చెరుకు

చెరుకులో బాక్టీరియల్ ఆకు ఎండు తెగులు

Acidovorax avenae

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • ప్రధాన ఈనె వెంబడి మరియు ఆకు మొదలు వద్ద ఆకులపై నీరు లాంటి ఆకుపచ్చని చారలు ఏర్పడతాయి.
  • ఎరుపు చారలు ఆకు అంతటా వ్యాపిస్తాయి.
  • ఆకులు ఎండిపోయి కుళ్లిపోతాయి.
  • వేరు వ్యవస్థ తగ్గిపోతుంది.
  • ఎదుగుదల మందగిస్తుంది.

లో కూడా చూడవచ్చు


చెరుకు

లక్షణాలు

ఈ తెగులు చాలా వరకు లేత మరియు మధ్య వయసు ఆకులకు మాత్రమే సంక్రమిస్తుంది. ముందుగా ఆకు మధ్య ఈనెల వద్ద మరియు మొదలు వద్ద, ఒకేవిధంగా వున్న పొడవైన సన్నని పల్చని పచ్చ రంగు చారలు ఏర్పడతాయి. తరువాత ఇవి ఆకు మొత్తం వ్యాపించి ఒకదానితో మరొకటి కలిసిపోయి ముందుగా లేత రంగులోకి ఆ తర్వాత ముదురు ఎరుపు రంగులోకి ( నిర్జీవంగా) మారతాయి. ఆకులు ఎండిపోయి కుళ్లిపోయి ఒక అసహ్యకరమైన దుర్వాసన వెదజల్లుతాయి. ఇలా కాండం వరకు కుళ్ళేసరికి కణుపుల మధ్యన పెద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఈ తెగులు తరువాత దశలలో మొక్కలు పైభాగం మరియు పుష్ప గుచ్చాలు విరిగిపోయి నేలపైన పడిపోతాయి. దీనిని పై కుళ్ళు (టాప్ రాట్) అని పిలుస్తారు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

యసిడోఒరాక్స్ అవెనే ను నివారించడానికి ఎటువంటి ప్రత్యామ్న్యాయ మార్గాలు అందుబాటులో లేవు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తగిన శీలింద్ర నాశినులను వుపయోగించి 15 నుండి 20 నిముషాలపాటు విత్తన శుద్ధి చేయడం ద్వారా ఈ తెగులు ప్రాధమికంగా సంక్రమించకుండా నిరోధించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ బ్యాక్టీరియా అధిక తేమ మరియు అధిక ఉష్ణోగ్రతలను ఇష్టపడుతుంది. ఈ తెగులు మట్టి మరియు తెగులు సోకిన విత్తనాల ద్వారా ప్రాథమికంగా సంక్రమిస్తుంది. గాలి, వర్షపు తుంపరలు మరియు మట్టి ద్వారా కూడా సంక్రమిస్తుంది.


నివారణా చర్యలు

  • నిరోధక తట్టుకునే రకాలను వాడండి.
  • ఆరోగ్యంగా వున్న మొక్కలను విత్తన నర్సరీనుండి సేకరించండి.
  • ఆకుపచ్చ ఎరువుల పంటలతో పంట మార్పిడి చేయండి.
  • ఈ తెగులు సంక్రమించే సంఘటనలను తగ్గించడానికి పొలంలో డ్రైనేజ్ సౌకర్యాన్ని మెరుగుపరచండి.
  • నత్రజని ఎరువులను తగిన మోతాదులోనే వాడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి