దోసకాయ

తెల్ల దోమలు

Aleyrodidae

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి.
  • మెత్తని బూజు వృద్ధిచెందుతుంది.
  • ఆకులు రూపం కోల్పోవడం - చుట్టుకుపోవడం లేదా కప్ ఆకారం లోనికి మారడం జరుగుతుంది.
  • ఎదుగుదల తగ్గిపోతుంది.

లో కూడా చూడవచ్చు

43 పంటలు
అరటి
చిక్కుడు
కాకరకాయ
క్యాబేజీ
మరిన్ని

దోసకాయ

లక్షణాలు

ఈ తెల్ల ఈగలు పొలంలో మరియు గ్రీన్ హౌసులో పండించే రకాల మొక్కలను ఆశిస్తాయి. లార్వా మరియు పెద్ద పురుగులు మొక్కల కణజాలాన్ని తిని తేనె బంకను ఆకులపై, కాండంపై మరియు పండ్లపై విసర్జిస్తాయి. క్లోరోటిక్ మచ్చలు మరియు నల్ల బూజు ఈ తెగులు సోకియాన్ ప్రాంతాల వద్ద కనిపిస్తాయి. ఈ తెగులు అధికంగా వున్నప్పుడు ఈ మచ్చలు అన్ని ఒక్కటిగా కలిసిపోయి ఆకు మొత్తం వ్యాపిస్తాయి. ఆకులు ఆకారం కోల్పోయి చుట్టుకుపోయి కప్ వంటి ఆకారంలోకి మారతాయి. తెల్ల దోమలు టమాటో పసుపు ముడత వైరస్ లేదా కాస్సావా గోధుమ చారల వైరస్ వంటి వాటిని సంక్రమింప చేస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

తెల్ల ఈగల జాతులపైన మరియు పంట పైన ఆధారపడి వాటికి సంబంధించిన జీవ నియంత్రణలను వాడాలి. షుగర్ ఆపిల్ నూనె (అన్నోనా స్క్యూవమోస), పెరిత్రిన్స్, కీటక నాశక సబ్బులు, వేల గింజల సారం (NSKE 5%), వేప నూనె (5 మిల్లీలీటర్లు/ఒక లీటర్ నీటికి) సిఫార్స్ చేయబడింది. తెగులు కారక సూక్ష్మ క్రిములైన బెయువేరియా బస్సియన, ఇస్సరియ ఫుమ్సోరోసియా, వెర్టిసిల్లీయం లెక్కని మరియు పెసిలోమైసిస్ ఫుమోసోరోస్స్ లను కూడా ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తెల్ల ఈగలు చాలా త్వరగా పురుగులమందులకు నిరోధకతను పెంచుకుంటాయి. అందువలన ఒక దాని తర్వాత ఇంకొక మందులను మార్చి మార్చి వాడడం మంచిది. ప్రత్యామ్నాయ చికిత్స ఏమి లేకపోతే బైఫెంత్రిన్, బుప్రోఫెజిన్, ఫెనోక్సీకార్బ్, డెల్టామేత్రిన్ , లాంబ్డా- సైహాలోత్రిన్, సైపర్మేత్రిన్, పెరిత్రాయిడ్స్, పైమెట్రోజిన్, అజాడిరక్టిన్ లేదా స్పిరోమెస్ఫిన్ వాడటం వలన కూడా ఈ కీటకాలను నిర్మూలించవచ్చు. నివారణ చర్యలు తీసుకోవడం వలన ఈ కీటకాల జనాభాను పంటకు నష్టం కలిగించని విధంగా తగ్గించవచ్చు.

దీనికి కారణమేమిటి?

తెల్ల దోమలు 0.8 నుండి ఒక సెంటీమీటర్ పొడవు ఉంటాయి. వీటి శరీరం మరియు రెండు జతల రెక్కలు తెలుపు నుండి పసుపు బూడిద, మైనపు స్రావంతో కప్పబడి ఉంటుంది. ఇవి ఎక్కువగా ఆకుల క్రింది భాగంలో కనిపిస్తాయి. వీటిని కదిపినట్లైతే తేళ్లను మేఘం లాగ ఒక్కసారే పైకి వస్తాయి.ఇవి పొడి మరియు వెచ్చని వాతావరణంలో జీవిస్తాయి. ఇవి ఆకుల క్రింద గుడ్లు పెడతాయి. పిల్ల పురుగులు పసుపు రంగు నుండి తెల్లని రంగులో ఉండి చదునుగా, కోలగా మరియు పాలిపోయిన పచ్చ రంగులో ఉంటాయి. ఆహారం లేకుండా ఇవి ఎక్కువ కాలం బ్రతకలేవు. అందువలన ఈ తెగులును నివారించడంలో కలుపు మొక్కల నియంత్రణ చాలా ముఖ్యమైనది.


నివారణా చర్యలు

  • పొలంలో పసుపు రంగు జిగురు వలలు ఏర్పాటుచేసి ( ఎకరానికి 20) మీ పొలాన్ని గమనిస్తూ వుండండి.
  • ఈ తెగులు సోకని మొక్కలతో పంట మార్పిడి చేయండి.
  • ఈ తెల్ల దోమలను ఆకర్షించడానికి మరియు ప్రాలద్రోలడానికి ఇతర మొక్కలను పొలంలో అంతర పంటగా వేయండి.
  • (నాస్టుర్టియంస్, జిన్నియాస్, హుమ్మింగ్ బర్డ్ బుష్, పైనాపిల్ సెజ్, బీ బామ్) దట్టమైన వరుసలతో పొడవుగా ఎదిగే మొక్కజొన్న, జొన్న లేదా సజ్జలు వంటి మొక్కలను సరిహద్దు పంటలుగా వేయండి.
  • మీ ప్రక్క రైతులతో సంప్రదించి సీజన్లో బాగా ముందుగా కానీ ఆలస్యంగా కానీ కాకుండా సరైన సమయంలో విత్తనాలు నాటండి.
  • మొక్కలను దగ్గరగా నాటండి.
  • మొక్కలు వేసిన తర్వాత ఈ తెల్ల దోమలు పంటను ఆశించాయేమో తెలుసుకోవడానికి పొలాన్ని గమనిస్తూ వుండండి.
  • గుడ్లు లేదా లార్వా వున్న ఆకులను తొలగించండి.
  • తెగులు సోకిన మొదట్లో పొలంలో జిగురు వలలు ఏర్పాటుచేసి ఈ కీటకాలను మొత్తంగా పట్టుకోండి.
  • పొలంలో కలుపు మొక్కలను మరియు ఇతర అతిధి మొక్కలను తొలగించండి.
  • సరైన సంతులిత ఎరువులను వాడండి.
  • విస్తృత పరిధి కల కీటక నాశినులను ఉపయోగించకండి.
  • పంట కోతలు ముగిసిన తర్వాత గ్రీన్ హౌస్ లో పంట అవశేషాలను తొలగించి నాశనం చేయండి.
  • వెచ్చని ఉష్ణోగ్రతలు వున్నప్పుడు స్వల్పకాలిక రకాలను సాగు చేయండి.
  • అల్ట్రా వయొలెట్ కిరణాలను సంగ్రహించే ప్లాస్టిక్ ఫిల్మును ఉపయోగించడం వలన చీడపీడలను తగ్గించవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి