నిమ్మజాతి

నిమ్మజాతిలో ఎర్ర సాలీడు

Panonychus citri

పురుగు

5 mins to read

క్లుప్తంగా

  • చిన్న, బూడిద లేదా వెండి రంగు మచ్చలు ఆకుల మీద కనిపిస్తాయి.
  • తెగులు సోకిన కణజాలం సాధారణంగా వెండి లేదా కాంస్య రూపాన్ని సంతరించుకుంటుంది.
  • తెగులు తీవ్రంగా ఉంటే ఆకులు రాలడం, కొమ్మలు చనిపోవడం, పండ్ల నాణ్యత తగ్గడం, మరియు చెట్ల శక్తి తగ్గడానికి దారితీస్తాయి.
  • ఈ క్రిముల వలన కలిగే నష్టాన్ని మంచి నీటి పారుదల వ్యవస్థ తగ్గిస్తుంది.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

ఈ తెగులులో చిన్న బూడిద రంగు లేదా వెండి రంగు మచ్చలు చెట్టు యొక్క అంచున వుండే లేత ఆకులపై కనిపిస్తాయి, ఈ ప్రక్రియను స్టిఫ్లింగ్ అని పిలుస్తారు. అప్పుడప్పుడు, పండ్లు మరియు కొమ్మలు కూడా ప్రభావితం కావచ్చు. అధిక స్థాయి ముట్టడిలో, ఈ మచ్చలు ఆకు లేదా ఆకుపచ్చ పండుకు వెండి లేదా కాంస్య రంగును ఇచ్చే మచ్చలుగా మారతాయి. తెగులు సోకిన ఆకు ప్రాంతంలో కిరణజన్య సంయోగ క్రియ కోసం ఉపయోగించే ఆకు ప్రాంతం తగ్గిపోతుంది మరియు తెగులు సోకిన ఆకు క్రమంగా చనిపోతుంది. ఎదగని ఆకు రాలిపోవడం, కొమ్మ ఎండిపోవడం, పండ్ల యొక్క నాణ్యత తగ్గి, చెట్ల యొక్క శక్తి తగ్గిపోతుంది. ప్రత్యేకించి, ప్రతికూల పర్యావరణ పరిస్థితులలో పొడి, గాలుల వాతావరణంలో ఇలా జరుగుతుంది. దీనికి విరుద్ధంగా, ఒక సరైన నీటి సరఫరా వ్యవస్థ ఈ కీటకం వలన కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

పానోనికస్ సిట్రీ కి పరాన్న జీవులు మరియు ఇతర సహజ శత్రువులు ఎక్కువ సంఖ్యలో వుంటాయి. ఇది తరచుగా దాని వ్యాప్తిని నియంత్రించడానికి సరిపోతుంది. వీటి సంఖ్య ఇంకా తక్కువగా ఉన్నప్పుడు నిమ్మజాతిలో ఎర్ర సాలీడు యొక్క సమర్థవంతమైన నియంత్రణ కోసం అనేక దేశాలలో అనేక ఫెటోసిడ్ పురుగులు (ఉదాహరణకు యుసేఇయస్ స్టిప్యులేటాస్) ఉపయోగించబడ్డాయి. స్టెతురస్ జాతికి చెందిన లేడీ బర్డ్ యొక్క కొన్ని జాతులుదీనిని చాలా ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఉష్ణోగ్రత ద్వారా ప్రభావితం అయ్యే బూజు, ముఖ్యంగా వైరస్, పొలంలో పానోనికస్ సిట్రి జనాభాను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. విస్తృత పరిధి కల పురుగు మందులు పరిస్థితిని తీవ్రం చేయగలవు కాబట్టి, కొన్ని పురుగు మందులు మాత్రమే సిఫార్సు చేయబడ్డాయి. ఉదాహరణకు, సింథటిక్ పెరిత్రాయిడ్స్ ఈ సాలీడు యొక్క వ్యాప్తిని ప్రోత్సహిస్తుంది. అనేక రకాల ఆకరిసిడ్స్ కీటక నాశినుల యొక్క వాడకం నిరోధకత అభివృద్ధిని తొలగిస్తుంది.

దీనికి కారణమేమిటి?

నిమ్మ జాతిలో ఈ తెగులు లక్షణాలకు మగ ఎర్ర సాలీడు సహకారం మరియు నిమ్మజాతి ఎర్ర సాలీడు పానోనికస్ సిట్రి యొక్క ఎదిగినవాటి మరియు గుడ్లు ఆహారం తీసుకోవడం కారణం అవుతుంది. అవి పియర్ ఆకారంలో ఇటుక-ఎరుపు రంగు శరీరం మరియు బలమైన తెల్లని వెంట్రుకలు వెనుక భాగంలో పియర్-ఆకారపు మచ్చల నుండి పొడుచుకు వస్తాయి. ఇవి నిమ్మజాతి చెట్లను మరియు అప్పుడప్పుడూ బొప్పాయి, కాసావా లేదా ద్రాక్ష వంటి ఇతర పంటలకు సోకుతాయి. ఇది ఆకులకు రెండు వైపులా కనిపిస్తుంది, కాని ఆకు పైభాగాన, ఆహారం కోసం ఎక్కువగా కనిపిస్తుంది. సిల్క్ దారం ఉత్పత్తి వలన దీనిని గాలి ద్వారా ఇతర చెట్లుకు సులభంగా రవాణా చేయవచ్చు. కీటకాలు మరియు పక్షులు వ్యాప్తి యొక్క ఇతర మార్గాలు. తెగులు సోకిన పనిముట్లు మరియు వ్యవసాయం సరిగ్గా చేయకపోవడం అనేవి కూడా తెగులును ఇతర పొలాలకు వ్యాప్తి చేయగలవు. చెట్లకు సరైన నీటి పారుదల వ్యవస్థ అనేది ఈ కీటకం వలన సంభవించే నష్టాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. దీనికి విరుద్ధంగా, తక్కువ లేదా అధిక తేమ, అధిక గాలి, కరువు లేదా బలహీనమైన వేరు వ్యవస్థ పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి. నిమ్మజాతిలో ఎర్ర సాలీడుకు సరైన పరిస్థితులు 25°C మరియు 50-70% తేమ.


నివారణా చర్యలు

  • సాలీడుల సంఖ్యలను అంచనా వేయడానికి తోటలను లెన్స్ తో క్రమం తప్పకుండా పరిశీలించండి.
  • అనుకూలమైన జీవుల మీద వ్యతిరేక ప్రభావాన్ని చూపే పురుగుమందుల యొక్క అధిక వినియోగమును నివారించండి.
  • చెట్టుకు నీటిని సరిగ్గా పెట్టండి మరియు కరువు ఒత్తిడిని దూరం చేయండి.
  • తోటలో కొమ్మలు గడ్డిని లేదా కలుపు మొక్కలను తాకడాన్ని నివారించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి