వరి

వరిలో పసుపు మోటెల్ వైరస్

RYMV

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • క్రొత్తగా వచ్చే ఆకుల పైన పసుపు రంగు చారలు మరియు మచ్చలు కనపడతాయి.
  • పాత ఆకుల పైన పసుపు నుండి నారింజ రంగు మచ్చలు కనపడతాయి.
  • చారికల మధ్యలో ముదురు రంగులో మచ్చలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

లేత ఆకుల మీద పసుపు నుండి ఆకుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. ఇన్ఫెక్షన్ సోకిన రెండు వారాల తరువాత ఈ మచ్చలు ఆకు ఈనెలకు సమాతంరంగా పెరుగుతాయి. పసుపు రంగు చారికల మధ్యలో నల్లని మచ్చలు అభివృద్ధి చెందుతాయి. ముందు వచ్చిన ఆకులు పసుపు లేదా నారింజ రంగులో పాలిపోవడం చూడొచ్చు. మొక్కల పెరుగుదల క్షీణించవచ్చు మరియు దిగుబడి తగ్గుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వ్యాధి బారిన పడిన మొక్కలను నాశనం చేయండి లేదా కాల్చివేస్తే ఇంకా మంచిది.

రసాయన నియంత్రణ

వీలున్నంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ వైరస్ ను కంట్రోల్ చేయడానికి సరైన రసాయన పద్ధతులు ఏమి లేవు.

దీనికి కారణమేమిటి?

వైరస్ వ్యాపించటానికి బీటిల్స్ లేదా మిడతలు మరియు ఆవులు, ఎలుకలు, గాడిదలు కారణం. నీటిపారుదల వలన, మొక్కల స్రావం ద్వారా వ్యాధి సోకిన మొక్కలు ఆరోగ్యంగా ఉన్న మొక్కలకి తాకడం వలన మరియు నాశనం చేయని పంట అవశేషాల ద్వారా కూడా వైరస్ వ్యాపించవచ్చు.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక వరి వంగడాలను నాటండి.
  • తెగుళ్ల వ్యాప్తిని అడ్డుకోవడానికి త్వరగా నాట్లు వేయండి.
  • తరుచుగా కలుపును తీస్తూ వుండండి.
  • ప్రయోజకరమైన కీటకాలకు నష్టం కలగకుండా ఉండడానికి క్రిమిసంహారకాలను నియంత్రించండి.
  • కోత తరువాత చీడ సోకిన మొక్కలను నాశనం చేయండి లేదా తగలపెట్టండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి