టమాటో పసుపు రంగు ఆకు ముడత వైరస్ (TYLCV)

 • లక్షణాలు

 • ట్రిగ్గర్

 • జీవ నియంత్రణ

 • రసాయన నియంత్రణ

 • నివారణ చర్యలు

టమాటో పసుపు రంగు ఆకు ముడత వైరస్ (TYLCV)

TYLCV

వైరస్


క్లుప్తంగా

 • మందంగా మరియు ముడతలు కలిగిన ఆకులు, ఆకుల ఈనెలు పాలిపోయినట్లు ఉండడం ( ఇంటర్ వీనెల్ క్లోరోసిస్) సృష్టంగా కనిపిస్తుంది.
 • ఈ పాలిపోయిన ఆకుల అంచులు పైకి మరియు లోపలకు ముడుతలు పడిపోతాయి.
 • పండ్ల సంఖ్య తగ్గిపోతుంది కానీ పైన మాత్రం ఈ తెగులు యొక్క లక్షణాలేమి కనపడవు.

ఆతిధ్యం ఇచ్చేవారు:

టమాటో

లక్షణాలు

విత్తన దశలో ఈ తెగులు సంక్రమిస్తే ఆకులు మరియు రెమ్మల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనివలన మొక్కలు గుబురుగా పెరుగుతాయి. పెద్ద మొక్కల్లో అధికంగా కొమ్మలు పెరగడం, లావుగా వంగిపోయినట్టుండే ఆకులు ఏర్పడడం మరియు ఆకులలో పచ్చదనం పోయి పాలిపోయినట్టు అవ్వడం జరుగుతుంది. పూత దశకంటే ముందు ఈ తెగులు సోకితే పండ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. పైకి మాత్రం ఈ తెగులు లక్షణాలు ఏమి కనిపించవు.

ట్రిగ్గర్

TYLCV తెగులు విత్తనాల మీద వ్యాపించే తెగులు కాదు మరియు పరికరాల వలన కూడా సోకదు. ఇవి బేమిసియా టబాసి జాతికి చెందిన తెల్ల దోమల వల్ల వ్యాపిస్తాయి. ఈ దోమలు ఆకుల కింది భాగాల పై దాడి చేస్తాయి మరియు లేతగా వున్న మొక్కలపట్ల ఆకర్షితులవుతాయి. మొత్తం సంక్రమణ 24 గంటల్లో జరిగిపోతుంది. పొడి వాతావరణం లేదా అధిక ఉష్నోగ్రతలు ఈ తెగులుకు అనుకూలంగా ఉంటాయి.

జీవ నియంత్రణ

క్షమించండి, మాకు టమోటా పసుపు రంగు ఆకు ముడత వైరస్ కు ఇతర జీవ సంబంధిత నియంత్రణ మార్గం తెలియదు

రసాయన నియంత్రణ

వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పెరిథ్రాయడ్ కుటుంభానికి చెందిన శీలింద్ర నాశినులను వాడడం లేదా నారుమడి వేసినప్పుడు పైన చల్లడం లాంటివి చేయడం వలన తెల్లదోమ సంతతిని తగ్గించవచ్చు కానీ ఈ మందులను ఎక్కువగా ఉపయోగించడం వలన తెల్ల దోమ వీటికి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.

నివారణ చర్యలు

 • తెగులు నిరోధక విత్తన రకాలు వాడాలి.
 • తెల్లదోమ సోకని మొక్కలతో పంట మార్పిడి పద్ధతులు పాటించాలి.
 • నారుమళ్లను కప్పటానికి జాలీలు వాడాలి.
 • ఈ తెల్ల దోమ సంతతి పెరగక ముందే పంటను త్వరగా నాటాలి.
 • జిగురు పసుపు రంగు ప్లాస్టిక్ వలలు వాడాలి.
 • నారుమడిని ఆకులతో కప్పి ఈ తెగులు తరువాత వేసే పంటకు సోకకుండా జాగ్రత్త తీసుకోవాలి.
 • కీరదోసకాయ, గుమ్మిడి వంటి వ్యాధి సోకని మొక్కలతో పంటమార్పిడి చేయాలి.
 • కాని ఆ మొక్కలను టమాటో మొక్కలకు కొంచెం దూరంగా నాటాలి.
 • తెగులు సోకిన మొక్కల్ని తీసి నాశనం చేయాలి.
 • పంట కోత తర్వాత పొలంలో బాగా లోతుగా దున్ని పంట అవశేషాలను లోతుకు పూడ్చాలి లేదా కాల్చి వేయాలి.