బొప్పాయి

బొప్పాయి మొజాయిక్ వైరస్

PapMV

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులపై మొజాయిక్ నమూనాలో మచ్చలు ఏర్పడతాయి.
  • ఆకుల రూపు కొద్దిగా మారుతుంది.
  • ఎదుగుదల మందగిస్తుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

బొప్పాయి

లక్షణాలు

ఆకు మధ్యలో ముదర ఆకుపచ్చ బొడిపెలవంటి అతుకులతో మొజాయిక్ నమూనా కనపడుతుంది. పసుపు ఆకుపచ్చ ఆకులపై ఇది కనపడుతుంది.. ఆకు ఈనెలు ఖాళీ అయిపోయినట్టు కనపడతాయి. ఆకు కాడలు చిన్నగా ఉంటాయి మరియు ఆకులు నిటారుగా నిలబడతాయి. ఆకుల రూపు మారి మొక్కల ఎదుగుదల తగ్గుతుంది. ఆకులు రూపు మారి మరియు మొక్కల ఎదుగుదల తగ్గుతుంది. మొక్క ఇతర భాగాలకు ఎటువంటి నష్టం కలగదు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

పరికరాలను శుద్ధి చేయాలి లేదా వీటిని ఒవేన్ లో 150 డిగ్రీలవరకు ఒక గంటపాటు వేడి చేయాలి, పనిముట్లు లేదా గ్లోవ్స్ ను 0,0525% సోడియం హైపోక్లోరైట్ మిశ్రమంలో ముంచి నీటితో కడగాలి. వెర్టిసిల్లీయం వంటి సీలింద్ర నాశినులను ఈ తెగులును నియంత్రించడానికి వాడవచ్చు. ఈ తెగులు మొదటి దశలో కీటక నాశక సబ్బులను వాడడం వలన ఫలితం ఉంటుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఎల్లప్పుడూ అందుబా వీటికి ఎటువంటి రసాయన చికిత్స లేదు. సైపర్మేత్రిన్. క్లొర్ఫేరీఫాస్ లేదా పిరిమికార్బ్ ను వాడి ఈ అఫిడ్స్ ను నియంత్రించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ వైరస్ బొప్పాయి మరియు దోస జాతి పంటలను ఆశిస్తుంది. పెంకుపురుగులవలన ఈ తెగులు మొక్క మొక్క వ్యాపిస్తుంది. మొక్కలకు తగిలిన దెబ్బల వలన కూడా ఇది సోకుతుంది. ఇది అనేక రకాల వైరస్ వ్యాధులతో పోలివుంటుంది మరియు లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఈ వైరస్ పెద్ద నష్టం కలిగించదు కాని పరిస్థితులు అనుకూలిస్తే దిగుబడిలో నష్టాలు కలగ వచ్చు.


నివారణా చర్యలు

  • విత్తనాలు లేదా మొలకలు ఆరోగ్యకరమైనవి వాడాలి.
  • ఈ తెగులు సోకని ఇతర జాతుల మొక్కలతో పంట మార్పిడి చేయాలి.
  • తెగులు సోకిన మట్టిని లేదా పరికరాలను ఇతర తెగులు సోకని పొలాలలో వాడకూడధు.
  • తెగులు సోకిన మొక్కలను తొలగించాలి.
  • వేడితో కానీ లేదా ఇతర పద్దతులలో పరికరాలను శుద్ధి చేయాలి.
  • చేతులకు గ్లోవ్స్ వేసుకోవాలి.
  • చేతులు బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి