ఆలివ్

ఆలివ్ సిల్లిడ్

Euphyllura olivina

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • సిల్లిడ్స్ మొగ్గలు.
  • పువ్వులు, లేత చిగుర్లు మరియు లేత పండ్లను తింటాయి.
  • దీనివలన కణజాలం దెబ్బతింటుంది.
  • తేనే బంక నల్ల బూజును ఆకర్షించి కిరణజన్య సంయోగ క్రియను పరిమితం చేస్తుంది.
  • మైనం లాంటి స్రావం పువ్వులు మరియు పండ్లు రాలిపోయేలా చేస్తుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
ఆలివ్

ఆలివ్

లక్షణాలు

ఆలివ్ సిల్లిడ్‌లు ఆలివ్ చెట్లను మూడు విధాలుగా ప్రభావితం చేస్తాయి: మొదట మొగ్గలు, పువ్వులు, లేత చిగుర్లు మరియు చిన్న పండ్లను నేరుగా ఆహారంగా తీసుకోవడం ద్వారా; రెండవది, ఈ కణజాలాల చక్కెర లాంటి రసాన్ని పీల్చేటప్పుడు అవి సమృద్ధిగా తేనెను ఉత్పత్తి చేస్తాయి, దీని ఫలితంగా నల్ల బూజు వృద్ధి చెంది ఆకుల కిరణజన్య సంయోగక్రియ తగ్గుతుంది. చివరగా, ఆలివ్ చెట్లు పుష్పించే మరియు పండు ఏర్పడే సమయంలో, పిల్ల పురుగులు స్రవించే మైనం లాంటి స్రావం వలన పువ్వులు మరియు చిన్న పండ్లు అకాలంగా రాలిపడిపోవడానికి కారణమవుతుంది. ఈ పురుగుల జనాభా అధికంగా ఉన్నప్పుడు చిన్న చెట్ల పెరుగుదలను తగ్గిస్తుంది మరియు దిగుబడి గణనీయంగా తగ్గడానికి కారణమవుతుంది. తెగులు అధికంగా సోకిన చెట్లలో 30 నుండి 60% వరకు పంట దిగుబడి తగ్గుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వీటి సహజ శత్రువులైన కీటకాలు ఉదా. పరాన్నజీవి కందిరీగ సైలెఫాగస్ యుఫిల్లూరే, పైరేట్ బగ్ ఆంథోకోరిస్ నెమోరాలిస్, లేస్ వింగ్ క్రిసోపెర్లా కార్నియా మరియు లేడీ బీటిల్ కోకినెల్లా సెప్టెంక్టాటా ఆలివ్ సిల్లిడ్ జనాభాను తగ్గిస్తాయి. సాధారణంగా, విస్తృత-స్థాయి పురుగుమందులను ఉపయోగించడం ద్వారా ఈ జాతులను నిర్మూలించకుండా చూసుకోండి. సిల్లిడ్లకు వ్యతిరేకంగా పనిచేసే, అవశేషాలు లేని, ఆర్గానిక్ కాంటాక్ట్ క్రిమిసంహారకాలైన వేపనూనె మరియు హార్టికల్చర్ నూనె ఆధారిత క్రిమి నాశక సబ్బులను కీటకాలు తమ రక్షిత మైనపును స్రవించే ముందు వాడాలి. పందిరిలో గాలి ప్రసరణను మెరుగుపరచడానికి మరియు ఆలివ్ సిల్లిడ్లను వేడికి బహిర్గతం చేయడానికి తెగులు సోకిన చెట్టు భాగాలను కత్తిరించవచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. సకాలంలో పురుగుమందులను పిచికారీ చేసినట్లయితే సిల్లిడ్ ని ప్రభావవంతంగా నియంత్రించవచ్చు, కానీ చివరి ప్రయత్నంగా మాత్రమే వీటిని ఉపయోగించాలి. వాటికి కొంత నిరోధకతను అందించే వాటి రక్షణ మైనపును కీటకాలు స్రవించే ముందు ఈ ఉత్పత్తులను పిచికారీ చేయాలి.

దీనికి కారణమేమిటి?

ఆలివ్ సిల్లిడ్, యుఫిల్లూరా ఒలివినా తినడం వలన లక్షణాలు కలుగుతాయి. పెద్ద పురుగులు ఆలివ్ చెట్టు కాండం యొక్క పగుళ్లలో శీతాకాలం మనుగడ సాగిస్తాయి. ఇవి లేత గోధుమరంగు శరీరంతో, సుమారు 2.5 మిమీ పొడవు మరియు కొన్ని చిన్న ముదురు రంగు మచ్చలతో ముందు రెక్కలను కలిగి ఉంటాయి. ఆడ పురుగులు వసంతకాలంలో కొత్త చిగుర్లు మరియు మొగ్గలపై 1000 వరకు గుడ్లు పెట్టగలవు. పిల్ల పురుగులు చదునుగా ఉండి, ఆకుపచ్చ నుండి టాన్ రంగులో ఉంటాయి మరియు వాటిని రక్షించే తెల్లటి మైనపు పూతను స్రవిస్తాయి. 20° మరియు 25°C మధ్య ఉష్ణోగ్రతల వద్ద, అవి వాటి జీవిత చక్రాన్ని మూడు నెలల్లో పూర్తి చేయగలవు మరియు ఈ పరిస్థితుల్లో సంవత్సరానికి మూడు తరాల వరకూ ఉంటాయి. వెచ్చని ఉష్ణోగ్రతలలో (27°C కంటే ఎక్కువ), సిల్లిడ్లు తక్కువ చురుకుగా ఉంటాయి మరియు 32°C కంటే ఎక్కువ ఉంటే వాటిలో మరణాలు పెరుగుతాయి. పిల్ల పురుగులు మరియు పెద్ద పురుగులు తినడం వలన మొక్కల కణజాలం చీలిపోతుంది మరియు అన్ని భాగాలకు పోషకాలను పంపిణీ చేసే మొక్కల సామర్ధ్యం బలహీనపడుతుంది. ఆలివ్ సిల్లిడ్లు పుష్పగుచ్ఛాలపై ఉన్నప్పుడు ఇది సమస్యగా మారుతుంది, ఇది చివరికి పండ్లు తయారవ్వడం మరియు దిగుబడిని ప్రభావితం చేస్తుంది.


నివారణా చర్యలు

  • వసంతకాలం ప్రారంభం నుండి ఆలివ్ సిల్లిడ్ జనాభా కోసం మొక్కలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • సిల్లిడ్లను పట్టుకోవడానికి జిగురు ఉచ్చులు సిఫార్సు చేయబడ్డాయి.
  • విస్తృత-స్థాయి పురుగు మందులను అధికంగా ఉపయోగించడం ద్వారా సిల్లిడ్స్ యొక్క సహజ శత్రువులైన కీటకాలు నిర్మూలించబడకుండా చూసుకోండి.
  • చెట్ల మధ్య తగినంత ఖాళీ ఉంచండి.
  • సిల్లిడ్ కి అననుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, ఆకుల మధ్యన తగినంత గాలి ప్రసరణ ఉండేలా అలాగే సూర్యరశ్మి బాగా తగిలేలా చూసుకోండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి