వరి

వరిలో ఉల్లి కోడు (ఏషియన్ రైస్ గాల్ మిడ్జ్)

Orseolia oryzae

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • గొట్టం లాంటి పిలకల మొక్క మొదళ్ళ వద్ద ఏర్పడతాయి.
  • ఆకుల తొడిమలు వెండి రంగులోకి మారతాయి.
  • కంకులు ఏర్పడవు.
  • రూపు మారిన, వాడిపోయిన మరియు ముడుచుకుపోయిన ఆకులు ఏర్పడతాయి.
  • మొక్క ఎదుగుదల మందగిస్తుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

ఈ తెగులు సోకిన పిలకల ఎదుగుదల తగ్గిపోయి వరి కంకులు వేయవు. రూపు మారిన, వాడిపోయిన మరియు ముడుచుకుపోయిన ఆకులు కనిపిస్తాయి. ఈ తెగులు వలన పిలకల మొదళ్ళలో పొడవాటి వెండి వంటి ఉల్లికోడు లేదా సిల్వర్ షూట్ అని పిలవబడే ఆకు తొడుగులు తయారవుతాయి. (దాదాపుగా 1 సెంటీమీటర్ వెడల్పు మరియు 30 సెంటీమీటర్ల పొడవు). మొక్క ఎదుగుదల ఆగిపోవడం, రూపు మారిన, వాడిపోయిన మరియు ముడుచుకుపోయిన ఆకులు లాంటి లక్షణాలు కరువు వలన, పొటాషియం లోపం, లవణీయత, మరియు రైస్ త్రిప్స్ వలన కలుగుతాయి. సమస్య యొక్క కారణాన్ని నిర్ధారించడానికి పురుగులు ఉన్నాయేమో పరిశీలించండి. పొడవాటి-గొట్టం లాంటి గ్రుడ్లు మరియు మగ్గట్ వంటి లార్వా, ప్రత్యేకంగా, ఎదుగుతున్న మొగ్గల లోపలి భాగాన్ని తింటాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ప్లాటిగాస్టెరిడ్, యుపెల్మిడ్, మరియు టరోమాలిడ్ కందిరీగలు (లార్వాలను పరాన్నజీవిగా చేసేవి), ఫైటోసేయీడ్డ్ పురుగులు (గుడ్లను తినేవి), సాలెపురుగులు (పెద్ద కీటకాలను తినేవి) తో పారాసైటిజషన్ ను విజయవంతంగా ఉపయోగించారు. వరి చేను చుట్టూ కీటకాలను ఆకర్షించే పూల మొక్కలను ఎక్కువగా నాటడం కూడా ఈ తెగులును నియంత్రించడంలో సహాయకారిగా ఉంటుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి.ఈ తెగులు సోకగానే టైం ఇన్సెక్టిసైడ్ అప్లికేషన్ ను ఖచ్చితమైన పద్దతిలో ఉపయోగించండి. క్లొర్ఫేరీఫాస్ ఆధారిత ఉత్పత్తులను ఈ తెగులు సంతతిని నిరోధించడానికి ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ ఉల్లి కోళ్లు వరి పంట యొక్క పూత దశ సమయంలో, నీటిపారుదల లేదా వర్షం వల్ల తడిగా ఉన్న వరి ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తాయి. ఈ పురుగులు ప్యూపా దశలో నిద్రాణంగా ఉంటాయి మరియు వర్షాల తర్వాత మొగ్గలు వచ్చే దశ లో చురుకుగా మారుతాయి. మబ్బులు పట్టిన లేదా వర్షం, అధిక సాంద్రతతో మొక్కలు నాటడం వీటి జనాభా పెరగటానికి అనుకూలంగా వుంటాయి.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక వంగడాలు వాడండి.
  • వర్ష కాలం మొదట్లోనే నాట్లు వేయండి.
  • మొక్కల మధ్య తగినంత దూరం ఉండేలాగ చూడండి.
  • పురుగులను సేకరించడానికి నూనె లేదా జిగురు గల అంటుకునే బోర్డులతో పాటు కాంతి వలలను వాడండి.
  • చుట్టు పక్కల వేరే మొక్కలు లేకుండా చూడండి.
  • నాట్లు లేని సమయం లో పొలాన్ని బీడుగా ఉంచండి.
  • వరి పొలం చుట్టూ పూల మొక్కలను నాటండి.
  • నత్రజని మరియు పోటాష్ ఎరువులను సిఫారసు చేసిన విధంగా వాడండి.
  • కోత అయిన వెంటనే దుక్కి దున్నండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి