ఇతరములు

క్యారెట్ ఈగ

Chamaepsila rosae

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ప్రభావిత భాగాలలోని మార్గాలు వీటి విసర్జన పదార్ధాలతో నిండి వుంటాయి.
  • వేరు కొనలపై తుప్పు రంగు ఏర్పడి మొలకల చనిపోతాయి.

లో కూడా చూడవచ్చు

0 పంటలు

ఇతరములు

లక్షణాలు

క్యారెట్ ఈగ లార్వా తిన్న మార్గాల్లో ప్రభావిత మొక్కల భాగాలకు తుప్పుపట్టిన రంగుతో ఉన్న విసర్జన పదార్ధాలను మీరు గమనించవచ్చు. లార్వా తినడం ప్రారంభించినప్పుడు, దాడి ప్రారంభ దశలో కూడా మీరు వేరు కొనలపై తుప్పుపట్టిన రంగును గమనించవచ్చు. వీటి బారిన మొలకలు పడితే అవి చనిపోతాయి. తెగులు తీవ్రత అధికంగా వున్నట్లైతే అది పరిమిత నీటి ప్రసరణకు మరియు ప్రభావిత మొక్కలు వాడిపోవడానికి దారితీస్తుంది. క్యారెట్ ఈగ 4 నుండి 5 మిమీ పొడవు ఉంటుంది. తల, కాళ్ళు మరియు యాంటెన్నా పసుపు రంగులో ఉంటాయి. క్యారెట్ ఈగ లార్వా 0.5 నుండి 0.7 మిమీ సైజులో తెలుపు-పసుపు రంగులో ఉండి మెరుస్తూ వుంటాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

మీ క్యారెట్ మల్లను క్యారెట్ ఈగ నుండి రక్షించుకోవడానికి వాటిని రక్షణ వలలతో కప్పండి.

రసాయన నియంత్రణ

క్యారెట్ ఈగలతో పోరాడటానికి లాంబ్డా-సైహలోథ్రిన్ ఉపయోగించండి.

దీనికి కారణమేమిటి?

ఈగలు మట్టిలో 5 నుంచి 8 సెం.మీ లోతులో ప్యుపాగా నిద్రావస్థకు చేరతాయి. మొదటి తరం క్యారెట్ ఈగలు వసంతకాలంలో ఎగరడం మొదలుపెడతాయి. రెండవతరం, వేసవి చివరి నుండి మొదటిసారి మంచు పడేవరకు ఎగురుతాయి.


నివారణా చర్యలు

  • ఈ తెగులు సోకే అవకాశం తక్కువ వున్న రకాలను నాటండి.
  • పంట మార్పిడి చేయండి.
  • మొక్కలను కప్పడానికి సన్నని మెష్ వలలను ఉపయోగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి