ఇతరములు

మామిడిలో బాక్టీరియల్ నల్ల మచ్చ తెగులు

Xanthomonas citri pv. mangiferaeindicae

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులపై నీటితో తడిచినట్టు వున్న నల్లని మచ్చలు.
  • తర్వాత ఈ మచ్చలు ఎండిపోయి లేత గోధుమ రంగు లేదా బూడిద రంగులోకి మారతాయి.
  • ఆకులు ముందుగానే రాలిపోతాయి.
  • పండ్లపై జిగురు స్రవించే పగుళ్లు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ఇతరములు

లక్షణాలు

బాక్టీరియాల్ నల్ల మచ్చ తెగులు ముఖ్యంగా ఆకులు మరియు పండ్లపై చూడవచ్చు కానీ కొన్ని సార్లు కొమ్మల పై కూడా దీని ప్రభావం చూడవచ్చు. మొదట్లో చిన్న నల్లటి మచ్చలు ఆకులపై కనబడుతాయి. ఈ మచ్చలు పసుపు రంగు అంచులు కలిగి ఉంటాయి మరియు ఆకు ఈనెలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. ఈ తెగులు తీవ్రత పెరిగినప్పుడు ఈ మచ్చలు ఎండి ఆకులు రాలి పోతాయి. మొదట్లో లేత మచ్చలు కనిపిస్తాయి. తరువాత ఇవి ముదురు నక్షత్రపు ఆకారం ఉన్న రంధ్రాలుగా మారతాయి. వీటినుండి జిగురులాంటి పదార్థం కారుతూ ఉంటుంది. తెగులు తీవ్రత తక్కువగా ఉన్నపుడు పండ్ల నాణ్యత తగ్గుతుంది కానీ తెగులు అధికంగా ఉన్నపుడు పండ్లు రాలి పోయే ప్రమాదం ఉంది. నల్లటి మరియు పగ్గుళ్లవంటి మచ్చలు కాండాలపై కనిపిస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిగిన పదార్థాలను పిచికారీ చేయటం కూడా ఈ తెగులుకు నిరోధించడంలో మరియు నాశనం చేయడంలో బాగా పనిచేస్తాయి అని రుజువు చేయబడినది. అసినేటోబాక్టెర్ బౌమాన్ని వంటి జీవన నియంత్రణ ఏజంట్లను తెగులు సోకిన చెట్లపైన ప్రయోగించడం వలన X సిట్రి జనాభా ప్రభావవంతంగా తగ్గించబడుతుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులును నియంత్రించడానికి థియోఫనేట్-మిథైల్ లేదా బెంజిమిడజోల్ కలిగిన మందులను పిచికారీ చేయవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ వ్యాధి క్సన్తోమోనాస్ సిట్రి అనే బాక్టీరియా వల్ల కలుగుతుంది, ఈ బాక్టీరియా దాదాపుగా 8 నెలల వరకు జీవ కణాల పైన జీవిస్తుంది. ఇది మొక్కలపై ఉన్న దెబ్బల నుండి మరియు సహజంగా తెరిచివుండే భాగాలనుండి వ్యాపిస్తుంది. ఇవి ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకు గాలితో కూడిన వర్షాల వల్ల వ్యాపిస్తాయి. ఈ బాక్టీరియాకు 25 నుండి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి. వాతావరణంలో అధిక తేమ కూడా వీటి ఎదుగుదలకు తోడ్పడుతుంది. తోటలో పవన నిరోధకాలను వాడటం లేదా ఆకులు అధికంగా వుండే చెట్లను నాటడం ద్వారా ఈ తెగులు వ్యాపించకుండా నిరోధించవచ్చు.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకర మొక్కలను మరియు శుద్ధి చేయబడిన పరికరాలు వాడండి.
  • తెగులు నిరోధక విత్తన రకాలు వాడండి.
  • మొక్కలకు గాలి బాగా తగిలేటట్టు చూడండి.
  • తెగులు సోకిన కొమ్మలను పండ్లను తొలగించండి.
  • తోటలో పని చేసే సమయంలొ మొక్కలకు గాయాలు కాకుండా చూడండి.
  • పవన నిరోధకాలను వాడి మొక్కలను అధిక వేగంతో వీస్తున్న గాలుల నుండి రక్షించండి.
  • పొలంలో వాడే పరికరాలను క్రమం తప్పకుండా శుద్ధి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి