మామిడి

మామిడిలో పండు తొలుచు పురుగు

Citripestis eutraphera

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • దీని ఉధృతి చిన్న కాయ దశ నుంచి పెద్ద కాయ దశ వరకు ఉంటుంది.
  • పండ్లు పగిలిపోయి ముందుగానే రాలిపోతాయి పిల్ల లార్వాలు నల్లని తలతో పాలిపోయిన గులాభీ రంగులో ఉండితరువాత ఎర్రటి గోధుమ రంగులోకి మారతాయి.
  • మొక్క భాగములో నల్లటి రంధ్రముతో ఎండిన మామిడి కాయ/పిందెలు గుత్తులు చెట్టుకు వ్రేలాడడం ఈ తెగులు ప్రధానమైన లక్షణం.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

మామిడి

లక్షణాలు

బటాణీ లేదా నిమ్మ కాయ పరిమాణంలో పండ్లు వున్నప్పుడు నల్లని రంద్రాలను ఈ పండ్లపై చూడవచ్చు. ఈ రంద్రాల చుట్టూ పాలిపోయిన అతుకులు ఉంటాయి. ఏ రంద్రాల నుండి పురుగులు చప్పరించి వదిలేసిన పండు గుజ్జు మరియు కణద్రవ్యం బైటకి కారుతూ ఉంటుంది. ఈ పురుగులు బాగా అధికంగా రంద్రాలు చేయడం వలన పండ్లు పగిలిపోవచ్చు. ఆ తర్వాత ఈ లార్వా ఇంకొక పండు దగ్గరకు వెళ్ళిపోతుంది. బైటకు వచ్చిన లార్వా పాలిపోయిన గులాబీ రంగులో ఉండి ముదురు గోధుమ రంగు తలను కలిగి ఉంటాయి. తరువాత ఇవి ఎర్రటి గోధుమ రంగులోకి మారతాయి. ఒకొక్క గొంగళి పురుగు, ఒకటి కన్నా ఎక్కువ కాయలకు నష్టం కలుగజేయును. సాధారణముగా ఒక్కొక్క మామిడి కాయనందు 4-6 గొంగళి పురుగులు ఉండును. ఏ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు కొన్ని వందల పురుగులు చెట్లపై చూడవచ్చు. ఈ తెగులు సోకిన పండ్లు ముందుగానే రాలి పడిపోతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

మామిడి పూత వచ్చే దశ నుండి రెండు నెలల వరకు వేపగింజల కాషాయం 5% లేదా వేపనూనె 1% (లీటరు నీటికి 10 మి.లీ.) పిచికారీ చేసి ఈ పురుగులను అదుపు చేయవచ్చు. ఈ పురుగుల సహజ శత్రు కీటకాల జనాభాను సంరక్షించండి( ఉదాహరణకు రిచియం అట్రిసిమమ్ కందిరీగలు). ఇవి లార్వాను తింటాయి. మరియు ట్రైకొగ్రామా చిల్లినోస్ మరియు ట్రైకొగ్రామా చిలోత్రియ ఈ పురుగుల గుడ్లను ఆశిస్తాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. థియక్లోప్రిడ్ కలిగిన ద్రావణాన్ని పిచికారీ చేయడం వలన ఈ మామిడి పండు తొలుచు పురుగు తెగులును నియంత్రించవచ్చు. క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. ద్రావణాన్ని కూడా వీటిని నియంత్రించడానికి ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

పెద్ద పురుగులు ముదురు గోధుమ రంగు ముందటి రెక్కలు కలిగి మరియు లేత తెలుపు బూడిద రంగు వెనకటి రెక్కలు కలిగి ఉంటాయి. వీటి రెక్కల విస్తారం 20 ఎం. ఎం. కలిగి ఉంటుంది. పెద్ద పురుగులు దాదాపుగా ఒక వారం రోజుల పాటు జీవించి 125-450 వరకు గుడ్లను పెడతాయి. లార్వా పండ్లలోకి వెళ్లి గుజ్జును తింటాయి. మొత్తం పెరిగిన గొంగళి పురుగు 20 ఎం. ఎం. పొడవు కలిగి ఉంటుంది. పండు పడిపోయిన ప్రాంతం ప్రక్కన ఇవి పట్టు లాంటి గూడులో ప్యుపాగా మారుతుంది. ఇది పెరగటానికి 30 రోజుల సమయం పడుతుంది. పండ్ల రవాణా ద్వారా ఇది ఇతరప్రాంతాలకు విస్తరిస్తుంది. ఇవి ఒక తోటలోనుండి ఇంకొక తోటలోకి ఎగురుకుంటా కూడా వెళ్లగలవు.


నివారణా చర్యలు

  • మామిడి పంట కోతలు పూర్తి అయిన తరువాత ఎండుకొమ్మలను తీసివేసి నాశనం చేయాలి.
  • పండు తయారయ్యే సమయంలో చెట్టుకు ఏమైనా తెగుళ్లు సోకాయేమో గమనించాలి.
  • మామిడి పంటకాలము పూర్తయిన తరువాత ఎండు కొమ్మలు/కాండము పగుళ్లలో స్దబ్ధ స్థితిలో ఉన్న గొంగళిపురుగులను నాశనం చేయాలి.
  • గాలి నిరోధాలు ఏర్పాటుచేయడం వలన ఇతర తెగుళ్లు ఒక చెట్టునుండి ఇంకొక చెట్టుకు సంక్రమించకుండా ఉంటుంది.
  • అదిక మోతాదులో పురుగుల మందులను వాడడం పంటకు లాభం కలిగించే కీటకాలు నశించే అవకాశం ఉండడం వలన పురుగుల మందులను కొద్దీ మోతాదులోనే వాడాలి.
  • తెగులు సోకిన మొక్కలను పండ్లను ఇతర ప్రాంతాలకు రవాణా చేయకండి.
  • పుల్లలను కొమ్మ చుట్టూ గుత్తులుగా కట్టి నిద్రావస్థకు చేరిన గొంగళి పురుగులను ఒకేసారి నాశనం చేయాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి