పుచ్చకాయ

దోసకాయ మొజాయిక్ వైరస్

CMV

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు మరియు పండ్లపై పసుపు రంగు మొజాయిక్ గుర్తులు కనపడతాయి.
  • క్రిందకి వంగివుండడం, ఆకులు మరియు రెమ్మలు ముడతలు పడడం మరియు ఎదుగుదల మందగిస్తుంది.
  • పువ్వులపైన తెల్లని చారలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

7 పంటలు
కాకరకాయ
దోసకాయ
పుచ్చకాయ
గుమ్మడికాయ
మరిన్ని

పుచ్చకాయ

లక్షణాలు

తెగులు సోకిన మొక్కరకం మరియు పర్యావరణ పరిస్థితుల మీద ఆధారపడి లక్షణాలు విస్తృతంగా మారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో, వైరస్ ఉండవచ్చు కానీ లక్షణాలు కనబడవు లేదా దాచివేయబడతాయి. కొన్ని రకాలలో ఆకులు మరియు పండ్ల మీద పసుపుపచ్చ అతుకులు లేదా లేత ఆకుపచ్చ మరియు పసుపు మచ్చలను చూడవచ్చు. పక్క కొమ్మలు మరియు ఆకుల కాడలు పొడవుగా పెరుగుతాయి, దాంతో ఆకులు, రేకులు కింది వైపుగా వంగిపోతాయి. లేత ఆకులుముడుచుకుపోయి, కుచించుకుపోయినట్లు కనిపిస్తాయి, దాంతో గుబురు పెరుగుదలతో మొత్తం మొక్కపెరుగుదల తీవ్రంగా స్తంభిస్తుంది. పూల మీద తెలుపు చారలు కనిపిస్తాయి. పండ్ల మీద పై వైపుగా ఉబ్బి, అమ్మడానికి పనికిరానివిగా మారుతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఆకులపై మినరల్ ఆయిల్ ను పిచికారీ చేయడం వలన కీటకాలు వాటిని తినకుండా అరికట్టవచ్చు తద్వారా జనాభాను నియంత్రించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన చికిత్సలతో పాటు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. CMV కి వ్యతిరేకంగా పని చేసే ఎటువంటి ప్రభావవంతమైన రసాయనాలు లేవు. అదేవిధంగా మొక్కలకు తెగులు సోకకుండా నివారించే రసాయనాలు లేవు. కీటకాలను నిరోధించడానికి సైపెర్ మైథ్రిన్ లేదా క్లోరోఫైరిఫాస్ కలిగి ఉన్న రసాయనాలను ఆకులపై పిచికారీ చేయవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు కుకుంబర్ (దోసజాతి) మొజాయిక్ వైరస్ (CMV) వలన సంభవిస్తాయి, ఇది వివిధ రకాలైన జాతులను (కుకుర్బిట్స్, పాలకూర, లేట్యుస్, కాప్సికం మరియు సెలేరి వంటి పంటలు మరియు అనేక పువ్వులు, ముఖ్యంగా లిల్లీలు, డెల్ఫినియంలు, ప్రైములు మరియు డాఫన్స్) లను ప్రభావితం చేస్తుంది. వైరస్ 60-80 వేర్వేరు జాతుల కీటకాల ద్వారా రవాణా మరియు వ్యాప్తి చెందగలదు. వ్యాధి వ్యాప్తి ఇతర మార్గాలైన వ్యాధి సోకిన విత్తనాలు మరియు అంటుకట్టడం వలన, కూలీల ద్వారా లేదా యాంత్రిక సాధనాల వలన వ్యాప్తి చెందుతుంది. CMV దీర్ఘకాలం వుండే కలుపు మొక్కల మీద, పంట మీద మరియు వేర్లు, విత్తనాలు లేదా పువ్వుల మీద కూడా శీతాకాలాన్ని గడుపుతాయి. ప్రాధమిక అంటురోగాలలో వైరస్ కొత్తగా ఉద్భవించిన మొలకల లోపల క్రమపద్ధతిలో పెరుగుతుంది మరియు పై ఆకులలో ముగుస్తుంది. ఈ మొక్కలపై వుండే కీటకాలు ఇక్కడే తింటూ ఇతర చోటుకు వ్యాధిని (ద్వితీయ సంక్రమణ) మోసుకుని వెళ్తాయి. వేర్వేరు మొక్క భాగాల మధ్య సుదూర రవాణా కోసం ఈ వైరస్ హోస్ట్స్ వాస్కులర్ కణజాలాన్ని ఉపయోగిస్తుంది.


నివారణా చర్యలు

  • ధృవీకరించబడిన వైరస్ లేని విత్తనాలు మరియు మొలకలను ఉపయోగించండి.
  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధక లేదా తట్టుకునే రకాలను నాటండి.
  • పొలాన్ని పరిశీలించి తెగులు సోకిన మొక్కలు తొలగించండి.
  • మొజాయిక్ నమూనా వున్న ఏమైనా కలుపు మొక్కలు వుంటే తొలగించండి.
  • మీ పంటలకు సమీపంలో పెరుగుతున్న కలుపు మొక్కలు, మరియు ప్రత్యామ్నాయ అతిధి మొక్కలను తొలగించండి.
  • కోతకు వాడే పరికరాలను శుభ్రం చేయండి.
  • పంట తొలి వారాల్లో కీటకాల వలసను నివారించుటకు ఫ్లోటింగ్ కవర్ ను వాడండి.
  • కొంత కాలం తరవాత ఫలదీకరణ చెందే సమయంలో కవరును తొలగించండి.
  • కీటకాలను ఆకర్షించే అడ్డంకి పంటలను వేయండి.
  • కీటకాలను పెద్ద మొత్తంలో పట్టుకోవడానికి అతుక్కునే వలలను వాడండి.
  • నేలపై అమోనియం ద్రావణం వంటి వాటిని చల్లండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి