చెరుకు

చెరకు రటూన్ స్టంటింగ్ డిసీజ్

Leifsonia xyli

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • రటూన్ ఎదుగుదల తగ్గిపోతుంది.
  • చిన్న కణుపులతో కూడిన సన్నని గడలు, పాలిపోయిన పసుపు ఆకులు.
  • కాండం యొక్క అంతర్గత రంగు మారిపోవడం లేదా ఎరుపు రంగు నిర్జీవ మచ్చలు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

చెరుకు

లక్షణాలు

ఎక్కువగా రటూన్ పంటలలో కనిపిస్తుంది. ముందుగా, ఎదుగుదల మందగించడం తప్ప స్పష్టంగా కనిపించే ఇతర చీడపీడల నిర్ధారణ లక్షణాలు కనపడవు. కణుపు ప్రాంతంలోని అంతర్గత మృదు కణజాలంలో సూది మొనను పోలిన బ్యాక్టీరియా యొక్క నారింజ రంగు చుక్కలు ఏర్పడతాయి. తరువాత, మొక్క ఎదుగుదల తగ్గిపోవడం, చిన్న కణుపులతో సన్నని కాడలు, లేత పసుపు ఆకులు మరియు పైకి వెళ్ళేకొలదీ సన్నగా అవ్వడం జరుగుతుంది. వాతావరణం మరియు సాగుపై ఆధారపడి కణుపు పసుపు రంగు నుండి ఎర్రటి-గోధుమ రంగులోకి మారవచ్చు. ఈ రంగు పాలిపోవడం చెరుకు గడ కణుపుల మధ్యకు విస్తరించదు. ఈ తెగులు సోకడానికి అధికంగా అవకాశం వున్న కొన్ని రకాల చెరుకులో తేమ ఒత్తిడి వున్నట్లైతే మొక్క వాలిపోవడం, ఆకు కొన మరియు అంచుల వద్ద కణజాలం నశించడం జరుగుతుంది. దిగుబడి తగ్గడం దీని మరొక లక్షణం.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

చికిత్సకు 1-5 రోజుల ముందు విత్తన చెరుకును కత్తిరించి వేడి నీటిలో (50°C వద్ద) 10 నిమిషాలు నానబెట్టండి. మరుసటి రోజు వేడి నీటిలో 50°C వద్ద 2-3 గంటలు నానబెట్టండి. తత్ఫలితంగా అంకురోత్పత్తి రేటు తగ్గవచ్చు అని గుర్తుంచుకోండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. అమ్మోనియం సల్ఫేట్ వాడడం వలన తెగులు గణనీయంగా తగ్గడమే కాకుండా చెరుకు దిగుబడి మరియు తెల్ల చక్కెర ఉత్పత్తి పెరిగింది. 52°C వద్ద యాంటీబయాటిక్ ప్లస్ వేడి నీటి చికిత్స 30 నిమిషాల వరకు చేయడం వలన కూడా కొంత వరకు ఈ తెగులును అణిచివేసి దిగుబడిని పెంచుతుంది.

దీనికి కారణమేమిటి?

ఈ బ్యాక్టీరియా మొక్కల అవశేషాలలో లేదా మట్టిలో చాలా నెలలు జీవించగలదు మరియు గాయాల ద్వారా మాత్రమే మొక్కలలోకి ప్రవేశిస్తుంది. ఈ బ్యాక్టీరియా గాయం ద్వారా యాంత్రికంగా సులభంగా వ్యాపిస్తుంది.


నివారణా చర్యలు

  • తెగులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఆరోగ్యంగా వున్న చెరుకును నాటండి.
  • మొక్కలను గాయపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి.
  • పంట కోత తర్వాత పొలంలోని మొక్కల అవశేషాలను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి