ఇతరములు

ఉల్లి పసుపు మరుగుజ్జు తెగులు

OYDV

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • ముదురు ఆకులపై పసుపు పచ్చని - మొజాయిక్ నమూనా.
  • ఆకులు ముడుతలు పడడం, మెత్తగా అవ్వడం,చుట్టుకుపోవడం మరియు విడిపోవడం జరుగుతుంది.ఎదుగుదల మందగిస్తుంది.
  • మొత్తం మొక్క పసుపు రంగులోకి మారుతుంది.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
వెల్లుల్లి
ఉల్లిపాయ

ఇతరములు

లక్షణాలు

పంట యొక్క ఏ దశలోనైనా ఈ తెగులు సంక్రమించవచ్చు అయితే లక్షణాలు మొదట పాత ఆకులపై కనిపిస్తాయి. ఉల్లి ముదురు ఆకులపై పసుపు పచ్చని గీతలు విభిన్న ఆకృతుల మచ్చలుగా ఎర్పడుతాయి. మొదటి లక్షణాలు ఆకులపై గజిబిజిగా పసుపుపచ్చ చారలు కనబడి నెమ్మదిగా పెద్ద మచ్చులు ఏర్పడతాయి. తరువాత దశలో ఆకులు ముడుచుకొని, వంకర టింకర్లు పోయి ఎండి పోతాయి. తెగులు తీవ్రత అధికమయ్యేసరికి మొక్కలు పసుపు రంగులో మారి ఎదుగుదల ఆగిపోయినట్లు కనపడుతుంది. గడ్డల పరిపక్వం తగ్గి పక్వానికి రాక ముందే తరుగుతాయి మరియు పరిమాణంలో కూడా తగ్గిపోతాయి. విత్తనాల ఉత్పత్తికి ఉపయోగించే ఉల్లిపాయ మొక్కల పూల కాండం, పువ్వులు మరియు విత్తనాల రూపును మారుస్తుంది అలాగే విత్తన నాణ్యతను తగ్గిస్తుంది. సహజంగా ఫలదీకరణ శాతం తగ్గిపోతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ప్రస్తుతానికి వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఎటువంటి జీవ నియంత్రణ పద్ధతులు లేవు. పేనుబంకను ఆకుల దిగువ భాగంలో గమనించినట్లైతే కీటక నాశినులతో లేదా 2% వేప నూనెతో లేదా 5% వేప విత్తనపు సారంతో పిచికారీ చేయాలి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ వైరస్ ను అరికట్టడానికి ఎటువంటి రసాయన నివారణ చికిత్సలు లేవు మరియు పేనుబంక జనాభా పూర్తి నియంత్రణ చాలా కష్టమైన పని. పేనుబంక ను నియంత్రించడానికి ఎమామేక్టిన్ బెంజోఎట్ లేదా ఇండోక్సికార్బ్ వాడిన తరువాత ట్రైజోఫొస్ తో కలిపి పిచికారి చేస్తే మంచి ఫలితం కలుగుతుంది.

దీనికి కారణమేమిటి?

ఉల్లి పసుపు రంగు వైరస్ ఈ తెగులు కారకం(OYDV). ఇది మొక్క వ్యర్ధాలలో చాలా కాలము జీవించి ఉంటుంది. సాధారణంగా ఈ వైరస్ గడ్డలు, నారులు లేదా స్వచ్చంద మొక్కల ద్వారా ఉల్లి పంటలో వ్యాప్తి చెందుతుంది. ఇది పరిమిత రకాలైన అతిధి మొక్కలను ఆశిస్తుంది. ఇది ఉల్లి జాతి కుటుంబానికి చెందిన (ఉల్లిపాయలు, వెల్లుల్లి, చిన్నప్పులు మరియు కొన్ని ఇతర ఉల్లి జాతి మొక్కలు) యొక్క మొక్కల జాతులకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈ తెగులు ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ పేనుబంక పురుగులు రసం పీల్చినప్పుడు వాటి నోటి ద్వారా ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. చాలా తరచుగా ఈ వైరస్ అదే మొక్కలో ఇతర వైరస్ తో కలిసి వ్యాప్తి చెందుతుంది. దీనివలన దిగుబడులు దీని ఉత్పత్తి తగ్గుతుంది. ఉదా: ఈ వైరస్ లీక్ పసుపు పచ్చ వైరస్ తోడైనప్పుడు దిగుబడి నష్టాలు చాలా అధికంగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • ధృవీకరించబడిన మూలాలనుండి ఆరోగ్యకరమైన విత్తనం మరియు నారుని ఉపయోగించాలి.
  • తెగులును తట్టుకునే రకాలను నాటుకోవాలి.
  • ధృవీకరించబడిన నారు దొరకని పక్షంలో గడ్డల బదులుగా విత్తనాలను వాడుకోవాలి.
  • ఈ తెగులు లక్షణాల కొరకు పొలాన్ని తరుచు గమనిస్తూ ఉండాలి.
  • వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి పేనుబంకను నియంత్రించుకోవాలి.
  • కలుపు మొక్కలు మరియు తెగులు సోకిన మొక్కలను పీకి, కాల్చివేయాలి.
  • తెగులుకు ఆతిధ్యమివ్వని మొక్కలతో పంట మార్పిడి చేయాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి