వరి

వరి నల్లి లేదా నల్ల నల్లి ( రైస్ బగ్)

Leptocorisa spp.

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • తినడం వలన కలిగిన నష్టం తలపైన కనిపిస్తుంది.
  • ధాన్యం రంగు మారుతుంది.
  • ధాన్యం రూపు మారుతుంది.
  • బాక్టీరియల్ కంకి ఎండు తెగులు ఏమో అనే గందరగోళం ఏర్పడుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

ఎదిగే దశలు బట్టి, ఇవి తినడం వలన, తాలు గింజలు ఏర్పడడం కానీ లేదా చిన్న పరిమాణంలో, సరైన ఆకారం లేని మరియు రంగు కోల్పోయి మచ్చలతో కూడిన గింజలు ఏర్పడతాయి. ఈ పురుగు ఆశి౦చిన పొల౦ ను౦డి చెడు వాసన వస్తు౦ది. కంకులు నిటారుగా కనిపిస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వరి నల్లి ని తొలగించటానికి సుగంధద్రవ్యాలు (లెమన్ గ్రాస్ వంటివి) సువాసన కలిగిన సబ్బు నీళ్ళని చల్లండి. రైస్ బగ్ ను ఆకర్షించి చంపడానికి ప్రహక్ ను ( కంబోడియాలో స్థానిక జున్ను) పొలం దగ్గర్లో వాడండి. ఉదయాన్న మరియు సాయంతరం సమయాలలో దోమతెరను వాడి రైస్ బగ్ ను బంధించి నలిపి నీళ్లలో వేయాలి. ఆ తర్వాత ఆ నీటిని పొలంలో చల్లడం వలన ఇతర రైస్ బగ్స్ ను వెళ్లగొట్టవచ్చు. జీవసంబంధమైన నివారణ ఏజెంట్లని ప్రోత్సహించాలి. కొన్ని కందిరీగలు, గొల్లభామలు మరియు సాలీడులు వరి నల్లి పై దాడి చేస్తాయి. జీవసంబంధమైన నివారణ ఏజెంట్లని ప్రోత్సహించాలి. కందిరీగలు, గొల్లభామలు మరియు సాలీడులు రైస్ బగ్స్ పైన వాటి గ్రుడ్లపైన దాడి చేస్తాయి. విచక్షణారహితంగా క్రిమిసంహారకమందులు వాడడం వలన జీవ నియంత్రణకు అంతరాయం కలుగచేస్తుంది. దానివలన చీడపీడలు మరింతగా పెరుగుతాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. క్రిమిసంహారకమందుల వలన కలిగే ప్రయోజనాలను వాటి వాడుకతో ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి కలిగే హానిని బేరీజు వేసుకోవాలి. 2.5 మిల్లీలీటర్ల క్లోర్ఫెరిఫోస్ 50EC + ఒక లీటరు నీటికి 1 మిల్లీలీటర్ డైక్లోర్వాస్ కలిపి సాయంత్రం వేళల్లో పొలం గట్టు నుండి పొలం లోపలి వరకు వృత్తాకారంలో వేయాలి. ఇలా చేయడంవలన పురుగులన్నీ పొలం మధ్యకు చేరుకుంటాయి. అప్పుడు వీటిని నిర్ములించడం సులభమవుతుంది.ప్రత్యామ్నాయంగా మీరు అబామెక్టిన్‌ను కూడా ఉపయోగించవచ్చు. విచక్షణారహిత పురుగుమందుల ఉపయోగం జీవ నియంత్రణకు అంతరాయం కలిగిస్తుంది, ఫలితంగా తెగులు పునరుత్థానం అవుతుంది.

దీనికి కారణమేమిటి?

పాలు పోసుకునే దశలో రైస్ బగ్స్ అప్పుడప్పుడూ కనిపిస్తాయి. ఇవి దుర్వాసనను వెదజల్లుతూ ఉంటాయి. ఈ బగ్స్ అన్ని రకాల వరి పర్యావరణాలలో కనిపిస్తాయి అటవీ ప్రదేశంలో, వరి పంట పొలాలకు దగ్గరలోని ఎక్కువగా కలుపు మొక్కలు వున్న ప్రాంతాలలోను, కాలువల దగ్గర పెరిగే అడవి గడ్డి దగ్గర ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. రుతుపవనాల వర్షాలు మొదలైన సమయంలో ఇవి బాగా చురుకుగా ఉంటాయి. వెచ్చని వాతావరణంలో, మబ్బులు ఎక్కువగా వున్నప్పుడు, సన్నని తుంపర్లు పడుతున్నప్పుడు ఇవి వాటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి. పొడి వాతావరణంలో ఇవి తక్కువ చురుకుగా ఉంటాయి. ఈ లక్షణాలు బాక్టీరియల్ కంకి ఎండు తెగులు వల్ల కలిగిన నష్టాన్ని పోలి ఉంటాయి.


నివారణా చర్యలు

  • వీలైనట్లయితే ఆలస్యంగా పక్వానికి వచ్చే రకాలను ఉపయోగించండి.
  • ఒకే సమయంలోనాట్లు వేస్తే అది రైస్ బగ్ సమస్య తగ్గడంలో సహాయపడుతుంది.
  • పూత ముందు దశ నుండి పొలాన్ని ప్రతి రోజు గమనిస్తూ వుండండి.
  • క్రాబ్ గ్రాస్, గూస్ గ్రాస్ మరియు బీన్స్ వంటి ఇతర ఇతర ప్రత్యామ్న్యాయ కలుపు మొక్కలను తొలగించాలి.
  • ఈ పురుగులను ఆకర్షించడానికి పొలం చుట్టూ వల పంటలను వేయండి.
  • సమతుల్య ఎరువుల ప్రణాళికను పాటించండి.
  • క్రమం తప్పకుండా నీరు పెట్టండి కానీ అధిక తేమను నివారించండి.
  • ఈ పురుగులను పట్టుకోవడానికి ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో నెట్ ను ఉపయోగించండి.
  • పొలంలో నీరు అధికంగా పెట్టి ఈ పురుగులు నీటిలో మునిగేటట్టు చేయండి లేదా ఈ పురుగులు మొక్కల పైభాగానికి చేరేటట్టు చూడండి.
  • ఇలా చేయడం వలన వీటిపైన పురుగు మందులను సులభంగా ఉపయోగించవచ్చు.
  • తక్కువ మోతాదులో క్రిమి సంహారక మందులు వాడి పంటకు ఉపయోగకరంగా వుండే కీటకాలు నశించకుండా చూసుకోవాలి.
  • (కందిరీగలు, మిడత మరియు సాలెపురుగులు).

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి