చిరుధాన్యాలు

హెడ్ మైనర్

Heliocheilus albipunctella

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • గొంగళి పురుగులు చిరు ధాన్యాల పైభాగంలో వుండే ఎదుగుతున్న గింజలను తింటాయి.
  • కంకుల పైభాగంలో ఏర్పడిన పైకి ఉబ్బిన శంఖు ఆకారపు ట్రాక్స్ బట్టి గింజల శోషణ లక్షణాన్ని చెప్పవచ్చు.

లో కూడా చూడవచ్చు


చిరుధాన్యాలు

లక్షణాలు

ఈ హెడ్ మైనర్ జీవిత చక్రం చిరు ధాన్యపు పంటల వృద్ధి దశలతో చాలా దగ్గరగా ముడిపడి ఉంటుంది. ఇవి పొదిగిన తర్వాత గొంగళి పురుగులు కంకులలోనే ఆహారం తీసుకుని వాటి లార్వా దశను పూర్తి చేసుకుంటాయి. విత్తనాల కంకులు వృద్ధి చెందుతున్నప్పుడు చిన్న లార్వా చిరు ధాన్యాల గింజల పైపొరలలోకి చేరి పువ్వులను తింటాయి. ఎదిగిన లార్వా పువ్వుల కాడలను కత్తిరించి గింజలు తయారవ్వకుండా చేస్తాయి లేదా పరిణితి చెందిన గింజలు పడిపోయేటట్టు చేస్తాయి. ఈ లార్వా పువ్వులు మరియు కాడలమధ్యభాగాన్ని తినడం వలన ఇవి పువ్వులు లేదా వృద్ధి చెందుతున్న గింజలను పైకి వచ్చేటట్టు చేసి ఒక శంఖాకారపు నమూనాను చిరుధాన్యపు మొక్కల తలపైన ఏర్పరుస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

హేబ్రోబ్రాకొన్ హెబెటోర్ దీని సహజ పరాన్నజీవి. ఆఫ్రికాలోని కొన్ని దేశాలలో దీనిని విజయవంతంగా ప్రయోగించారు. కొన్ని సందర్భాలలో ఇది 97% వరకు పురుగులను నాశనం చేయడం వలన దిగుబడి గణనీయంగా పెరిగింది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఇప్పటివరకు H అల్బీపంక్టెల్లను నియంత్రించడానికి ఎటువంటి రసాయన చికిత్స అందుబాటులో లేదు.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు హీలియోచీలస్ అల్బీపంక్టెల్ల అని పిలువబడే హెడ్ మైనర్ వలన కలుగుతాయి. చిరు ధాన్యాల పుష్పగుచ్చము ఏర్పడే సమయం మరియు పుష్పించే దశ ఈ పెద్ద పురుగులు ఎగిరే సమయం ఒకే సమయంలో జరుగుతుంది. పుష్పగుచ్చం తయారయ్యే సమయంలో ఆడ పురుగులు ఒకొక్కటిగా కానీ లేదా చిన్న చిన్న గుడ్లను పూరేకుల మధ్యన లేదా పుష్ప గుచ్చము మొదళ్ళ వద్ద కానీ పెడతాయి. ఈ గుడ్లు పొదగబడిన తర్వాత చిన్న లార్వా పుషప గుచ్చాన్ని తినడం మొదలుపెడుతుంది. పెద్ద పురుగులు శంఖువు ఆకారపు నమూనా సొరంగాలు ఏర్పాటుచేస్తాయి. పూర్తిగా ఎదిగిన లార్వా ఎర్రని రంగు లేదా గులాబీ రంగులోకి మారి నేలపైన పడతాయి. అక్కడ ఇవి ప్యుపాగా రూపాంతరం చెందుతాయి. మొతం పొడి సీజన్లో అవి ఈ దశలోనే ఉండిపోయి వర్షాలు ప్రారంభమైనప్పుడు ఇవి పెదపురుగులుగా మారి బైటకు వస్తాయి. పశ్చిమ ఆఫ్రికాలో సహేలియన్ ప్రాంతంలో ఇది సజ్జలలో చాలా ప్రమాదకారి అయిన తెగులు.


నివారణా చర్యలు

  • లార్వా కొరకు కంకులను గమనిస్తూ వుండండి.
  • తెగులు సోకిన కంకులను తొలగించి వాటిని పూడ్చిపెట్టడం లేదా పొలానికి దూరంగా తగల పెట్టడం ద్వారా నాశనం చేయండి.
  • స్వల్పకాలిక రకాలను( 75 రోజులలో పక్వానికి వచ్చే రకాలు) ఒక రెండు వారాల ఆలస్యంగా నాటడం వలన ఈ తెగులు సంక్రమించకుండా చేయవచ్చు.
  • పంట కోతల తర్వాత పొలాన్ని బాగా లోతుగా దున్ని లార్వా మరియు ప్యుపా బహిర్గతమయ్యేటట్టు చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి