నిమ్మజాతి

నిమ్మ జాతి మొక్కల్లో ఆకు తొలుచు పురుగు

Phyllocnistis citrella

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకుల రూపు మారుతుంది.
  • వంకర పోతాయి లేదా చుట్టుకు పోతాయి.
  • తెలుపు లేదా బూడిద రంగు చారలు ఆకులపైన ఏర్పడతాయి.
  • ఎదుగుదల మందగిస్తుంది.
  • పండ్ల పరిమాణం తగ్గుతుంది.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

ఏ వృద్ధి దశలోనయినా ముట్టడి జరగవచ్చు మరియు లేత ఆకులపై ప్రధానంగా కనిపిస్తుంది. ప్రారంభ లక్షణాలు వైకల్యం, వక్రీకృత లేదా చుట్టలుగా ఉన్న ఆకులు రూపంలో ఉండవచ్చు, అయినప్పటికీ, ఆకుపచ్చగా ఉంటాయి. ఒకసారి దగ్గరగా చూస్తే ఆకు పైపొరల మధ్యలో సర్పాకారంలో తెలుపు లేదా బూడిదరంగు జాడ ఈ తెగులు సోకింది అనడానికి నిదర్శనం.లార్వాల మల విసర్జనకు వీలుగా ఉండే ఒక సన్నని చీకటి మార్గము లేదా నల్లటి చుక్కల గీత సొరంగాల లోపల కనిపిస్తుంది. ఇది క్రింది వైపు నుండి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సొరంగాలు చివరిలో తరచుగా లార్వాలు కనిపిస్తాయి. ఒకొక్క ఆకుపై చాలా సంఖ్యలో ఈ లార్వాలు కనిపిస్తాయి. అవకాశవాద శిలీంధ్రాలకు లేదా బ్యాక్టీరియాకు ఆకులు దెబ్బ తినడం వలన మొక్కలకు సులువుగా సంక్రమించే అవకాశం ఉంటుంది. ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటే కిరణజన్య రేటు తగ్గిపోతుంది, ఫలితంగా మొక్కల ఎదుగుదల ఆగిపోతుంది. పండ్ల సైజు మరియు నాణ్యత తగ్గుతుంది. తీవ్రమైన సందర్భాల్లో, నిమ్మజాతి ఆకు తొలుచు పురుగు సంక్రమణం అనేది మొత్తము ఆకులు రాలిపోవడానికి మరియు దీనివలన చిన్న చెట్ల మరణానికి కూడా కారణం కావచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వీటిని వేటాడే వాటిలో న్యూరోప్తోరా జెనస్ యొక్క ఆకుపచ్చ లేస్ వింగ్స్ కూడా వుంటాయి. నిమ్మజాతి ఆకుతొలుచు పురుగుల లార్వాలపై దాడి చేసి తినే పరాన్నజీవులైన కందిరీగలు కూడా ఉన్నాయి. ఇంకా టెట్రా స్టిచస్ కు చెందిన కీటకాలు వున్నాయి. స్పైనోసాడ్, చేపనూనె రెసిన్ సబ్బు మరియు పొంగామియా నూనెను కలిగి వున్న సేంద్రీయ కీటకనాశకాలను నిమ్మజాతి ఆకుతొలుచు పురుగుల తెగులును నియంత్రించేందుకు ఆకులపై పిచికారీగా ఉపయోగించవచ్చు. ఈ పురుగులు ఆకులపై గుడ్లు పెట్టకుండా అడ్డుకోవడానికి వేపనూనెను కూడా వాడవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. నిమ్మజాతి ఆకు తొలుచు పురుగు యొక్క సంక్రమణమునకు వ్యతిరేకంగా కీటక నాశినులు పూర్తి ప్రభావం చూపించవు. ఎందువలన అంటే ఇవి ఆకు పైపొరచే కప్పబడి వుంటాయి. కీటక నాశినులు వాడవలసివస్తే పెద్ద పురుగులు చురుకుగా ఉన్నప్పుడు వీటిపై సంపర్క ఉత్పత్తులను వాడాలి. ఇమిడక్లోరిడ్, అబమేక్టిన్, టేబుఫెనోజైడ్, ఎసిటమిప్రిడ్, థియామెథోక్సమ్, డిఫ్ల్యూబెంజ్యురోన్ లేదా స్పీనేతోరం వంటి ఇతర ఫార్ములాల అనేక ఉత్పత్తులు స్ప్రేలుగా అందుబాటులో ఉన్నాయి. సింథటిక్ పెరిథ్రోయిడ్స్ కుటుంబానికి చెందిన కీటక నాశకాలు ఈ క్రిములకు వ్యతిరేకంగా వాడబడుతున్నాయి.

దీనికి కారణమేమిటి?

నిమ్మజాతి ఆకు తొలుచు పురుగు, ఫైలోక్నిటిస్ సిట్రెల్లా, యొక్క లార్వా తినడం వలన ఈ లక్షణాలు కలుగుతాయి. ఎదిగిన పురుగులు చిన్నవిగా గోధుమ లేక బూడిద రంగులో వుంటాయి. వాటి రెక్కలు అలంకారంగా వాటి ముందు రెక్క పైన ఒక ప్రత్యేకమైన నల్లటి చుక్క వుంటుంది. చల్లని వాతావరణములో ప్రధానంగా ఉదయం మరియు సాయంత్రం తెల్లవారుఝామున మరియు రాత్రి సమయాలలో ఇవి చురుకుగా వుంటాయి. వసంతకాలంలో, ఆడ పురుగులు ఆకుల దిగువ భాగంలో గుడ్లు పెడతాయి. పొదగబడిన లార్వా పారదర్శక ఆకుపచ్చ లేదా పసుపు రంగులో వుంటాయి మరియు ఇవి ముఖ్యంగా ఆకులను తిని బ్రతుకుతాయి. కాని ఇవి ఆకులు మరియు పండ్ల పైన కూడా దాడి చేయవచ్చు. ఇవి రెండు ఆకుల పైపొరల మధ్యన సొరంగాలు చేస్తాయి. అందువలన విలక్షణమైన వెండి రంగులో, సర్పాకారపు తెలుపు రంగు రంధ్రాలు ఏర్పడతాయి. లార్వా దశ ముగింపులో, ఆకు తొలుచు పురుగు సొరంగము నుండి బయటకు వచ్చి తన్ను తాను ఆకులతో చుట్టుకొని ప్యూపా దశలోనికి ప్రవేశిస్తుంది. ఇది నిమ్మజాతి యొక్క ప్రధాన తెగులు, దాదాపు అన్ని ప్రధాన నిమ్మజాతి ఉత్పత్తి ప్రాంతాలలో కనబడుతుంది. అంతేకాకుండా, బాక్టీరియల్ కేన్కర్ వంటి ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం పెరుగుతుంది.


నివారణా చర్యలు

  • నిమ్మజాతి ఆకు తొలుచు పురుగుకు పాక్షిక నిరోధక రకాలు ఎంచుకోండి.
  • చెట్లు మధ్య గ్రౌండ్ కవర్ గా బిల్లీ గోట్ కలుపు ( ఆగేరాటం కొనిజాయిడ్స్) నాటండి.
  • క్రమం తప్పకుండా పండ్ల తోటలను పర్యవేక్షించండి.
  • ప్రధానంగా ఆకులు దిగువ భాగంలో తెగులు సంకేతాల కొరకు చూడండి.
  • శీతాకాలంలో రాలిపోయిన ఆకులను తొలగించడం వలన పురుగులు అందులో దాగి ఉండకుండా ఉంటాయి.
  • పురుగులను ఆకర్షించడానికి లింగాకర్షక బుట్టలు ఉపయోగించండి మరియు ఈ పురుగుల జనాభాను గమనిస్తూ వుండండి.
  • ప్రయోజనకరమైన కీటకాలకు హాని చేసే పురుగుమందుల మితిమీరిన వాడకం తగ్గించండి.
  • ఈ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు మరిన్ని క్రొత్త తెగుళ్లు సోకకుండా ఉండడానికి చెట్లను కత్తిరించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి