పెండలం

పెండలంలో గోధుమ చార తెగులు (కాసావా బ్రౌన్ స్ట్రీక్ డిసీజ్)

CBSV

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • పసుపు లేదా నిర్జీవమైన ఈనెల నాడకట్టు ఏర్పడుతుంది.
  • ఆ తరువాత అది కలిసిపోయి, పెద్ద మచ్చలుగా ఏర్పడుతుంది.
  • దుంపల లోపల ముదురు-గోధుమరంగు ప్రాంతాలు వృద్ధి చెందుతాయి.
  • వ్యాధి ప్రారంభ దశలో లేత కాడలపై కొన్నిసార్లు గోధుమరంగు గాయాలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
పెండలం

పెండలం

లక్షణాలు

వ్యాధి యొక్క లక్షణాలు పెండలం రకాలు మరియు పర్యావరణ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. దీనివలన రోగ నిర్ధారణ కష్టమవుతుంది. గోధుమరంగు మచ్చలు లేదా గీతలు ప్రారంభ లక్షణాలుగా కనపడవచ్చు. కొన్నిసార్లు ఈ మచ్చలు లేత ఆకుపచ్చ కాడలపై కనిపిస్తాయి. అయితే, తరచుగా, మరియు మరింత స్పష్టంగా, ఆకు లామినాపై పసుపు లేదా నిర్జీవ ఈనెల నాడకట్టు లక్షణం కనిపిస్తుంది. తరువాత ఈ ఆకులు రంగు కోల్పోయి ( క్లోరోసిస్) విస్తరించి పెద్ద, పసుపురంగు పొక్కులు లాంటి మచ్చలుగా ఏర్పడుతుంది. తరువాతి దశలో, మొత్తం ఆకు రంగు కోల్పోయి, ఆకులు రాలిపోవచ్చు. సాధారణంగా, పూర్తిగా పరిపక్వమైన లేదా దాదాపుగా పరిపక్వమైన ఆకులు ప్రభావితమవుతాయి కాని వృద్ధి చెందని అపరిపక్వమైన ఆకులకు ఈ వ్యాధి సంక్రమించదు. వేరు పరిమాణం తగ్గుతుంది మరియు దుంపల లోపల ముదురు-గోధుమ రంగు నిర్జీవ ప్రాంతాలు వృద్ధి చెందుతాయి. వేర్లలో గాయాలు పంట కోసిన తర్వాత దుంపల క్షీణతకు దారితీస్తాయి. దుంపలో వ్యాధి లక్షణాల వృద్ధి చెందకుండా ఆకు మరియు/లేదా కాండంలో ఈ వ్యాధి లక్షణాలు సంభవించవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వైరస్ సోకిన తర్వాత మొక్కలకు ప్రత్యక్ష జీవ నియంత్రణ ఉండదు. పేను బంక, నల్లి, తెల్ల ఈగలు మరియు CBSV యొక్క అన్ని వాహకాల సహజ శత్రువులకు హాని కలిగించే పురుగుమందుల అధిక వినియోగం నుండి దూరంగా ఉండటం అనేది వ్యాధి యొక్క వ్యాప్తిని తగ్గించడానికి ఒక మార్గం.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వైరస్ వ్యాధులను రసాయనాల వాడకంతో చికిత్స చేయలేము. అయినప్పటికీ, తెల్ల ఈగలు, నల్లి మరియు పేనుబంక వంటి వాహకాల జనాభాను తగ్గించడానికి మరియు వ్యాధి సంభవించడాన్ని తగ్గించడానికి కీటక నాశినులను ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

కాసావా బ్రౌన్ స్ట్రీక్ వైరస్ వలన ఈ లక్షణాలు సంభవిస్తాయి, ఇది పెండలం మరియు రబ్బరు ఉత్పత్తి అయ్యే సంబంధిత మొక్కకు (సియారా రబ్బరు చెట్టు) మాత్రమే సంక్రమిస్తాయి. ఈ పురుగులు మరియు పేనుబంక అలాగే తెల్ల ఈగలు, బెమిసియా టాబాసి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఏదేమైనా, వ్యాధి వ్యాప్తి చెందడానికి ప్రధాన మార్గం మానవులు రవాణా చేసే తెగులు సోకిన మొక్క అంట్లు మరియు పొలంలో పరిశుభ్రత లేకపోవడం, ఉదాహరణకు పరిశుభ్ర వ్యవసాయ పరికరాల వాడకం. సంక్రమణ ప్రాంతాలు మరియు పర్యావరణ పరిస్థితులను బట్టి 18-70% వరకు దిగుబడి నష్టాలతో, ఈ వ్యాధి సంక్రమణకు వాటి సున్నితత్వం మరియు ప్రతిస్పందనలో పెండలం రకాలు చాలా భిన్నంగా ఉంటాయి. CBSD కు ఇంకా నివేదించబడని, వ్యాధి సోకిన అంట్లు యొక్క బారిన పడకుండా ప్రభావిత దేశాలకు పరిమితం చేయడానికి దిగ్బంధ చర్యలు అవసరం.


నివారణా చర్యలు

  • ధృవీకరించబడిన మూలాల నుండి వైరస్ లేని నాటే పదార్థాలను ఉపయోగించండి.
  • CBSV కి నిరోధకత గల లేదా తట్టుకోగలవని నిరూపించబడిన రకాలను పెంచండి.
  • పెండలం ఎదిగే దశ యొక్క మొదటి 3 నెలల వరకు ప్రతివారం పొలాన్ని గమనిస్తూ వుండండి మరియు వ్యాధి సోకిన లేదా వికృతంగా మారిన మొక్కలను తొలగించండి.
  • తెగులు సోకిన మొక్కలను కాల్చివేయడం లేదా లోతుగా పూడ్చడం ద్వారా వెంటనే నాశనం చేయండి.
  • CBSV ని బదిలీ చేసే కీటకాల యొక్క ప్రత్యామ్నాయ అతిథేయ మొక్కలను నివారించడానికి పొలాన్ని కలుపు లేకుండా ఉంచండి.
  • వివిధ పొలాల మధ్య పనిచేసేటప్పుడు వ్యవసాయ పరికరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయండి.
  • అంట్లను కొత్త పొలాలు లేదా కొత్త ప్రాంతాలకు రవాణా చేయవద్దు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి