వేరుశనగ

ఎర్ర జుత్తు గొంగళి పురుగులు

Amsacta albistriga

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • వీటి లార్వా మొగ్గలు, ఆకులు, కాండాలు మరియు ఇతర మొక్క భాగాలను అధికంగా తింటాయి.
  • ఆకులు అసాధారణంగా రంగు మారుతాయి మరియు రాలి పోతాయి.
  • మొక్కల డీఫాలియేషన్ తీవ్రమైన దిగుబడి నష్టాలకు దారితీస్తుంది.


వేరుశనగ

లక్షణాలు

చిన్న గొంగళి పురుగులు వర్షాకాలంలో అధిక మోతాదులో కనిపిస్తాయి మరియు ఆకుల క్రింది భాగాల్ని పాడుచేస్తాయి. ఎదిగిన గొంగళి పురుగులు అన్ని మొక్క భాగాలపైన, పూలు, మొగ్గలు మరియు ఆకుల పైన పడతాయి. ఆకు ఈనెలు లాంటి గట్టి కణజాలం మాత్రమే మిగిలి ఉంటాయి. పెద్ద ఎర్ర గొంగళి పురుగులు గుంపులుగా ఒక పొలం నుండి ఇంకొక పొలానికి తిరుగుతూ ఆ ప్రాంతమంతా ఆకులు రాలిపోయేటట్టు చేసి దిగుబడి నష్టాన్ని కలిగిస్తాయి పూర్తిగా పెరిగిన లార్వా ఎటువంటి కదలిక లేని భూమిలోకి వెళ్లి ఉంటాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

జీవనియంత్రణ పద్దతులలో ట్రైకోగ్రమ్మ పారాసైటోయిడ్ కందిరీగలను వదలడం ఒక పద్ధతి. ఇవి గుడ్లు మరియు ఎర్ర గొంగళి పురుగు యొక్క యువ లార్వా లను ఆశిస్తాయి. ప్రారంభ దశలో న్యూక్లియర్ పోలీహెడ్రోసిస్ వైరస్(NPV) లేదా బాసిల్లస్ తూరంగియాన్సీస్ లాంటి జీవ క్రిమినాశనులను పిచికారీ చేసి వీటిని నియంత్రించవచ్చును.

రసాయన నియంత్రణ

ఎర్ర గొంగళిపురుగుల జనాభాను అదుపుచేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే జీవ చికిత్సలు కలసిన నివారణ చర్యలు సమన్వయంతో వాడటం మంచిది. పొలంలో (100 మీటర్ల పొడవును ఎనిమిది గుడ్ల సముదాయాలు) వున్నట్లైతే కీటక నాశక పౌడర్ను చల్లడం వలన కూడా వీటిని ఈ చిన్న గొంగళి పురుగులను నియంత్రించవచ్చును. పూర్తిగా ఎదిగిన కీటకాలను నియంత్రించటానికి ఇతర కీటక నాశినులను కూడా వాడవచ్చు.

దీనికి కారణమేమిటి?

పెద్ద గొంగళి పురుగులు వర్షా కాలం అనంతరం భూమిలోనుండి బయటకి వస్తాయి. వీటికి గోధుమ రంగు ముందటి రెక్కలు తెలుపు చారికలు మరియు లోపలి అంచులో పసుపు బ్యాండ్ కనిపిస్తాయి. వీటి వెనుక రెక్కలు తెలుపు మరియు నలుపు మచ్చలు కలిగి ఉంటాయి. ఆడ గొంగళి పురుగులు 1000 వరకు పసుపు రంగు గుడ్లను గుంపులుగా ఆకుల కింది పక్క పెడతాయి. లేత గోధుమ రంగు చిన్న లార్వాలు వెంట్రుకలు లేకుండా ఉంటాయి మరియు ఆకుల పైన దాడి చేస్తాయి. ఎదిగిన లార్వా ఎరుపు గోధుమ రంగుతో నలుపు బ్యాండ్ మరియు పొడవు ఎరుపు జుట్టు కలిగి ఉంటాయి. ఇవి చాలా చురుకుగా వుంటూ పొలంలో విధ్వంసం సృష్టిస్తాయి. ఇవి చెట్ల కింద మట్టిలో 10 నుండి 20 సెంటీమీటర్ల లోతులో ఉంటాయి మరియు పెద్దగా అయ్యి బయటకి వచ్చే ముందు ప్యూపాగా మారి అక్కడే ఒక 10 నెలల వరకూ ఉంటాయి.


నివారణా చర్యలు

  • తొందరగా నాట్లు వేయటం వలన కీటకాల జనాభాను అదుపులో ఉంచవచ్చు.
  • 30 సెంటీమీటర్ల లోతుతో మరియు 25 సెంటీమీటర్ల వెడల్పులో కందకం తవ్వి లార్వా వాటిలో చేరకుండా చూడాలి.
  • ప్రతి ఆరు వేరుశనగ వరుసలతో ఆముదము మొక్కలను అంతర పంటలుగా వేయడం మంచిది.
  • దీపపు వలలు వాడి కీటకాలు పట్టుబడే లాగా చూడాలి.
  • జొన్న, రాగి లేదా మొక్కజొన్నతో పంట మార్పిడి చేయటం మంచిది.
  • సీజన్ మధ్యలో నీటి ఎద్దడిని నివారించడానికి ఒక సారి నీరు పెట్టడం మంచిది.
  • దీని వలన పంట కోత ముందు ఈ తెగులు సంక్రమణను నివారించవచ్చు.
  • కలుపు మొక్కలను తొలగించాలి.
  • పొలాన్ని పర్యవేక్షించి, గుడ్లను మరియు గ్రెగరీయస్ లార్వా ను ఆకుల పైనుండి ఏరి నాశనం చేయాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి