నిమ్మజాతి

బ్లాక్ పార్లటోరియా స్కేల్

Parlatoria ziziphi

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • నల్లటి సూక్షమైన పొలుసులు ఆకులు, పండ్లు మరియు చిగుర్లను కప్పివేస్తాయి.
  • పసుపు రంగు చారలు మరియు మచ్చలు ఆకులపైన మరియు పండ్లపైన ఏర్పడతాయి.
  • ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటే ఆకులు ముందుగానే రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

రెమ్మలు, ఆకులు మరియు పండ్లను తినే, బాగా చిన్న పరిమాణంలో వున్న నల్లని క్రిముల ఉనికి ద్వారా ఈ P. జిజిఫి ను గుర్తించవచ్చు. ఈ తెగులు తీవ్రత బాగా అధికంగా వున్నప్పుడు ఎట్టి పరిస్థితులలోను తొలగించడానికి వీలు కానీ ఉప దీర్ఘచతురస్రాకార బ్లాక్ స్కేల్స్ మరియు వాటి తెల్లని పాకే క్రిములు పండ్లు, ఆకులు మరియు చిగుర్లను పూర్తిగా కప్పివేస్తాయి. మొక్కల కణద్రవ్యం క్షీణించడం వలన చెట్లు వాటి సత్తువ మరియు బలాన్ని కోల్పోయి ఈ క్రిములు తిన్న ప్రాంతంలో పసుపు రంగు మచ్చలు లేదా చారలు ఏర్పడతాయి. ఇవి తినడం వలన కొమ్మలు చనిపోతాయి మరియు పండ్ల పెరుగుదలను తీవ్రంగా ప్రభావితం చేయడం వలన పండ్లు తరచుగా రూపం కోల్పోతాయి. దీని ఫలితంగా చెట్లకు అకాల వ్యార్థకం వచ్చి ఆకులు మరియు పండ్లు రాలిపోతాయి ఇంకా పండ్ల దిగుబడి మరియు నాణ్యత తగ్గుతుంది. ఈ జాతులు నిమ్మ జాతి పంటలో చాలా ముఖ్యమైన చీడగా మారాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

స్కూటెల్లిస్టా కాయ్రులియా, డైవర్సినెర్వస్ ఏలెగన్స్ మరియు మెటాఫికస్ హెల్వోలుస్ వంటి కొన్ని పరాన్న జీవి కందిరీగలు మరియు జెనెర ఆస్పిడియోతిఫాగస్ మరియు అఫిటీస్ జాతులు కూడా P. జిజిఫి ను నియంత్రించడానికి సహాయపడతాయి. లేడీ బర్డ్ (చిలోకోరస్ బిపిస్టులటీస్ లేదా C. నిగ్రట, లిండోరస్ లోఫన్థాయ్ మరియు ఆర్కస్ చాలీబియస్ ఈ బ్లాక్ స్కేల్ ను నాశనం చేస్తాయి. కనోలా ఆయిల్ లేదా ఫంగస్ జాతికి చెందిన జీవన పురుగుల మందులు కూడా ఈ బ్లాక్ స్కేల్ ను నిర్మూలించడానికి ఉపయోగించవచ్చు. పర్యావరణ పరంగా ముఖ్యమైన కీటకాలకు నష్టం కలగకుండా వైట్ ఆయిల్ ద్రావణాన్ని (ఉదాహరణకు 4 భాగాల వెజిటల్ ఆయిల్ కు ఒక భాగం పాత్రలు శుభ్రపరిచే డిటర్జెంట్) ) ఈ బ్లాక్ స్కేల్ పైన ప్రభావవంతంగా ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంత వరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ బ్లాక్ స్కేల్ మొదటి తరం పాకే క్రిములను నియంత్రించడానికి పుష్పించే దశ తర్వాత నుండి వేసవి పిచికారీల మధ్య సమయంలో మందులు వాడాలి. క్లోర్ఫెరిఫోస్, కార్బరిల్, మలాథియాన్, లేదా డైమేథోయేట్ సిఫార్స్ చేయబడ్డాయి. కానీ ఈ మందులు బ్లాక్ స్కేల్ యొక్క సహజ శత్రువులకు కూడా నష్టం కలుగచేస్తాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా వాడవలసి వుంటుంది.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు పార్లటోరియా జిజిఫి వలన కలుగుతాయి. వీటికి నిమ్మ జాతి మొక్కలు అతిధులుగా ఉంటాయి. వీటికి ఇష్టపడే స్థిర ప్రదేశాలు ఆకులు అయినప్పటికీ, ఇవి పండ్లు మరియు శాఖల పైన కూడా స్థిరపడి ఆహారాన్ని తీసుకుంటాయి. దీని అన్ని వృద్ధి దశలు సంవత్సరం పొడవునా ఉంటాయి. ఒక సంవత్సరంలో ఇది 2 నుండి 7 వరకు అనేక తరాలను పూర్తి చేస్తుందని ఇది సూచిస్తుంది. ఈ సంఖ్య నిమ్మ జాతి చెట్లు పెరిగే ప్రాంతం పైన ఆధారపడి ఉంటుంది. అనుకూల పరిస్థితులలో, సిసిలీలో, దీని పూర్తి జీవిత చక్రం 30-40 రోజులు ఉంటుంది. వెచ్చని వాతావరణ పరిస్థితులు వుండే ట్యునీసియాలో అయితే 70-80 రోజులు వరకు ఉంటుంది. చల్లని వాతావరణంలో 160 రోజుల వరకు ఉంటుంది.


నివారణా చర్యలు

  • ఈ తెగులు లక్షణాలకోసం తోటలను క్రమం తప్పకుండా గమనిస్తూ వుండండి.
  • దీని తీవ్రత తక్కువగా వున్నప్పుడు మొక్కల భాగాలను చేతితో తొలగించడం లేదా కీటకాలను చేతులతో నలిపివేయడం చేసి దీనిని సమర్ధవంతంగా నివారించవచ్చు.
  • తెగులు సోకిన చెట్ల భాగాలను తొలగించి వాటిని కాల్చివేయడం కానీ లేదా తోటకు దూరంగా బాగా లోతులో పూడ్చి పెట్టడం కానీ చేయాలి.
  • వీటి సహజ శత్రువుల జనాభాకు నష్టం కలగకుండా చూడడానికి అధిక మోతాదులో పురుగు మందుల వాడకం నివారించండి.
  • ఒక చెట్టు ఆకులు ఇంకొక చెట్టుకు తగలకుండా ఉండడానికి చెట్ల ఆకులను కత్తిరించండి.
  • తెగులు సోకిన మొక్కల పదార్ధాలను ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి రవాణా చేయకండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి