ఇతరములు

బ్లాక్ స్కేల్

Saissetia oleae

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకుల క్రింది భాగంలో మరియు కాండంపైన నల్ల పొలుసు గడ్డలు ఏర్పడతాయి.
  • వాటి నుండి స్రవించే హనీ డ్యూ చీమలను మరియు మెత్తని బూజును ఆకర్షిస్తుంది.
  • మలినమైన ఆకులు ముందుగానే రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

6 పంటలు
అప్రికోట్
నిమ్మజాతి
కాఫీ
ఆలివ్
మరిన్ని

ఇతరములు

లక్షణాలు

బ్లాక్ స్కేల్ పురుగులు ఆకులు మరియు కాండం పైన గుంపుగా చేరి కణద్రవ్యాన్ని చాలా ఎక్కువగా పీల్చివేస్తాయి. దీని వలన చెట్లు బలహీనపడి ఎదుగుదల తగ్గిపోతుంది. ఇవి కణద్రవ్యాన్ని పీలుస్తునప్పుడు ఒక జిగురు వంటి హానీడ్యూ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ హానీడ్యూ జారిపడి దగ్గరలో వున్న ఆకులు మరియు పండ్లపై ఒక నల్లని పదార్ధాన్ని ఏర్పరుస్తాయి. ఈ హానీ డ్యూ చీమలను ఆకర్షిస్తుంది. తీయని పదార్ధాలపైన వృద్ధి చెందే ఒక నల్లని బూజు చాలా త్వరితంగా ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుంటుంది. దీని వలన కిరణజన్య సంయోగ క్రియ మందగిస్తుంది. బాగా దెబ్బతిన్న ఆకులు ముందుగానే రాలిపోవచ్చు. పెద్ద క్రిములు ముదురు బూడిద లేదా గోధుమ నుండి నలుపు రంగులో ఆకుల క్రింది భాగంలో మరియు కాండంపైన ప్రస్ఫుటంగా కనపడతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

స్కూటెల్లిస్ట కాయ్రులియా, డైవర్సినెర్వాస్ ఎలెగాన్స్ మరియు మెటాఫికస్ హెల్వోలుస్ వంటి కొన్ని పరాన్నజీవి కందిరీగలు పారసైట్ మరియు లేడీ బర్డ్స్ ( చిలోకోరస్ బిపస్టులటస్ అనుకూల పరిస్థితులలో ఈ బ్లాక్ స్కేల్ ను నాశనం చేస్తాయి. ఆ ప్రాంతంలోనే జీవించే వీటి సహజ శత్రువులను రక్షించడానికి విస్తృత పరిధి కలిగిన పురుగుల మందుల వాడకాన్ని నివారించండి. కనోలా నూనె లేదా ఫంగస్ ఆధారిత జీవన పురుగుల మందులను ఈ బ్లాక్ స్కేల్ ను నియంత్రించడానికి వాడవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ పాకే క్రిముల ఉనికిని తెలుసుకోవడానికి రెండు వైపులా జిగురు వున్న వలలు చెట్టు ఆకులలో వేలాడతీయండి. . ఇవి గరిష్ట స్థాయిని మించి ఉంటే మినిరల్ ఆయిల్ ను సన్న ధారగా పిచికారీ చేయండి. లేదా కీటకాల ఎదుగుదలను నియంత్రించే పైరిప్రోక్సిఫెన్ ను ఉపయోగించవచ్చు. క్లోర్ఫెరిఫోస్ మరియు కార్బరిల్ కలిగిన మందులను పిచికారిగా ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

బ్లాక్ స్కేల్ పెద్ద క్రిములు 5 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ముదురు గోధుమ లేదా నల్లని రంగులో ఉండి వెనక భాగంలో H ఆకారంలో ఉబ్బెత్తుగా ఉంటుంది. శరదృతువులో ఇవి కొమ్మలు మరియు రెమ్మలపైకి చేరి వాటి మిగిలిన జీవితాన్ని అక్కడే గడుపుతాయి. చిన్న క్రిములు (పాకే క్రిములు) పసుపు నుండి నారింజ రంగులో ఉండి ఆకులు మరియు కొమ్మలపైన కనిపిస్తాయి. ఇవి నడిచి కానీ లేదా కొన్నిసార్లు గాలి వలన వెదజల్లబడి ఆకుల క్రిందిభాగంలో ఈనెల వెంబడి స్థిరపడతాయి. చెట్టుపైన దట్టమైన కత్తిరించని భాగంలో, చాలా వరకు ఉత్తరం వైపున, ఇవి బాగా వృద్ధి చెందుతాయి. దీనికి వ్యతిరేకంగా బాగా గాలి తగిలి విప్పారినట్టు వున్న చెట్లు ఇవి వృద్ధిచెందడానికి సహకరించవు. అననుకూల పరిస్థితులలో ఇవి సంవత్సరంలో ఒకటి లేదా రెండు తరాలు కలిగి ఉంటాయి. నీటి సౌలభ్యం వున్న తోటలలో ఇవి రెండు తరాలను చేరుకుంటాయి. నిమ్మ జాతి, పిస్తాచూ, పియర్, స్టోన్ ఫ్రూట్ చెట్లు మరియు దానిమ్మ చెట్లు వీటికి ఇతర ప్రత్యామ్న్యాయంగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • ఈ బ్లావోకడోవాక్ స్కేల్ లక్షణాలకు ఆలివ్ చెట్లను క్రమం తప్పకుండా గమనిస్తూ వుండండి.
  • చెట్ల పైభాగంలో ఆకులను సరైన విధంగా కత్తిరించడం వలన గాలి బాగా ప్రసరించి ఈ బ్లాక్ స్కేల్ జీవిత చక్రానికి ఆటంకం కలిగిస్తుంది.
  • దీని తీవ్రత తక్కువగా వున్నప్పుడు మొక్కల భాగాలను చేతితో తొలగించడం లేదా కీటకాలను చేతులతో నలిపివేయడం చేసి దీనిని సమర్ధవంతంగా నివారించవచ్చు.
  • తెగులు సోకిన చెట్ల భాగాలను తొలగించి వాటిని కాల్చివేయడం కానీ లేదా తోటకు దూరంగా బాగా లోతులో పూడ్చి పెట్టడం కానీ చేయాలి.
  • వీటి సహజ శత్రువుల జనాభాకు నష్టం కలగకుండా చూడడానికి అధిక మోతాదులో పురుగుల మందుల వాడకం నివారించండి.
  • వీటిని రక్షించే చీమలను నియంత్రించడానికి చెట్టు కాండం చుట్టూ జిగురు పదార్ధాలను పూయండి.
  • ఒక చెట్టు ఆకులు ఇంకొక చెట్టుకు తగలకుండా ఉండడానికి చెట్ల ఆకులను కత్తిరించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి