బంగాళాదుంప Y వైరస్

  • లక్షణాలు

  • ట్రిగ్గర్

  • జీవ నియంత్రణ ప్రక్రియ

  • రసాయన నియంత్రణ

  • నివారణ చర్యలు

బంగాళాదుంప Y వైరస్

PVY

వైరస్


క్లుప్తంగా

  • పసుపు నుండి ముదురు ఆకుపచ్చ ముదురు మచ్చలు ఆకుల పైన కనిపిస్తాయి.
  • నల్లటి నిర్జీవమైన పసుపు మచ్చలు మరియు రేఖలు ఆకుల వీనెలపై కనిపిస్తాయి.
  • ఆకులు వాటి చివర్లనుండి నుండి ముడుచుకుపోతాయి.
  • మొక్క ఎదుగుదల ఆగిపోతుంది.

అతిధులు:

బంగాళదుంప

లక్షణాలు

మొక్కల రకాలు, మొక్క వయసు మరియు వాతావరణ పరిస్థితులపై వ్యాధి లక్షణాలు ఆధార పడి ఉంటాయి.ఇవి పసుపు నుండి ముదురు ఆకుపచ్చ మొజాయిక్ నమూనాలో ఆకుల అంచులపై కనిపిస్తాయి దీని వల్ల ఆకులు రూపు మారే అవకాశాలు ఉంటాయి. ఆకుల వీనెలు మరియు చిగుర్లపై గోధుమ రంగు నుండి నల్ల రేఖలు మరియు గుండ్రపు చుక్కలు వంటి చనిపోయిన కణజాలాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన మొక్కలలో దుంపలు చిన్నగా మరియు నిర్జీవమైన మచ్చలు కలిగి ఉంటాయి. దిగుబడి తగ్గిపోతుంది.

ట్రిగ్గర్

ఈ వైరస్ చాల త్వరగా వ్యాపిస్తుంది.. ఇది సహజంగా టమాటో, బంగాళాదుంప మరియు మిరియాల పంటపై వ్యాపిస్తుంది. ఇది పెంకు పురుగులు, వ్యాధి సోకిన మొక్కల వల్ల మరియు శుద్ధి చేయని పరికరాల వల్ల సోకుతుంది.

జీవ నియంత్రణ ప్రక్రియ

వారానికి ఒక సారి మినరల్ ఆయిల్ చల్లటం వల్ల వైరస్ సోకకుండా ఆపవచ్చు. ఇది ఇది పురుగులు ఆ హారాన్ని తీసుకునే పద్దతిని మార్చుతుంది. మరియు మొక్కల పై వీటి ప్రభావాన్ని తగ్గిస్తాయి

రసాయన నియంత్రణ

వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వైరస్ తెగుళ్లకు రసాయన పద్దతిలో నివారణ సాధ్యం కాదు. కానీ క్రిమిహ్మారిణులను వుపయోగించి వీటి జనాభను నియంత్రించవచ్చు.

నివారణ చర్యలు

సర్టిఫైడ్ విత్తనాలను మాత్రమే వాడండి.,తెగులు నిరోధక వంగడాలను వాడండి.పొలాన్ని గమనిస్తూ తెగులు సోకిన మొక్కలను తొలగించాలి.,తెగులుసోకే అవకాశం వున్న మొక్కల దగ్గర బంగాళాదుంపల మొక్కలను నాటవద్దు.ముందు వేసిన పంటల మొక్కలను కలుపు మొక్కలను తీసేయండి.,మొక్కలకు గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి.,పనిముట్లను శుభ్రం చేయండి.,చలికాలంలో నుండి మట్టిలోనే వున్న వైరస్ లను నాశనం చేయండి.