ప్రత్తి

గులాబీ రంగు ప్రత్తి కాయ తొలుచు పురుగు

Pectinophora gossypiella

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • పూమొగ్గల్లో పురుగులు తిన్న నష్టం కనిపిస్తుంది.
  • పూ రేకులను పట్టు దారాలు దగ్గరగా కట్టి వేస్తాయి.
  • ప్రత్తి కాయల్లో పురుగులు తిన్న రంధ్రాలు కనిపిస్తాయి.
  • కోలాకారపు రెక్కలతో బూడిద-గోధుమ రంగు చిమ్మటలు.
  • ఈ లార్వా తెల్లని శరీరంతో, వెడల్పాటి గులాబీ రంగు పట్టీలు మరియు నల్లని తలను కలిగివుంటుంది.

లో కూడా చూడవచ్చు


ప్రత్తి

లక్షణాలు

గులాబీ పురుగు, మొగ్గలు తెరుచుకోకపోవడం, కాయలు రాలిపోవడం. ప్రత్తి పాడవ్వడం మరియు విత్తనాల నష్టానికి కారణమవుతుంది. వేసవి ప్రారంభంలో, మొదటి తరం లార్వా పూ మొగ్గలను తింటుంది. ఈ పూమొగ్గలు ఎదిగి వికసిస్తాయి. వ్యాధి సోకిన పువ్వులలో పూరేకులు లార్వా పట్టు దారాలతో కట్టివేయబడి ఉండవచ్చు. లార్వా రెండవ జనరేషన్, విత్తనాలను తినడానికి దూదిలోనుండి కాయలకు రంధ్రాలు చేస్తాయి. దూది కత్తిరించబడి మరకలు పడుతుంది. దీనివలన ప్రత్తి నాణ్యత తగ్గుతుంది. ఈ నష్టం, కాయలపై పులిపురుల రూపంలో కార్పల్ గోడల లోపలి భాగంలో కనిపిస్తుంది. అదనంగా ఈ లార్వా కాయ లోపల బోలుగా చేయకుండా బోల్ వార్మ్ వలే మల పదార్ధాన్ని బైట వదిలివేస్తుంది. తరచుగా, కాయ కుళ్ళు ఫంగస్ వంటి అవకాశవాద సూక్ష్మ జీవులు లార్వా చేసిన ప్రవేశం లేదా నిష్క్రమణ రంధ్రాల ద్వారా కాయలకు సోకుతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

పెక్సినోఫోరా గోసిపైయెల్లా నుండి సేకరించిన సెక్స్ ఫేరోమోన్లను వ్యాధి సోకిన పొలాలు అంతటా పిచికారీ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఆడ పురుగులు మరియు సహచరులను గుర్తించే మగ పురుగుల సామర్ధ్యాన్ని ఇది బాగా తగ్గిస్తుంది. స్పైనోసాడ్ లేదా బాసిల్లస్ తురింగియెన్సిస్ లను సకాలంలో వాడడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. విత్తిన 45 రోజుల తర్వాత, పుష్పించే దశలో లింగాకర్షక బుట్టలను (ఎకరానికి 8)పొలంలో ఏర్పాటు చేసి పంట ఆఖరి కోత పూర్తయేవరకూ వాటిని పొలంలోనే ఉంచండి. ప్రతి 21 రోజులకు ఒకసారి ఈ బుట్టలను మార్చండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. గులాబీ పురుగు చిమ్మటలను చంపడానికి క్లోర్ఫైరీఫోస్, ఎస్ఫెన్వలెరేట్ లేదా ఇండోక్సీకార్బ్ కలిగిన ఫార్ములేషన్స్ ను ఆకులపై పిచికారీగా ఉపయోగించవచ్చు. గామా - మరియు లాంబ్డా-సైహలోత్రిన్ మరియు బైఫెంత్రిన్ ఇతర క్రియాశీల మందులు. సాధారణంగా మొక్క కణజాలం లోపల పురుగులు ఉన్న సందర్భంలో ఎటువంటి చికిత్స సిఫారస్సు చేయబడలేదు. విత్తిన 45 రోజుల తర్వాత, పుష్పించే దశలో లింగాకర్షక బుట్టలను (ఎకరానికి 8)పొలంలో ఏర్పాటు చేసి పంట పూర్తయేవరకూ వాటిని పొలంలోనే ఉంచండి

దీనికి కారణమేమిటి?

పెక్టినోఫోరా గాస్సిఫియెల్లా అనే పురుగు వలన ప్రత్తి కాయలను ఈ నష్టం కలుగుతుంది. పెద్ద పురుగులు వివిధ పరిమాణంలో సాధారణంగా బూడిద గోధుమ రంగులో ఉంటాయి. ఇవి పొడవైన సన్నని శరీరంతో, బూడిద-గోధుమ రంగులో, కోలగా వుండే గట్టి జాలరు గల రెక్కలను కలిగి వుంటాయి. ఆడ పురుగులు పూ మొగ్గలు మరియు పచ్చని కాయల కాలిక్స్ క్రింద ఒకొక్కటిగా గ్రుడ్లను పెడతాయి. ఇవి 4-5 రోజులలో పొదగబడి, పూలను, పింజలను ఆశిస్తాయి. చిన్న లార్వాలు ముదురు గోదుమ రంగు తలతో మరియు తెల్లని శరీరం కలిగి వెనుక భాగంలో త్రికోణ ఆకారంలో ఈకలు ఉంటాయి. ఇవి ఎదిగేకొలదీ గులాబీరంగులోనికి మారుతాయి. ఇవి మొగ్గలో ఆహారాన్ని వెతుక్కుంటాయి. లార్వా ప్యూపాగా మారడానికి 10-14 రోజుల వ్యవధి పడుతుంది. గులాబీ రంగు తొలుచు పురుగు యొక్క అభివృద్ధి మోస్తరు స్థాయి నుండి అధిక ఉష్ణోగ్రతలకు అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా 37.5°C ఉష్ణోగ్రత కంటే పైన వీటి పెరుగుదలకు అనుకూలంగా వుంటుంది.


నివారణా చర్యలు

  • ఈ పురుగు సంక్రమణ ఆలస్యంగా మొదలవుతుంది కాబట్టి, త్వరగా పక్వానికి వచ్చే పత్తి రకాలను ఎన్నుకోవాలి.
  • లక్షణాలను కనుగొనుటకు క్రమం తప్పకుండా పొలాన్ని పర్యవేక్షిస్తూ ఉండాలి.
  • వీటి జనాభా ఎంత వుందో తెలుసుకోవడానికి లింగాకర్షక బుట్టలను పొలంలో అమర్చండి.
  • వీటి సంఖ్యను తగ్గించడానికి, శీతాకాలం మరియు వర్షాకాలం మధ్య నీరు పెట్టడాన్ని సరిగ్గా ప్లాన్ చేయండి ఉదాహరణకు పొలంలో నీరు బాగా ఎక్కువగా పెట్టడం.
  • వీటిని వేటాడే కీటకాలు ప్రభావితం కాకుండా మరియు ఇవి మందులకు నిరోధకతను పెంచుకోకుండా నివారించడానికి పురుగుమందులను జాగ్రత్తగా వాడండి.
  • కీటకాల జనాభా పెరగడానికి ముందే పంట కోతలు పూర్తి చేయండి.
  • పంట కోసిన వెంటనే పంట అవశేషాలను నాశనం చేయండి.
  • వేసవి కాలంలో పొలంలో పంటలు ఏమీ సాగు చేయకుండా నేలకు విశ్రాంతి ఇవ్వండి.
  • పంట మార్పిడి ద్వారా 7 నెలల పాటు ప్రత్తి పంటను వేయకండి.
  • (ఉదాహరణకు చిరు ధాన్యాలు లేదా అల్ఫాల్ఫా).

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి