బొప్పాయి

గుండ్రని మచ్చల తెగులు (రింగ్ స్పాట్ వైరస్)

PRSV

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • పండ్ల పై ముదురు ఆకుపచ్చ వృత్తాలు.
  • ఆకులపై పసుపు రంగు మొజాయిక్ నమూనా నీటితో తడిచినట్టు వుండే మచ్చలు మరియు చారలు కాండాలపై కనపడతాయి.

లో కూడా చూడవచ్చు

6 పంటలు

బొప్పాయి

లక్షణాలు

ఈ తెగులుకు గురైనప్పుడు మొక్కల వయసు మరియు వైరస్ బలంపై లక్షణాలు ఆధారపడి ఉంటాయి. ముదురు ఆకుపచ్చ బుడగల వంటి నిర్మాణాలు ఆకులపై కనిపిస్తాయి. తరువాత ఇవి విరిగిన ఆకారాల్లో అనేక రకాల ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తాయి. తరవాత దశల్లో ఈ ఆకులపై పసుపు మరియు గోధుమ మచ్చలు ఏర్పడతాయి. ఆకులు చిన్నగా అయిపోతాయి మరియు ఎదుగుదల తగ్గిపోతుంది. నీట నానినట్టు వుండే రంగు కోల్పోయిన పసుపు మచ్చలు మరియు నూనె చారలు కూడా కాండాలపై కనిపిస్తాయి. తెగులు సోకిన పండ్లు బాగా ముదురు ఆకుపచ్చ, తరుచుగా నొక్కుకుపోయినట్టు వున్న, తగ్గిన పరిమాణం మరియు వైకల్య ఆకారం కలిగిన జిడ్డుగా వుండే అనేక రింగ్ లాంటి మచ్చలను చూపుతాయి. ముందుగానే సంక్రమణ జరిగితే, పండ్లు అమ్మకానికి పనికిరావు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

తెలుపు నూనె రసాయనాలు 1% సాంధ్రత నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు. ఈ వైరస్ సోకకుండా ఆపటానికి అనేక రకాల ఉపయోగకరం అయిన సూక్ష్మజీవులు బాక్టీరియా, ఈస్ట్, ఆక్తినోమైసీట్స్ మరియు ఫోటో సింథటిక్ బాక్టీరియా వంటివి కూడా బొప్పాయిపై దీని ప్రభావాన్ని తగ్గించటానికి ఉపయోగకరంగా ఉంటాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ వైరస్ తెగులుకు వ్యతిరేకంగా ఎటువంటి రసాయన చికిత్స లేదు కానీ పేను బంక పురుగుల జనాభాను నియంత్రించడానికి డై-మేథోయేట్ లేదా అజాడిరక్తిన్ వంటి మందులను పిచికారీ చేయవచ్చు. తొలి లక్షణాలు కనిపించాక ప్రతి రెండు వారాలకు ఒక సారి పిచికారీ చేయవలెను.

దీనికి కారణమేమిటి?

ఈ వైరస్ అనేక రకాల పెంకు పురుగు జాతుల వలన వ్యాపిస్తుంది. ఇది అఫిడ్స్ లో పెరగదు కాబట్టి , మొక్క నుండి మొక్కకు వ్యాపించటం అనేది తక్కువ వ్యవధి లోనే జరగాలి( నిముషం కన్నా తక్కువ సమయంలో) దీనికి పుచ్చకాయ వంటి అనేక ప్రత్యామ్న్యాయ అతిధులు ఉన్నాయి. కానీ ఇది ఎక్కువగా బొప్పాయి పైనే అధికంగా దాడి చేస్తుంది. పొలంలో రెక్కలు వున్న అఫిడ్స్ అధికంగా ఉంటే ఈ తెగులు అతి వేగంగా విస్తరిస్తుంది. చల్లటి వాతావరణంలో ఆకులపై వీటి లక్షణాలు( మొజాయిక్ నమూనా) అధికంగా కనిపిస్తాయి.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరమైన మొక్కల విత్తనాలుమాత్రమే వాడాలి.
  • తెగులు నిరోధక రకాలు వాడాలి.
  • తెగులు సోకే అవకాశాలు లేని ప్రాంతాల్లో మొక్కలు నాటాలి.
  • తోట చుట్టూ, ఈ తెగులుకు అతిధులు కాని మొక్కజొన్న లేదా హైబిస్కస్ శబ్దరిఫా మొక్కలను వేయాలి.
  • అదే ప్రాంతంలో దోస జాతి పంట వేయకండి.
  • పేను బంక యొక్క గరిష్ట జనాభాను నివారించడానికి నాటే సమయాన్ని సర్దుబాటు చేయండి.
  • వైరస్ సోకిన మొక్కలను వాటి భాగాలను తొలగించాలి.
  • పొలంలో మరియు చుట్టూ ప్రక్కల కలుపును నియంత్రించండి.
  • వలలు వాడి క్రిములు వైరస్ వ్యాపించకుండా ఆపవచ్చు.
  • సరైన యాజమాన్య పద్ధతులు పాటించి ఈ తెగులు లక్షణాలు తీవ్రం కాకుండా చూడవచ్చు.
  • కీటకాలు వైరస్ ను వ్యాప్తి చేయకుండా నిరోధించడానికి వలలను ఉపయోగించండి.
  • లక్షణాల తీవ్రత తగ్గించడానికి మంచి ఎరువులను వాడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి