సోయాబీన్

సదరన్ కత్తెర పురుగు

Spodoptera eridania

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకుల పైన ఆకుపచ్చ గుడ్లు తెలుపు రంగు పొలుసులతో గుంపులుగా కనిపిస్తాయి.
  • ఇవి తినబడటం ఆకులు అస్థిపంజరాలవలె కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

సోయాబీన్

లక్షణాలు

చిన్నలార్వా రాత్రిళ్ళు మెలకువగా ఉండి ఆకుల క్రిందిభాగంనుండి తింటాయి. దీనివలన ఆకులు అస్థిపంజరాలుగా మారతాయి. ఇవి పెదవి ఔతున్నప్పుడు ఒంటరిగా ఉండి మొగ్గలకు రంధ్రాలు చేస్తాయి. వీటికి ఆహారం తక్కువగా లభిస్తున్నప్పుడు ఇవి కొమ్మల భాగాలను కాండం కణజాలాలు తింటాయి. సోయాబీన్ పంట ఒక్కదానినే పొలంలో వేసినప్పుడు ఇవి చాలా త్వరగా విస్తరించి మొక్కల ఆకులను రాల్చివేస్తాయి. అందువలన ఈ తెగులు సోయాబీన్ పంటలో చాలా ముఖ్యమైన తెగులు. ఇవి పంటలకు బాగా నష్టం కలిగించి దిగుబడిని తగ్గిస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వీటి సంక్రమణను తగ్గించటానికి సహజ నిరోధకాలను ప్రోత్సహించాలి ఉదాహరణకు కోటేసియా మార్గినివెంట్రిస్ వంటి కందిరీగలు, చేలొనస్ ఇన్సులరీస్, మేటీరస్ ఆటోగ్రాఫే, M. లాఫీగ్మెయి లేదా కాంపోలిటిస్ ఫ్లావిసింక్ట వంటి కీటకాలు వాడవచ్చు. అల్లిక రెక్కల పురుగులు మరియు అక్షింతల పురుగులు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. కొన్ని రకాల పక్షులు కూడా ఈ పురుగులను తింటాయి. బెయువేరియా బస్సియన ఫంగస్ ను ఈ లార్వా కు సంక్రమించేటట్టు కూడా చేయవచ్చు.వేప నూనె ను వాడి ఈ పురుగుల మొక్కను తినకుండా నిరోధించవచ్చు. కానీ జీవ నియంత్రణ పద్దతులతో ఈ లార్వాను నియంత్రించడం చాలా కష్టమైన పని.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కీటక నాశినులు వాడి సదరన్ కత్తెర పురుగు లను తొలి దశల్లో నియంత్రించవచ్చు. ఈ లార్వా పైన ఒకొక్క కీటక నాశిని ఒకో విధమైన విషపూరిత మోతాదులో పనిచేస్తాయి. సింథటిక్ పెరిథ్రోయిడ్స్ ల రసాయన గ్రూపులను ఈ తెగులుపైన ఉపయోగిస్తున్నారు.

దీనికి కారణమేమిటి?

స్పోడోప్తేరా అనే సదరన్ కత్తెర పురుగు లార్వా వలన ఈ నష్టం కలుగుతుంది. పెద్ద పురుగులు బూడిద గోధుమ రంగు లో ఉండి బూడిద రంగు ముందు రెక్కలతో పారదర్శకమైన తెల్లని వెనక రెక్కలతో ఉంటాయి. ఒక బీన్ రూపంలో వున్న మచ్చ రెక్కల మధ్యభాగంలో ఉంటుంది. ఆడ పురుగుల పచ్చని గుడ్లు ఆకుల క్రింద గుంపులుగా పెడతాయి. ఇవి తెల్లని పొలుసులను కలిగివుంటాయి. ఈ లార్వా నల్లని శరీరంతో పైన తెల్లని చుక్కలతో ఎర్రని గోధుమ తలను కలిగివుంటాయి. ఒక తెల్లని వరుస వీపు పైన ఉంటుంది. పార్శ్వ భాగంలో పసుపు చారలు ఉంటాయి. లార్వా తరువాత దశలలో పై చర్మం లేత రంగులోకి మారి రెండు వరసల నల్లని త్రికోణాలు వాటి వెనక భాగంలో ఏర్పడతాయి. ముందు భాగంలో ముదురు వృత్తాలు ఉంటాయి. 20-25°C ఉష్ణోగ్రత వద్ద ఇవి బాగా వృద్ధిచెందుతాయి. 30°C ఉష్ణోగ్రత వద్ద వీటి జీవన చక్రం తగ్గిపోతుంది.


నివారణా చర్యలు

  • 3 నెలల నుండి తెగులు సోకని ప్రదేశాల్లోని విత్తనాల్ని వాడాలి.
  • తెగులు రహిత విత్తనాలు ఎంచుకోవాలి.
  • ఫెరొమోన్ వలలు వాడి వీటిని పెట్టుకోవచ్చు.
  • గుడ్లు లేదా గొంగళి పురుగులు సోకిన మొక్కలను చేతితో పీకి తొలగించాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి