ఇతరములు

మారుకా మచ్చల పురుగు

Chilo partellus

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • - పూలు మరియు కాయలు కలిసిపోయి ఉంటాయి.
  • - కొమ్మలు వాలిపోతాయి - కాయలలో ఉన్న విత్తనాలు పూర్తిగా లేదా పాక్షికంగా తొలచబడి ఉంటాయి.
  • - మొగ్గలు, పువ్వులు మరియు కాయలపై రంధ్రాలు.


ఇతరములు

లక్షణాలు

మారుకా మచ్చల పురుగు యొక్క చిన్న లార్వా మొగ్గలు మరియు పూలను ఆహారంగా తింటాయి. పెద్ద పురుగులు ఎదుగుతున్న కాయలపై రంధ్రాలు చేస్తాయి. లార్వా మలం ద్వారా పూలు మరియు కాయలు కలిసిపోయి ఉంటాయి. చివరి చిగుర్లను మరియు కాయలను తినడం ప్రారంభిస్తాయి. మినపలో కొమ్మల నుండి ఆకు అక్షం ద్వారా కాండం లోకి రంధ్రాలు చేయడం వలన మొక్క వాలిపోతుంది. కంది పంటలో ఆకులు చుట్టుకుపోవడం మరియు వెబ్బింగ్ అవ్వడం జరుగుతుంది

Recommendations

సేంద్రీయ నియంత్రణ

పక్షులకు స్థావరాలు ఏర్పాటు చేయాలి ( ప్రతి హెక్టార్ కి 15 చొప్పున ) (నివారణ) అజాడిరక్తిన్, స్పైనోసాడ్ లేదా బాసిల్లస్ తురింజెన్సిస్ కలిగిన జీవ నియంత్రణ పురుగుల మందులు వాడవచ్చు. తెగులు ప్రారంభ దశలో( లార్వా) 27 పారాసైటోయిడ్స్, 20 ప్రెడేటర్లు, 2 ప్రోటోజోవన్స్, 2 బాక్టీరియా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. పారాసైటోయిడ్స్ కుటుంబం: టాచినిడే దే, బ్రాకోనిడర, ఛాల్సిడిడై వేప గింజల సారం ఎన్ కె ఎస్ ఈ, వేప నూనె, ఎన్ఓ (ఒకటే వాడడం వలన అంతగా ప్రభావం చూపించకపోవచ్చు. కానీ కలిపి వాడడం వలన లార్వా సంఖ్యను తగ్గిస్తాయి. (మొక్కకి 1.0 & 1.3)

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. క్లొరాంత్రనిలిప్రోల్ క్లొర్ఫైరీఫాస్ మరియు ఫ్లూబెండియామైడ్ కలిగిన పురుగుల మందులను మారుకా మచ్చల పురుగు ను నియంత్రించడానికి ఉపయోగించవచ్చు. తెగులు నిరోధకత...... ఆర్ధిక నష్ట నియంత్రణ మొక్కకి 3 పురుగులు

దీనికి కారణమేమిటి?

మచ్చల కాయ తొలుచు పురుగు ముందర ముదురు రెక్కల పైన తెల్లటి పట్టీలు మరియు తెల్లని వెనక రెక్కలపై ముదురు రంగు అంచును కలిగి ఉంది. ఇది ఆకులు, మొగ్గలు మరియు పువ్వులపై చిన్న సమూహాలలో గుడ్లు పెడుతుంది. మట్టిలో లేదా ఆకు వెబ్ లో ప్యూపా గా రూపాంతరం చెందడం జరుగుతుంది. కాండం, తొడిమ, పువ్వులు, కాయలకు నష్టం కలుగచేస్తుంది (అలసందలో 20-60%, కందిలో 25-40%) లార్వా రాత్రి సమయాల్లో తింటుంది, అపారదర్శక శరీరం పైన రెండు ముదురు గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. 20-28°C ఉష్ణోగ్రత (ఉష్ణమండల & ఉప ఉష్ణమండల ధాన్యం చిక్కుళ్ళు)మొలకల నుండి కాయలు తయారయ్యే దశ వరకు. ఆకులు చుట్టుకుపోవడం మరియు వెబ్బింగ్ తర్వాత కంది మొక్కల లోపల తినడం కొనసాగుతూనే ఉంటుంది పుష్పించే దశ మరియు కాయలు తయారయ్యే దశల్లో, లార్వా మొగ్గలు, పువ్వులు మరియు కాయలను తింటుంది


నివారణా చర్యలు

  • ఆరోగ్యవంతమైన మొక్కల లేదా ధృవీకరించ బడిన రోగ రహిత విత్తనాలు మాత్రమే వాడాలి.
  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉండే తెగులు నిరోధక రకాలను వాడాలి.
  • చీడ సోకిందేమో తెలుసుకోవడానికి (గ్రుడ్లు, గొంగళిపురుగులు మరియు నష్టం) పంటను గమనిస్తూ ఉండాలి.
  • చీడ సోకిన పువ్వులు, కాయలు మరియు మొక్క భాగాలను చేతులతో తొలగించాలి.
  • నత్రజని ఎరువులను సరైన మోతాదులో వాడాలి.
  • పొలంలో, పొలం చుట్టుపక్కల కలుపు మొక్కలను నివారించడానికి సరైన పద్దతి పాటించాలి.
  • పొలంలో ఎక్కువ నీరు లేకుండా చూడాలి.
  • ఎక్కువమొత్తంలో నీరు ఉంటే తెగులు అధికంగా సోకే ప్రమాదం వుంది.
  • వీటిని పట్టుకోవడానికి ఉచ్చులను ఉపయోగించాలి.
  • పక్షులు ఉండడానికి వీలుగా పక్షి గూళ్ళు ఏర్పాటు చేయాలి.
  • విస్తృత పరిధి కలిగిన కీటక నాశినులు ఉపయోగించరాదు.
  • అలా ఉపయోగిస్తే పంటకు మేలు చేకూర్చే కీటకాలకు కూడా నష్టం కలుగుతుంది.
  • పంట అవశేషాలను తొలగించండి.
  • పంట మార్పిడి పద్దతిని పాటించండి.
  • తరువాత పంటగా వరి లేదా మొక్కజొన్న పంటలను వేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి