ఆలివ్

ఆలివ్ లో బెరడు పెంకు పురుగు

Phloeotribus scarabaeoides

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • చెట్టు బెరడుపై రంధ్రాలు.
  • బెరడు కింద విలోమ సొరంగాలు.
  • రెమ్మలు మరియు కొమ్మలపై నడికట్టు మరియు ఎండిపోయి వాడిపోవడం.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
ఆలివ్

ఆలివ్

లక్షణాలు

పెద్ద ఆడ పురుగులు చెట్టు బెరడు క్రింద అనేక రంధ్రాలను చేసి నేరుగా బెరడు కింద ఆ రంధ్రాలకి ఇరువైపులా అడ్డంగా సొరంగాన్ని త్రవ్వుతాయి. రెమ్మ లేదా కొమ్మ లోపల, ఆడ పురుగు 60 గుడ్లు పెడుతుంది మరియు లార్వా పొదుగుతున్నప్పుడు, అవి బెరడు లోపల చెక్కతో పైకి లేదా క్రిందికి రంధ్రాలు చేయడం ప్రారంభిస్తాయి. బెరడును కత్తిరించినప్పుడు మరియు ప్రవేశ రంధ్రాలకి దగ్గరలో బెరడుని తొలగించినప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తుంది.ఇవి తినడం వలన రెమ్మ లేదా కొమ్మ పాక్షికంగా లేదా పూర్తి నడికట్టు చేయబడి చెట్టు బలహీనపడుతుంది మరియు నాళాల కణజాలాలను దెబ్బతీస్తుంది. ఇవి తినే గ్యాలరీల లోపల లార్వా ప్యూపా దశకు చేరుతుంది. ఆలివ్ చెట్లతో పాటు, గన్నేరు (నెరియం ఒలియాండర్) మరియు అప్పుడప్పుడు బూడిద (ఫ్రాక్సినస్ ఎక్సెల్సియర్) మరియు లిలక్ (సిరింగా వల్గారిస్) చెట్లపైన కూడా తింటాయి

Recommendations

సేంద్రీయ నియంత్రణ

అనేక జాతులకు చెందిన అనేక పరాన్నజీవి కందిరీగలు ఈ పెంకు పురుగులపై దాడి చేస్తాయి. ఈ జాతులలో ఒకదాన్ని పరిచయం మరియు నియంత్రణ ప్రభావాలు సంవత్సరం సంవత్సరానికి మారవచ్చు. ఆలివ్ బెరడు పెంకు పురుగు యొక్క ప్రధాన సహజ శత్రువు పరాన్నజీవి కందిరీగ చీరోపాచస్ క్వాడ్రమ్, ఇది తెగులు జనాభాను 30-50% తగ్గించగలదు. పైరెథ్రాయిడ్‌ ఆధారిత పురుగు మందులను ఉపయోగించడం వల్ల సహజ శత్రువులు ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. పెంకు పురుగులను ఆకర్షించడానికి ఇథిలీన్ ఆధారిత లింగాకర్షక బుట్టలు సిఫార్సు చేయబడ్డాయి. డెల్టామెత్రిన్ వంటి పైరెథ్రాయిడ్‌ ఆధారిత క్రిమిసంహారక మందుల వాడకం పెంకు పురుగుల జనాభాను గణనీయంగా తగ్గిస్తుందని నిరూపించబడింది. సమీకృత విధానంలో భాగంగా ఉపయోగించే ఈ రెండు పద్ధతులు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.

దీనికి కారణమేమిటి?

పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి సంవత్సరానికి 2 నుండి 4 తరాలు ఉండే ఆలివ్ బెరడు పెంకు పురుగు వలన లక్షణాలు ఏర్పడతాయి. వసంత ఋతువు మరియు వేసవి ప్రారంభంలో పెద్ద పురుగులు సజీవంగా ఉన్న చెట్లపై కాకుండా కత్తిరించి కట్టెలుగా పేర్చబడిన కొమ్మలు మరియు ఆలివ్ కలపలో గుడ్లు పెడతాయి. వీటి లార్వా జిలోఫాగస్, అంటే ఇవి ప్రత్యేకంగా చెక్కను తింటాయి. ఈ పురుగు స్థానికంగా కొత్త సాగు ప్రాంతాలకు ఎగిరి వెళ్లగలుగుతుంది తెగులు సోకిన కలప లేదా సజీవ మొక్కలను రవాణా చేసినప్పుడు కూడా ఇది చాలా దూరం వరకు తీసుకువెళ్లబడుతుంది. తెగులు తీవ్రంగా ఉన్నప్పుడు పువ్వులు మరియు ఆలివ్ పండ్ల సంఖ్య తగ్గుతుంది. ఫలితంగా 70% వరకు పంట నష్టం జరుగుతుంది. ఇటువంటి ముట్టడి వలన ఆలివ్ తోటలలో 5 సంవత్సరాల వరకు పంట రాకపోవచ్చు. ఈ నష్టం కాండాన్ని చుట్టుముట్టే అవకాశం ఉన్నందున చిన్న చెట్లు ఈ తెగులుకి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • తెగులు సోకిన కొమ్మలను తొలగించి కాల్చివేయాలి లేదా తోటకు దూరంగా లోతుగా పాతిపెట్టాలి.
  • అదే విధంగా చెట్టు అవశేషాలు మరియు కత్తిరించిన చెట్ల కొమ్మలను కాల్చివేయాలి.
  • తెగులు సంకేతాల కోసం ఆలివ్ చెట్లను గమనిస్తూఉండండి.
  • ఒక మీటరుకు పొడవు కొమ్మకి 3 కంటే ఎక్కువ తెగులు గూళ్ళు ఉన్నప్పుడు ఆలివ్ పంట దిగుబడి తగ్గుతుంది.
  • ఆలివ్ బెరడు పెంకు పురుగు యొక్క ప్రత్యామ్నాయ అతిధేయలు పండ్ల తోటకి దగ్గరగా లేవని నిర్ధారించుకోండి.
  • చెట్టు సహజ వ్యాధి నిరోధకతను వృద్ధి చేయడానికి సమతుల్య ఎరువులను వాడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి