బొప్పాయి

బొప్పాయి పండు ఈగ

Toxotrypana curvicauda

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • చిల్లు పడ్డ పండ్ల పైతొక్క ముదర ఆకుపచ్చ రంగుకు వ్యతిరేకంగా రబ్బరు పాలు స్రవిస్తూ ఉంటుంది.
  • లార్వా, గుజ్జు లో రంద్రాలు చేసి విత్తన కుహరం లోకి చేరి ఎదుగుతున్న విత్తనాలను తింటాయి.
  • ఈ తీవ్రమైన నష్టం పండు తోలు కుళ్లిపోవటానికి కారణం అవుతుంది.
  • పండ్లు పసుపు రంగు కోల్పోయి పొక్కులు లాగా కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

బొప్పాయి

లక్షణాలు

ఆడ పురుగులు లేత పండ్ల పై చాలా గుడ్లని పెడతాయి. చిల్లు పడ్డ పండ్ల తోలు ముదర ఆకుపచ్చ రంగుకు వ్యతిరేకంగా రబ్బరు పాలు స్రవిస్తూ ఉంటుంది. లార్వా, గుజ్జు లో రంద్రాలు చేసి విత్తన కుహరం లోకి చేరి ఎదుగుతున్న విత్తనాలను తింటాయి. ఈ తీవ్రమైన నష్టం పండు తోలు కుళ్లిపోవటానికి కారణం అవుతుంది. పండ్లు పసుపు రంగు కోల్పోయి పొక్కులు లాగా కనిపిస్తాయి. ఇవి చేసిన రంద్రాలవలన పండు పైతొక్క కుళ్ళి పోయి గోధుమ మరియు కొన్ని సార్లు నల్లటి మచ్చలుగా కనిపిస్తాయి. పండ్లు ఒక రకమైన చేదు వాసన కలిగి రంద్రాల నుండి రసాలు కారుతూ ఉంటాయి. పండు చర్మం పసుపు రంగులోకి మారుతుంది. పండ్లు తొందరగా ముగ్గి మరియు రాలి పోతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

దొరెక్తోబ్రకోన్ టాక్సీపనయి అనబడే ఈ పరాన్నజీవి ఈ తెగులును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ ఈగలపైన ఎటువంటి కీటక నాశిని పనిచేయదు. ప్రత్యేకమైన కీటక నాశినులు కలిగిన వలలతో ( ఉదాహరణకు డెల్టామెత్రిన్) ఈ తెగులు నియంత్రించడానికి పరీక్షిస్తున్నారు.పండ్లను కీటక నాశక ఆవిరితో శుభ్రం చేసి ఈ ఈగలను చంపవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ తెగులు లక్షణాలు టోక్సోట్రీపైన సుర్వికాడా అనే ఈగ వల్ల కనిపిస్తాయి. ఇవి చిన్న ఆకుపచ్చ బొప్పాయి పండు పైన గుడ్లు పెడతాయి. వాటి రంగు మరియు ప్రవర్తన వలన పెద్దవాటిని సహజంగా కందీరీగలు అనుకుంటారు. ఇవి పసుపు రంగు శరీరం కలిగి రొమ్ము భాగంపై ఒకేవిధమైన నల్లటి మచ్చలు కలిగివుంటాయి.ఆడ పురుగులకు పొడవైన సన్నని పొట్ట ఉంటుంది. దీనికి ఒక సాగిన పొడవాటి గుడ్లు పేట్టే అవవయం ఉంటుంది. లార్వా తెల్లగా సన్నగా 13-15 మిల్లీమీటర్ల పొడవుతో ఉంటాయి. పండ్లు చాల లార్వాతో ఉండి కొత్త అయిన తర్వాత ఇవి బయటపడతాయి. వర్షాకాలం తరువాత పండ్ల నష్టం చాలా అధికంగా ఉంటుంది. ఈ తెగులు ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల అమెరికా ఖండంలో అధికంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • నష్టాన్ని గమనించి ఫెరోమోన్ వలలను పెట్టి ఈ ఈగల జనాభాను తెలుసుకోవచ్చు.
  • పేపర్ సంచులను పండ్లపై కప్పండి.
  • ఇలా చేయడంవలన గుడ్లు పెట్టడం తగ్గించవచ్చు.
  • పొలంలో నుండి రాలిన పండ్లను తీసివేయండి.
  • తెగులు సోకిన పండ్లను ఏరి నాశనం చేయండి.
  • వలల పంటలను వాడి వీటిని పట్టుకోవాలి.
  • త్వరగా కోత పూర్తిచేసి అధిక నష్టాన్ని తగ్గించండి.
  • పండ్లను 13 నుండి 16 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలో నిలువ చేయాలి.చెట్ల చుట్టూ దున్ని పడు ఏర్పాటుచేయడం వలన ఈ ఈగలు రాకుండానే నిర్మూలించవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి