అరటి

మొకో వైరస్

Ralstonia solanacearum

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • తెగులు సోకిన మొక్కల ఆకులు ఎండిపోయి తరువాత రాలి పోతాయి.
  • వీటిని కత్తిరించి చూసినప్పుడు.
  • కాండం లోపలభాగంలో లేత పసుపు నుండి గోధుమ రంగులోకి మారటం కనిపిస్తుంది.
  • ఎండు తెగుల వలన పండు ల్పాల గుజ్జు పాడైపోవడం వలన పండ్లు కూడా రూపు మారి ముడుచుకుపోయినట్టు అయిపోతాయి.
  • పండు తొక్కను తొలగించినప్పుడు ఒక రకమైన బాక్టీరియల్ స్రావం కారుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

అరటి

లక్షణాలు

తెగులు సోకిన మొక్కల లేత ఆకులు ఎండిపోయి తరువాత రాలిపోతాయి. కాడలు బలం కోల్పోయి, ఆకులు మొక్కల పై వేలాడుతూ కనిపిస్తాయి మరియు మొక్కలు వాటి ఓజస్సును కోల్పోతాయి. ఈ తెగులు విస్తరించే కొలదీ పాత ఆకులు కూడా ఈ తెగులుకు గురవుతాయి. మొక్కలను కత్తిరించి చూస్తే పాలిపోయిన పసుపు నుండి గోధుమ రంగులోకి మారటం కణజాల ప్రాంతంలో కనిపిస్తుంది. ఎండు తెగులు వలన పండ్లు కూడా రూపు మారి, ముడుచుకునట్టు అయిపోతాయి. పండు తొక్కను తొలగించినప్పుడు ఒక రకమైన బాక్టీరియల్ స్రావం కారుతుంది. ఈ బాక్టీరియా మొక్కలలో పోషకాలు రవాణా అయ్యే ప్రాంతాల్లో వ్యాపించి మొక్కలకు తగినంత నీరు మరియు పోషకాలు అందకుండా చేస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

మొక్కల చుట్టూ బ్లీచింగ్ పొడి చల్లటం వలన ఈ తెగులు వ్యాపించకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది. నాటే ముందు మట్టిని 1% బోర్డియక్స్ మిశ్రమం, 0.4% కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా స్ట్రెప్టోసైక్లిన్ (5 గ్రాములు/10 లీటర్ల నీటిలో) వంటి యాంటిబయాటిక్స్ తో తడపటం కూడా మంచిది. మొలకలను కూడా 0.4% కాపర్ అక్సిక్లోరైడ్ మిశ్రమంలో 30 నిముషాల పాటూ శుద్ధిచేయవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ మొకొ తెగులుకు ఎటువంటి పురుగుల మందులు లేవు.

దీనికి కారణమేమిటి?

మొకొ అనేది అరటిలో కనిపించే తెగులు. ఇది రాల్స్టోనియా సోలనసెరమ్ అనే బాక్టీరియా వలన కలుగుతుంది. తెగులు సోకిన మొక్కల పదార్థాల్లో ఇది సంవత్సరం పొడుగునా, లేదా భూమిలో 18 నెలల పాటు జీవించి ఉంటుంది. ఇది అనేక విధాలుగా ఒక మొక్కనుంది ఇంకొక మొక్కకు వ్యాపిస్తుంది. మొక్కలో ప్రతి భాగం ఈ తెగులుకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే మొక్కలకు గాయాలు కలగకుండా చూడాలి. పరికరాలకు అంటుకున్న తెగులు సోకిన మట్టి లేదా పక్షుల వలన కూడా ఈ తెగులు వ్యాపిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు మరియు అదిక తేమ కూడా ఈ తెగులు సోకటానికి సహకరిస్తాయి. సాగు నీరు ద్వారా కూడా ఈ తెగులు సంక్రమిస్తుంది.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరంగా ఉన్న మొక్కల పదార్థాలను మాత్రమే వాడాలి.
  • తెగులు లక్షణాల కోసం పొలాన్ని తరుచు గమనిస్తూ ఉండాలి.
  • పొలంలో మొక్కల అవశేషాల్ని తొలగించి కాల్చి వేయాలి.
  • పొలంలో వాడే పరికరాలను పంటకు పెట్టే నీటిని శుద్ధిగా ఉండేలా చూడాలి.
  • 10% తాజా ఆవు పేడను పొలంలో చల్లాలి.
  • హెలికోనియా జాతికి చెందిన కలుపు మొక్కలను పొలం నుండి తొలగించాలి.
  • మంచి మురుగు పారుదల వ్యవస్థను ఏర్పాటుచేసుకోండి.
  • కనీసం 6 నెలలు పొలం బీడుగా వదిలి పెట్టాలి.
  • 12 నెలల పాటు పంట మార్పిడి చేయాలి.
  • ఫ్రెంచ్ మేరీగోల్డ్ ను పొలంలో మల్చింగ్ గా వాడడం వలన ఈ తెగులు వ్యాపించకుండా ఉంటుంది.
  • పొలంలో పని చేసే సమయంలో మొక్కలకు గాయాలు కాకుండా జాగ్రత్త వహించాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి