ఆపిల్

ఆపిల్ మొజాయిక్ వైరస్

APMV

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులపై ప్రకాశవంతమైన పసుపు మచ్చలు లేదా పట్టీలు ఏర్పడతాయి.
  • లక్షణాలు ఏక రెమ్మలపై మొదట కనిపిస్తాయి.
  • చెట్ల ఎదుగుదల తగ్గుతుంది.

లో కూడా చూడవచ్చు

8 పంటలు
బాదం
ఆపిల్
అప్రికోట్
చెర్రీ
మరిన్ని

ఆపిల్

లక్షణాలు

ప్రారంభంలో, ఆకులు ఒకే రెమ్మలో వున్న కొత్త ఆకులపై ప్రధాన ఈనెల వెంబడి ప్రకాశవంతమైన పసుపు మచ్చలు లేదా పట్టీలను ప్రదర్శించడం ప్రారంభిస్తాయి. వ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పుడు, ఈ లక్షణాలు అన్ని రెమ్మల ఆకులపై కనిపిస్తాయి. ఈ తెగులు బారిన పడిన ఆకులు అకాలంగా పడిపోవచ్చు. చెట్ల ఎదుగుదల తగ్గుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ వైరస్ నయం కాదు. ఇతర చెట్లకు వ్యాపించకుండా ఉండటానికి తెగులు సోకిన చెట్టును తొలగించాలి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ వైరల్ వ్యాధికి రసాయన చికిత్స లేదు.

దీనికి కారణమేమిటి?

ఆపిల్ మొజాయిక్ వైరస్ వల్ల లక్షణాలు సంభవిస్తాయి. ఈ వైరస్ కు చెక్క మరియు గుల్మకాండ మొక్కలతో సహా విస్తృత అతిధి మొక్కల పరిధి ఉంటుంది. వైరస్ కు సహజ వాహకం లేదు. అంటు కట్టడం కోసం స్లిప్‌లుగా ఉపయోగించినప్పుడు తెగులు సోకిన కొమ్మలు వైరస్‌ను వ్యాప్తిచేస్తాయి. వేర్ల ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఒక మోస్తరు వసంతకాలపు ఉష్ణోగ్రతలు వున్న సంవత్సరాలలో ఈ వైరస్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.


నివారణా చర్యలు

  • ధ్రువీకరించబడిన వైరస్ రహిత పదార్థాన్ని ఉపయోగించండి.
  • తెగులు సోకిన చెట్ల నుండి అంటు కట్టడం కోసం స్లిప్‌లను ఉపయోగించవద్దు.
  • వైరస్ వ్యాప్తిని నిరోధించుటకు 38°C వద్ద 24 నుండి 32 రోజులు ధెర్మోథెరపీని ఉపయోగించండి.
  • మీ పొలంలో తెగులు సోకిన మొక్కల భాగాలు మరియు కలుపు మొక్కలను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి