సోయాబీన్

సోయాబీన్ పై కంపు నల్లి

Pentatomidae

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు మరియు కాండములపై కొద్దిగా నష్టం కనపడుతుంది.
  • పరిపక్వత చెందే సమయంలో ఈ పురుగులు కాయలు మరియు విత్తనాలను తింటాయి.
  • విత్తనాలు రూపు మారి సరిగ్గా ఎదగకుండా ఉండవచ్చు.
  • పాత విత్తనాలు రంగును కోల్పోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

సోయాబీన్

లక్షణాలు

ఈ పురుగుల వలన కలిగిన తెగులును పంట కోతకు ముందు కనిపెట్టడం చాల కష్టం. పెద్ద పురుగులు సోయాబీన్ కాయలు మరియు విత్తనాలపై వ్యాపిస్తాయి కానీ ఎటువంటి నష్టాలు మనకు బైటకు కనిపించవు. కోత సమయంలో రూపు మారిన, ఎదుగుదల లేని లేత విత్తనాలు కనిపిస్తాయి. ఈ పురుగులు మొక్కల వేరే భాగాలపై కూడా దాడిచేస్తాయి. చిన్నచిన్న గోధుమరంగు లేదా నల్లని మచ్చలు కణజాలాల పైన చూడవచ్చు. దీని వలన పండ్లు మరియు విత్తనాల పరిపక్వత పూర్తి కాదు మరియు మొక్కలు చాల తక్కువ మరియు చిన్న కాయలు కలిగి ఉంటాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ పురుగుల జనాభా తగ్గించటానికి వేటాడే ఈగలను లేదా కందిరీగల్ని ప్రోత్సహించాలి. ఇవి ఈ పురుగులపై గుడ్లు పెడతాయి. వీటి గుడ్లు ముదురు రంగులో ఉంటాయి. వీటి లార్వా పెరుగుతున్న పురుగులు మరియు పెద్ద పురుగులపై లోపలనుండి దాడి చేస్తాయి. సాలెపురుగులు మరియు పక్షులు ఈ పురుగుల సంఖ్యను తగ్గించడంలో తోడ్పడుతాయి. యూకలిప్టస్ యూరోగ్రాండిస్ నూనె ను వాడవచ్చు. ఇది పురుగులపై విషం లాగా పని చేస్తుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కీటక నాశినులు వాడే ముందు పొలంలో వున్న అని జాతుల కీటకాలను పరిశీలించండి. అవసరమనుకుంటే పైరిత్రోయిడ్ కలిగిన పురుగుల మందులు వాడవచ్చు.

దీనికి కారణమేమిటి?

అనేక రకాల నల్లి జాతి పురుగులు సోయాబీన్ మొక్కలపై దాడి చేస్తాయి. వీటిల్లో అక్రోస్టర్నుమ్ హిలరే అనేది అన్నింటికంటే ప్రమాదకరం. ఈ పురుగులు 1.3 సెంటీమీటర్ పొడవు ఉండి, ఆకుపచ్చ రంగులో ఒక కవచం మాదిరిగా ఉంటాయి. వీటి నుండి వచ్చే దుర్వాసన వలన వీటిని స్టింక్ బగ్స్ అని అంటారు వీటి నోటితో ఇవి కాయల్లో రంధ్రాలు చేసి వాటిలో పోషకాల్ని లాగేస్తాయి. వీటి గుడ్లు గొట్టాల ఆకారంలో ఉంటాయి. ఈ పురుగులు గుంపుగా గుడ్లను పెడతాయి.


నివారణా చర్యలు

  • ముందుగా నాటి ఈ కంపు నల్లి జనాభా బారిన పడకుండా నివారించవచ్చు.
  • పురుగుల సంఖ్య పెరగకుండా క్రమం తప్పకుండ పొలాన్ని గమనిస్తూవుండండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి