వంకాయ

వంకాయలో లేస్ పురుగు

Gargaphia solani

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • చిన్న పురుగులు ఆకుల క్రింద భాగాన్ని ఆహారంగా తిని వాటిని గోధుమ రంగు మల పదార్ధంతో కప్పుతాయి.
  • ఆకులు చుట్టుకుపోయి పాలిపోతాయి.
  • ఇఇ తినడం వలన పాలిపోయిన ప్రాంతాలు ఏర్పడి తర్వాత వాలిపోయి ఆకులు రాలిపోతాయి.


వంకాయ

లక్షణాలు

మొలకలలో, చిన్న పురుగులు గుంపులు గుంపులుగా చేరి ఆకుల క్రిందభాగాన్ని ఆహారంగా తీసుకుంటాయి. వాటిని గోధుమ రంగు మల పదార్ధంతో కప్పుతాయి. వంగ మొక్కలు ఇంకా మొలకల దశలో వుండే వసంత కాలం ఆరంభం చాలా సంక్లిష్ట కాలము. ఈ పెద్ద పురుగులు ఆకుల క్రింది భాగానికి చేరి పచ్చనిరంగులో వున్న గుడ్లను పెట్టి చిన్న పురుగులు కొరకు భవిష్యత్ ఆవాసాలను ఏర్పరుచుకుంటాయి. చిన్న పురుగులు పొదగబడి ఆకుల క్రింద మరియు గోధుమ రంగు మల పదార్ధంతో వాటిని కప్పివేస్తూ ఆకుల క్రింది భాగాన్ని గుంపులుగా తినడం ప్రారంభిస్తాయి. వాటి నోటితో ఇవి ఆకులను నమలడం వలన గుండ్రని పాలిపోయిన అతుకులు ఆకు ఈనెల మధ్యభాగంలో కనిపిస్తాయి. ఇవి ఇంకా ముందుకు వెళ్లి బయట ప్రదేశంలో తినడం వలన ఆకులు పసుపురంగులోకి మారి ముడుతలు పడి చుట్టుకుపోతాయి. ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటే మొత్తం మొక్కలు చనిపోవచ్చు లేదా పండ్లు సరిగా వృద్ధి చెందకపోవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వంగ మొక్క లేస్ వింగ్స్ కు సహజ శత్రువులైన లేడీ బగ్స్, స్పైడర్స్ మరియు పైరేట్ బగ్స్ ను పరిరక్షించండి. ఆకుల క్రింది భాగంలో కీటక నాశక సబ్బులు, పైరిత్రిన్స్ మరియు వేప నూనె పిచికారీ చేయొచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మలాథియాన్, లేదా పెరిథ్రోయిడ్ ఆధారిత విస్తృత పరిధి కల కీటక నాశినులను ఆకులపై పిచికారీ చేయుటకు ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ పురుగులు లేత గోధుమ రంగు మరియు తెలుపు రంగులో ఉండి పారదర్శకమైన పచ్చని లేస్ లాంటి ఈనెలను వీటి రెక్కలతో కలిగి ఉంటాయి. ఇవి 4 మిల్లీమీటర్ల పొడవు ఉండి మొక్కల అవశేషాలపై జీవిస్తూ పైకి వచ్చి గుడ్లు పెట్టడానికి అనుకూల వాతావరణ పరిస్థితుల కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. గుడ్లు ఆకుపచ్చని రంగులో ఉంటాయి మరియు ఆకుల అడుగు భాగాల మీద సమూహాలుగా అంటుకుని ఉంటాయి. చిన్నపురుగులకు రెక్కలు వుండవు. ఇవి పసుపు రంగులో ఉండి పొట్ట చివరి భాగంలో ఒక నల్లటి మచ్చను కలిగి వుంటాయి. చిన్న పురుగులు మరియు పెద్ద పురుగులు ఆకులకు నష్టాన్ని కలగచేస్తాయి. కానీ పిల్ల పురుగులు తాము పుట్టిన మొక్కను ఆహారంగా తింటే పెద్ద పురుగులు మాత్రం ఇతర మొక్కల పైకి ఎగిరి పొలంలో ఇతర మొక్కలకు వ్యాపిస్తాయి. ఇప్పటివరకూ ఈ కీటకం ఒక ప్రత్యేకమైన వంగ మొక్క తెగులుగా గుర్తింప బడలేదు. సాధారణంగా పంట దిగుబడి నష్టం తక్కువగా వుంటుంది, కాని కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో నష్టం యొక్క తీవ్రత అధికంగా వుండే అవకాశం వుంది. వంగ పంట మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ అతిధి మొక్కలలో టమాటో, బంగాళాదుంప, పొద్దుతిరుగుడు, సేజ్, పత్తి, నైట్ షేడ్స్ మరియు కలుపు హార్స్ నెట్టల్ ఉంటాయి.


నివారణా చర్యలు

  • ఈ కీటకం యొక్క ఉనికి కొరకు మొక్కలను నిశితంగా గమనిస్తూవుండండి.
  • కీటకాలను లేదా విడిపోయిన ఆకులను చేతితో తీసివేయండి.
  • స్వచ్చందంగా వచ్చిన మొక్కలను లేదా వీడీ హార్స్ నెట్టిల్ మరియు నైట్ షేడ్స్ కలుపు మొక్కలను తొలగించండి.
  • ప్రయోజనకరమైన కీటకాల జనాభాకు నష్టము కలుగకుండా ఉండడానికి క్రిమి సంహారకాల వాడకాన్ని నియంత్రించండి.
  • పొలంలో వున్న పంట అవశేషాలను మరియు కలుపు మొక్కలను ఈ కీటకాలకు ఆవాసాలుగా మారకుండా తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి