సోయాబీన్

బీన్ ఆకు పెంకు పురుగు

Cerotoma trifurcata

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • వేర్లు మరియు వేరు బుడిపెలను ఆహారంగా తీసుకోవడం వలన జరిగే నష్టం.
  • ఆకులు మరియు అభివృద్ధి చెందుతున్న కాయలను ఆహారంగా తీసుకోవడం వలన జరిగే నష్టం.
  • వైరస్ యొక్క వాహకము.

లో కూడా చూడవచ్చు


సోయాబీన్

లక్షణాలు

లార్వా మరియు పెద్ద పురుగులు వేర్లు, వేరు బుడిపెలు, ఆకు మొలకలు, ఆకులు (తరచుగా క్రిందివైపు) మరియు కాయలను ఆహారంగా తీసుకుంటాయి. వేరు మరియు నాడీ కణజాలం చీలిపోవడం వలన నత్రజని స్థాపన తగ్గవచ్చు. ఆకు మీద చెల్లాచెదురుగా పరచుకొన్న చిన్న మరియు దాదాపుగా గుండ్రని రంధ్రాలుగా, ఆకు కొనభాగాల మీద నష్టం కనిపిస్తుంది. ఆహారంగా తీసుకోబడ్డ కాయలు చారలను కలిగి ఉంటాయి. ఈ కీటకాలు కాయలను తినడం వలన జరిగిన నష్టం కారణంగా దిగుబడులు మరియు విత్తన నాణ్యత తగ్గుతాయి. దెబ్బతిన్న కాయలు శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు ప్రవేశించడానికి వీలు కల్పిస్తాయి. సీజన్ మొదట్లో సెరొటోమా త్రైఫుర్కాట ఆశిస్తే ఇది విత్తన గాయం, ఆకులు రాలిపోవడం మరియు విత్తనం పాలిపోవడానికి దారి తీయవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ప్రస్తుతానికి, ఈ తెగులుకు ఎటువంటి ప్రభావవంతమైన జీవ సంబంధిత నియంత్రణ లేదు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఒకవేళ దిగుబడి బాగా తగ్గడానికి ఈ పురుగులు కారణమైతే రసాయనాలను ఉపయోగించడాన్ని పరిగణించండి. పెరిథ్రోయిడ్ లేదా లాంబ్డా-సైహలోత్రిన్ లేదా డైమిథోయేట్ గ్రూప్ కీటక నాశినులను ఈ కీటకాల జనాభాను తగ్గించేందుకు సహాయ పడవచ్చు.

దీనికి కారణమేమిటి?

పూర్తిగా ఎదిగిన పురుగులు సుమారు 6 మిల్లీమీటర్స్ పొడవు మరియు ముదురు పసుపు రంగు నుండి ఎరుపురంగులో ఉంటాయి. వాటి రెక్కలు ప్రత్యేకమైన దీర్ఘచతురస్రాకార గుర్తులతో ఉంటాయి మరియు వాటి మెడ మీద ఒక నల్లని త్రికోణం ఉంటుంది. ఎదిగిన ఆడ పురుగులు మొక్క కాండాల సమీపంలో నేలలోని పై రెండు అంగుళాలలో గుడ్లు పెడతాయి. ఒక ఆడపురుగు తన జీవితకాలంలో 125 నుంచి 250 గుడ్లు పెడుతుంది. నేలలోని ఉష్ణోగ్రత మీద ఆధారపడి గుడ్లు 4 నుంచి 14 రోజుల్లో పొదగబడతాయి. లార్వా తెలుపు రంగులో ఉండి ముదురు గోధుమ లేదా నలుపురంగు తలను కలిగి ఉంటాయి. పెద్ద పురుగులు శీతాకాలంలో సోయాబీన్ పొలాల చుట్టూ ఉన్న వివిధ ఆవాసాలలో ఉంటాయి. చిక్కుడు ఆకు పెంకు పురుగు అనేక రకాల వైరస్ కు వాహకంగా పనిచేస్తుంది.


నివారణా చర్యలు

  • సీజన్ ప్రారంభ దశలో కీటకాలను లెక్కించి మొక్కలకు కలిగే నష్టాన్ని అంచనా వేయండి.
  • వరుస కవర్లు ఈ కీటకాలకు భౌతిక అడ్డంకిగా నిలవగలవు.
  • పొలాన్ని లోతుగా దున్నండి మరియు పొలానికి సమీపంలో ఇతర జాతుల చిక్కుళ్ళను పెంచటం నివారించండి.పెద్దగా పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి