ఇవి అందుబాటులో లేనట్లయితే, 2 మీటర్లకంటే ఎత్తు మీద వలను 40 సెం.మీ. విస్తరించి, దానిని నిలువు వలకు వ్యతిరేకంగా 80-85 డిగ్రీల కోణంలోకి తీసుకురావాలి

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తెగులు దశను బట్టి మరియు సీజన్ బట్టి పురుగు మందులు వాడాలి. రెగ్యులర్ వ్యవధిలో సెవిమోల్ (0.1%), ఎండ్రిన్ (0.04%), లేదా మలాథియాన్ (0.1%) లను పిచికారీ చేసి ఈ తెగులును నియంత్రణలో ఉంచవచ్చు. పండు పరిపక్వదశ మరియు కోత సమయంలో కృత్రిమ పెరిత్రాయిడ్లను మరియు పురుగుల మందులను ఉపయోగించవద్దు.

దీనికి కారణమేమిటి?

ల్యుసినోడ్స్ ఒర్బోనలిస్ క్రిముల లార్వా ఈ నష్టానికి కారణం అవుతాయి వసంతకాలంలో, ఆడక్రిములు తెల్లని గుడ్లు ఒక్కొక్కటిగా లేదా ఆకులు దిగువ భాగంలో, కాండం, మొగ్గలు, లేదా కాయ యొక్క బేస్ వద్ద సమూహాలుగా పెడుతాయి. 3 నుండి 5 రోజుల తరువాత లార్వాలు పొదగబడి నేరుగా పండులోకి నేరుగా రంద్రాలు చేస్తాయి. పూర్తిగా పెరిగిన లార్వా లావుగా, గులాబీ రంగులో, గోధుమరంగు తలతో ఉంటుంది. తినడం పుర్తయ్యాకా ప్యూపా బూడిద రంగులోకి మారి, కాండాలు, ఎండిన కొమ్మలు లేదా రాలిన ఆకుల మీద గూడు అల్లుకుంటుంది. వీటి ప్యూపా దశ 6 నుంచి 8 రోజులు ఉంటుంది. పెద్ద కీటకాలు రెండు నుండి ఐదు రోజులు జీవిస్తాయి. వాతావరణ పరిస్థితులపై ఆధారపడి 21 నుండి 43 రోజులు వాటి జీవిత దశ ఉంటుంది. వాటి చురుకైన దశలో ఒక సంవత్సరంలో వీటికి ఐదు తరాల వరకూ ఉంటాయి. చలికాలం సమయంలో లార్వా నేల లోపల నిద్రాణ స్థితిలో గడుపుతాయి. టమోటా మరియు బంగాళాదుంప వంటి అనేక ఇతర సొలనసియస్ మొక్కలను ఈ పురుగులు ఆహారంగా తింటాయి.


నివారణా చర్యలు

  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే తెగులు నిరోధక లేదా తట్టుకునే విత్తన రకాలను నాటండి.
  • వీలైతే రెండు సీజన్ల వరకు సోపు, ఒముమ్, కొత్తిమీర మరియు నిగెల్లా వంటి ఇతర జాతులతో వ్యాధి ఆకర్షక మొక్కలను అంతర పంటగా వేయండి.
  • తెగులు లక్షణాల కొరకు మీ పొలాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ వుండండి.
  • తెగులుకు గురైన మొక్కలను, మొక్కల భాగాలను సేకరించి పొలానికి దూరంగా తీసుకువెళ్లి నాశనం చేయండి.
  • రాలిన ఆకులు, కాయలు, కొమ్మలు లేకుండా పొలాన్ని శుభ్రంగా వుంచండి.
  • తెగులు ప్రభావం మొక్క మీద ఎక్కువగా వుంటే ఆ తెగులు సోకిన మొక్కలను తొలగించండి.
  • కీటకాలు ఇతర పంటలకు లేదా పొలాలకు వలస పోకుండా నైలాన్ నెట్ ను అడ్డంకిగా ఉంచండి.
  • కీటకాలను పట్టుకొనుటకు లింగాకర్షక బుట్టలను వాడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి