మినుములు మరియు పెసలు

నీలి రంగు సీతాకోకచిలుక

Lampides boeticus

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • మొగ్గలపై లార్వాలు చేసిన రంద్రాలు వుంటాయి.
  • కాయల లోపలి భాగాల్ని లార్వాలు తినేస్తాయి.
  • అందువలన ఒక వైపు గుండ్రటి కన్నాలు ఏర్పడతాయి.
  • ఇవి చేసే రంధ్రాల వద్ద తేనె బంక మరియు చీమలు కనబడుతాయి.
  • దీనిని పట్టించుకోకపోతే దిగుబడిలో అధిక నష్టాలు కలుగుతాయి.


మినుములు మరియు పెసలు

లక్షణాలు

మొక్కలకు ఎక్కువగా నష్టం లార్వాల దశలోనే జరుగుతుంది. ఈ లార్వాలు మొక్కల లోపలి పదార్థాలను మరియు కాయలలోని విత్తనాల్ని తింటాయి. లార్వాలు పొదగబడిన తరవాత సాధారణంగా కాయ చివరిలో ప్రారంభ లక్షణాలుగా మొగ్గలకు, పూలకు మరియు పచ్చి కాయలకు చేసిన రంద్రాలు కనబడుతాయి. ఇవి చేసిన గుండ్రటి రంధ్రాల దగ్గరలో తేనె బంక మరియు నల్ల చీమలని చూడవచ్చు. కాయలు నల్లగా మారింది అంటే అది కుళ్లిపోయిందని అర్థం. ఇవి నేరుగా కాయల పై దాడి చేయటం వల్ల దిగుబడి చాలా తగ్గిపోతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

సహజంగా ఈ పురుగులకు వుండే శత్రుకీటకాలను పొలంలో వదలడం ద్వారా ఈ తెగులును నియంత్రించవచ్చు. గ్రుడ్లు మరియు లార్వాలను తినే ట్రైకొగ్రామా చితోట్రఎ, ట్రైకొగ్రామాటోయిడి బాక్ట్రి, కోటెసియా స్పెక్యులారిస్, హైపెరిన్సిర్థస్ ల్యుకోనెఫిలియా మరియు లిట్రోడ్రోమస్ క్రేస్సిప్స్ వలన మంచి ఫలితం ఉండవచ్చు. పసిలోమైసిస్ లీలసినస్ మరియు వెట్రిసిల్లీయం లేకాని కలిగివున్న బయో ఫెర్టిలైజర్స్ ను ఆకులపై పిచికారీ చేసి తెగులు విస్తరించకుండా ఆపవచ్చు. NSKE 5% ను @ 2% వేపనూనెతో కలిపి పిచికారి చేయడం వలన లార్వాలను నియంత్రించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ పురుగుల సహజ శత్రువులను సరిగా సంరక్షించినట్లైతే రసాయనాల అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ పురుగు మందుల అవసరం ఉంటే లాంబ్డా- సైహలోత్రిన్, డెల్టామేత్రిన్ లను ఆకులపై పిచికారి చేయడం వలన కౌ-పీ మరియు మగ్ బీన్ లో 80 నుంచి 90% వరకు నియంత్రించబడుతుంది. ఇతర రసాయనాలు కలిగిన ఎమామెక్టిన్ 5%SG (220 g/ha) మరియు ఇండోక్సాకార్బ్ 15.8%SC (333 ml/ha) వాడి కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. గుర్తుంచుకోండి పీ బ్లూ బటర్ ఫ్లై ఈ రసాయనాలకు నిరోధకత పెంచుకొని ఉండవచ్చు.

దీనికి కారణమేమిటి?

లాంపీడేస్ బోయెటికస్ లార్వాలు మొక్కల పై అధిక నష్టం కలిగిస్తాయి. ఎదిగిన లార్వాల దేహం మెటాలిక్ నీలి వర్ణంలో పొడవుగా ఉండి శరీరం మొత్తం నీలి బూడిదరంగు వెంట్రుకల్ని కలిగి ఉంటుంది. వెనక రెక్కల క్రిందిభాగంలో అతికినట్టువుండే తోకభాగంలో నల్లటి మచ్చలు చూడవచ్చు. రెక్కల క్రిందిభాగం అంచుపై ఒక క్రమంలో లేని తెలుపు మరియు గోధుమరంగు మచ్చలు కనపడతాయి. ఈ లార్వాల దశ సాధారణంగా 2-3 వారాల వరకు ఉంటుంది. ఆడ పురుగులు గుండ్రటి పాలిపోయినట్టు వుండే నీలం లేదా తెల్లని గ్రుడ్లను ఒకొక్కటిగా మొగ్గలపై, పువ్వులపై మరియు పెరుగుతున్న ఆకు కాడలపై ఆకులపై పెడుతాయి. ఈ లార్వాలు పాలిపోయిన ఆకుపచ్చ నుండి గోధుమ రంగులో ఉండి కొద్దిగా గుండ్రంగా స్లగ్స్ లాగ ఉంటాయి. ఉష్ణోగ్రతను బట్టి ఈ లార్వాల దశ 2 నుండి 4 వారాల వరకు ఉంటుంది.


నివారణా చర్యలు

  • మీకు అందుబాటులో వుండే తెగులు నిరోధక మొక్కలను వాడాలి.
  • ముందుగా కానీ ఆలస్యంగా కానీ మొక్కలను నాటరాదు.
  • దాని వలన చీడకు అనుకూలత ఏర్పడుతుంది.
  • మొక్కల మధ్యన సరైన అంతరం ఉండేటట్లు చూడండి.
  • తెగులు సోకిందేమో తెలుసుకోవడానికి మొక్కలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి. పొలంలో వున్న లార్వాలను చేతులతో తొలగించి నాశనం చేయాలి.
  • తరుచుగా పొలాన్ని దున్ని లార్వాలు మరియు ప్యూపా బైటకు వచ్చేటట్టు చేయాలి.
  • అనవసరంగా పురుగుల మందులు వాడకూడదు.
  • అందువలన ఈ చీడకు సహజంగా వుండే శత్రు కీటకాలు కూడా నాశనం అవుతాయి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి