సోయాబీన్

బీన్ గోల్డ్ మొజాయిక్ వైరస్

BGMV

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • ప్రకాశవంతమైన పసుపు, పాలిపోయినట్టుగా వున్న ఈనెలు ఆకులకు నెట్ లాంటి పసుపు ఈనెలు ముదురు ఆకుపచ్చ కణజాలాలు కలిగి ఉంటాయి.
  • తరువాత ఈ కోరోసిస్ ఆకు మొత్తం వివిధ రకాల పసుపురంగు నమూనాలతో కూడిన మచ్చలతో నింపేస్తుంది.

లో కూడా చూడవచ్చు


సోయాబీన్

లక్షణాలు

ట్రైఫోలియేట్ ఆకులపైన ఈ తెగులు లక్షణాలు ముందుగా కనపడతాయి. ఆకులు ముడుచుకుపోయి గట్టిగా అయిపోయి తోలు ఆకారం సంతరించుకుంటాయి. మొగ్గలు విచ్చుకోకుండా ఉండిపోయి కిందకి పడిపోతాయి. మచ్చల నమూనాగా అనేక పసుపు రంగుల్లో. ఆకులు చిన్నగా, ముడుచుకుపోయి రాలిపోతాయి. కాయలు పెరగకుండా ముడుచుకుపోతాయి. మొదట్లోనే ఈ తెగులు సోకిన మొక్కలకు తక్కువ కాయలు కాసి వాటిలో గింజల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఇరిసిన్ హెర్బ్ ష్టి ( హెర్బ్ యొక్క బ్లడ్ ఆకు) మరియు ఫైటోలక్క తెర్సిఫ్లోరా యొక్క సారాన్ని వాడడం వలన ఈ తెగులు నియంత్రించబడుతుంది. బీయూవేరియా బసియానా సారం బేమీసియా టబాసి పెద్ద పురుగుల పైన, గుడ్లపైన మరియు అప్పుడే పుట్టిన పిల్ల పురుగులపైనా బాగా పనిచేస్తుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ వైరస్ తెగులుకు రసాయన చికిత్స సాధ్యం కాదు. తెల్ల దోమల నియంత్రణకు చాల తక్కువ నిరోధక పద్ధతులు అందుబాటులో వున్నాయి.

దీనికి కారణమేమిటి?

ఈ వైరస్ ఒక నిరంతర క్రమంలో తెల్ల దోమ బేమిసియా టబాసి వల్ల వ్యాపిస్తుంది. పొలంలో పని చేసే సమయం లో మొక్కలకు కలిగే దెబ్బల వలన కూడా ఈ తెగులు సోకుతుంది. ఈ తెగులు ఒక మొక్క నుండి వేరొక మొక్కకు ఒక పద్ధతిప్రకారం విస్తరిస్తుంది. ఇది విత్తనాల ద్వారా లేదా పుప్పొడి ద్వారా వ్యాపించదు. పొలంలో ఈ తెగులు సోకే అవకాశం వున్న కలుపు మొక్కలకు ఈ తెగులు సోకుతుంది. మొక్కల రవాణా వ్యవస్థలో వున్న కణజాలాల ద్ద్వారా ఈ తెగులు దిగ్విణీకృతం అవుతుంది అందువల్లనే ఆకు ఈనెలు ముందుగా ఈ తెగులు ప్రభావానికి గురవుతాయి. 28 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఈ తెగులు మరింత విజృంభిస్తుంది. చల్లని వాతావరణం ( 22 డిగ్రీల ఉష్ణోగ్రత) ఈ తెగులు వృద్ధిచెందకుండా మరియు దీని లక్షణాలు పెరగకుండా చేస్తుంది.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక విత్తనాలను వాడండి.
  • పొలంలో మరియు చుట్టుపక్కల కలుపు లేకుండా చూడాలి.
  • మొక్కలను ఒత్తుగా నాటాలి.
  • తెల్ల ఈగలు పొలం లోకి వచ్చే అవకాశం లేకుండా.
  • పంట మార్పిడి పద్ధతులు వాడాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి