ఇతరములు

శనగ పచ్చ పురుగు

Helicoverpa armigera

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • పువ్వులు మరియు కాయలపై ఇవి తిన్న నష్టం కనిపిస్తుంది.
  • గుండ్రటి రంధ్రాలతో కాయలు.
  • ఆకులు రాలిపోవచ్చు.


ఇతరములు

లక్షణాలు

లార్వాలు మొక్కల అన్ని భాగాలపై దాడిచేస్తాయి కానీ ఇవి పూలు మరియు కాయలను ఇష్టపడతాయి. కాయలపై, ఇవి తినడం వల్ల ఏర్పడిన నల్లటి రంధ్రాలు కనిపిస్తాయి. కొన్ని సార్లు తినే సమయంలో లార్వాలు కాయల నుండి బయకుట వేలాడుతూ కనిపిస్తాయి. ఒక వేళ పువ్వులు లేదా కాయలు లేకపోతే లార్వాలు ఆకులపై కూడా దాడి చేస్తాయి. దీనివలన ఆకులు రాలిపోతాయి

Recommendations

సేంద్రీయ నియంత్రణ

పొలంలోనూ, చుట్టుపక్కల హెలికోవేర్పపై దాడి చేసే ఉపయోగకర కీటకాలు ఎక్కువగా ఉండేలాగా చూడాలి. ట్రైకోగ్రామా కందిరీగలు, మైక్రోప్లైటీస్, హెటెరోపెల్మా, నేతేలియా, దాడి చేసే పురుగులు, పెద్ద కన్ను పురుగు, మెరిసే కవచపు పురుగు వంటివి వీటి ఎదుగుదలని నియంత్రిస్తాయి. చీమలు మరియు సాలెపురుగులు లార్వాల పై దాడి చేస్తాయి. మెటారైజియమ్ అనిసోప్లియే, బెవేరియా బాసియాన మరియు బాసిల్లస్ తురింగియెన్సిస్ వంటి జీవ క్రిమినాశనులు కూడా వాడవచ్చు. వేప పదార్థాలు మరియు మిరప లేదా అల్లం సారం వంటి బొటనికల్ ఉత్పత్తులు కూడా ఆకులపై పిచికారీ చేసి ఈ చీడను నియంత్రించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఎటువంటి రసాయనిక మందులు వాడాలి అని నిర్ణయం తీసుకోవడానికి వాటి సంఖ్యను గమనిస్తూ వుండండి. వరుసగా మూడు రాత్రులు, 4 ఉచ్చులకు ఒక రాత్రికి 8 చిమ్మటల చొప్పున ఆర్ధిక లాభదాయకత స్థాయి నిర్ణయించబడింది. ఈ క్రిములు పెరిథ్రోయిడ్ ఆధారిత కీటక నాశినులపై కొంత వరకు రోగనిరోధకను పెంచుకున్నాయి.

దీనికి కారణమేమిటి?

పెద్ద లార్వా దాదాపుగా 1.5 సెంటీమీటర్ పొడవు కలిగి మరియు రెక్కల పొడవు 4 సెంటీమీటర్లు కలిగి ఉంటాయి. ఇవి బూడిద గోధుమ రంగు శరీరం, జుట్టు లాంటి పై భాగం మరియు ముందు రెక్కల అంచులపైన ముదురు గోధుమ రంగు పట్టీ కలిగి ఉంటాయి. వెనుక రెక్కలు తెల్లగా అంచులలో పసుపురంగు గీతలు మరియు అంచుల మీద వెడల్పుగా నల్లటి పట్టీ కలిగి ఉంటాయి. ఆడ పురుగులు పుష్పించే దశలో లేదా పుష్పించే దశకు వచ్చే మొక్కలపైన పసుపురంగుతో కూడిన తెలుపు గ్రుడ్లు పెడతాయి. లార్వాలు ఎదుగుతున్న పరిస్థితులను బట్టి వాటి లక్షణాలు మారుతూ ఉంటాయి. కానీ ఆ పురుగులు అన్ని కూడా పాలిపోయినట్టు వుండే పొట్టను కలిగి వుంటాయి. అవి ఎదిగేకొద్దీ నల్లని మచ్చలు మరియు తెలుపు లేదా పసుపు చారలు వాటి పాశ్వాలపై ఏర్పడతాయి. వీటి కాలము యొక్క వివిధ దశలు వాతావరణపరిస్థితులు తినటానికి తగినంత తిండి లభ్యత మీద ఆధారపడి వుంటాయి.


నివారణా చర్యలు

  • తెగుళ్లను తట్టుకునే ఒక రకాన్ని ఎంచుకోండి(ఉదా: Co-6 or Co-7, సి ఓ- 6, సి ఓ- 7).
  • పొలం సరిహద్దులో కంది వంటి పంటలను నాటడం ద్వారా ప్రయోజనకరమైన కీటకాల జనాభాను కొనసాగించడానికి ప్రయత్నించండి.
  • తెగులును ఆకర్షించడానికి మీ పొలం చుట్టూ ఉచ్చు పంటలను (ఆముదం లేదా క్రిసాన్తిమం మేరిగోల్డ్)ఉపయోగించండి.
  • పక్షులకోసం ఎకరానికి 10 కొమ్మలను ఏర్పాటు చేయండి.
  • లార్వా ఉనికిని తెలుసుకోవడానికి మీ మొక్కలను తరచుగా పర్యవేక్షించండి.
  • కాంతి ఉచ్చులు (1/5 ఎకరాలకు) వాడండి మరియు సాయంత్రం వేళల్లో గమనించండి.
  • పారా-లింగాకర్షక బుట్టలను (5/1 ఎకరాలకు) ఏర్పాటు చేయండి.
  • మంచి ఎరువుల ప్రణాళికతో పెద్ద మరియు మంచి తేజస్సు కలిగిన మొక్కలను పెంచడానికి ప్రయత్నించండి.
  • ఇది తెగులుకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి పొలాలను అధికంగా నీరు పెట్టకండి.
  • వీటిని వేటాడే కీటకాలకు లార్వాలను బహిర్గతం చేయడానికి పంట కోత తర్వాత కనీసం 10 సెం.మీ.
  • లోతుకు పొలాన్ని దున్నండి.
  • తెగులు యొక్క పురోగతిని ఆపడానికి ఈ వ్యాధి సోకని మొక్కలను అంతర పంటగా వేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి