కందులు

కాయధాన్యపు పంటల్లో పక్షి కన్ను తెగులు

Colletotrichum truncatum

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • కాండంపై గాయాలు మొదట కాండం యొక్క దిగువ భాగాలలో కనిపిస్తాయి.
  • తరువాత మొక్క పైభాగంలో వృద్ధి చెందుతాయి.
  • ఆకులు నిర్జీవంగా మారతాయి.
  • క్రింది ఆకులపైన చర్మపు రంగు మచ్చలు వృద్ధి చెందుతాయి మరియు తీవ్రంగా ప్రభావితమైన ఆకులు ముందుగానే చనిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
కందులు

కందులు

లక్షణాలు

ఆకులు, కాండం, కాయలు గింజలపై గాయాలు కనిపించడం ద్వారా పక్షి కన్ను తెగులు వర్ణించబడుతుంది. ముదురు గోధుమ రంగు అంచులతో కోలాకారపు , బూడిద నుండి టాన్ రంగు నిర్జీవ ప్యాచీలు ముదురు ఆకులపై వృద్ధి చెందుతాయి. తీవ్రమైన సందర్భాల్లో, ఈ ఆకులు వాలిపోయి, ఎండిపోయి రాలిపోతాయి. దీని వలన ఆకులు రాలిపోతాయి. కాండంపైన పొడవైన నొక్కుకుపోయినట్టు వున్న ముదురు రంగు అంచులతో గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి విస్తరించేటప్పుడు, గాయాలు కాండం మొదలును చుట్టుముట్టి దాన్ని నడికట్టు లాగ పట్టి ఉంచి మొక్క వాడిపోయి చనిపోయేలా చేస్తుంది. కాయలపై ఎర్రటి-గోధుమ రంగు అంచులు మరియు ఎర్రటి కేంద్రాలతో వృత్తాకార మరియు నొక్కినట్టు వున్న మచ్చలు ఉంటాయి. అన్ని సందర్భాల్లోనూ , చనిపోయిన కణజాలంపై చిన్న విలక్షణమైన ముదురు లేదా నల్లని మచ్చలు కనిపిస్తాయి. అప్పుడప్పుడు, సాల్మన్ రంగులో ఉండే ఒక స్రావం కూడా మధ్యలో కనిపిస్తుంది. తెగులు సోకిన గింజలు ముడుతలు పడి రంగు కోల్పోతాయి. మొత్తంమీద, మొక్కల సత్తువ బాగా తగ్గిపోతుంది మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ఇవి వాలిపోయి పడిపోవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

కొన్ని సంబంధిత జాతుల ఫంగస్ కోసం (ఇతర పంటలపై), తెగులు సోకిన విత్తనాలను 52°C వేడి నీటిలో 30 నిమిషాలు నానబెట్టడం ద్వారా కొంత వరకూ ఈ తెగులును నియంత్రించవచ్చు. ఈ చికిత్సకు కావలసిన ప్రభావాన్ని పొందడానికి ఉష్ణోగ్రత మరియు సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి. సంక్రమణను నియంత్రించడానికి జీవసంబంధ ఏజెంట్లు కూడా సహాయపడవచ్చు. ట్రైకోడెర్మా హర్జియనం అనే ఫంగస్ మరియు విత్తన చికిత్సగా ఉపయోగించే సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనే బ్యాక్టీరియా కొన్ని జాతుల కొల్లెటోట్రిఖంతో పోటీపడతాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. విత్తనం ద్వారా సంక్రమణలను నివారించడానికి విత్తన చికిత్సలను ఉపయోగించవచ్చు. పుష్పించే ముందు వివిధ శిలీంద్ర నాశినులను ఆకుల పిచికారీగా సిఫార్సు చేయబడింది. తెగులు వృద్ధికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే వీటిని మళ్ళీ మరొకసారి వాడాలి. పైరాక్లోస్ట్రోబిన్, క్లోరోథలోనిల్, ప్రోథియోకొనజోల్ లేదా బోస్కాలిడ్ ఆధారంగా సూత్రీకరణలు తెగులును అదుపులో ఉంచడానికి విజయవంతంగా ఉపయోగించబడ్డాయి. ఈ ఉత్పత్తులలో కొన్నింటికి కొన్ని నిరోధకత యొక్క సందర్భాలు వివరించబడ్డాయి.

దీనికి కారణమేమిటి?

గింజలతో సంబంధం కలిగిన మట్టిలో లేదా మొక్కల అవశేషాలపై నాలుగేళ్ల వరకు జీవించి వుండే కొల్లెటోట్రిఖమ్ ట్రంకాటం అనే ఫంగస్ వలన ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఫంగస్ కొత్త మొక్కలకు సంక్రమించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మొలకలు ఆవిర్భవిస్తున్న సమయంలో మట్టిలో పెరిగే బీజాంశం వీటికి సంక్రమించినప్పుడు ఇది కణజాలాల్లో వ్యవస్థాత్మకంగా పెరుగుతుంది. ఇతర సందర్భాల్లో వర్షపు తుంపర్ల ద్వారా బీజాంశం క్రింది ఆకులపైకి చిమ్ముతుంది మరియు సంక్రమణను పైకి వ్యాపింపచేస్తుంది. తరువాత మొక్కల కణజాలాలపై (ముదురు లేదా నల్లని మచ్చలు) వృద్ధి చెందుతున్న గాయాలలో మరిన్ని బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి మొక్కల పైభాగాలకు లేదా ఇతర మొక్కలకు (ద్వితీయ సంక్రమణ) వర్షపు తుంపర్ల ద్వారా చెదరగొట్టబడతాయి. చల్లటి నుండి వెచ్చని ఉష్ణోగ్రతలు (20 నుండి 24°C), అధిక ఉదజని సూచిక ఉన్న నేలలు, సుదీర్ఘమైన ఆకు తడి (18 నుండి 24 గంటలు), తరచుగా వర్షం మరియు దట్టమైన మొక్క పై పందిరి ఈ వ్యాధికి అనుకూలంగా ఉంటాయి. పోషకాల లోపం ఒత్తిడికి గురైన పంటలు ముఖ్యంగా ఈ తెగులు బారిన పడే అవకాశం అధికంగా ఉంటుంది. తెగులు తీవ్రత అధికంగా ఉంటే దిగుబడి నష్టాలు 50% వరకు ఉండవచ్చు.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరమైన మొక్కల నుండి లేదా ధ్రువీకరించబడిన మూలాల నుండి సేకరించిన విత్తనాలను ఉపయోగించండి.
  • అందుబాటులో ఉంటే మరింత అధిక నిరోధక రకాన్ని ఎంచుకోండి.
  • విత్తే సమయంలో మొక్కల మధ్య విస్తృత స్థలం ఉంచండి.
  • ఈ తెగులుకు అతిధులు కానీ మొక్కలతో కనీసం 4 సంవత్సరాలు పంట మార్పిడి చేయండి.
  • గతంలో తెగులు సోకిన పొలాల్లో కాయధాన్యపు పంటలను వేయవద్దు.
  • పొలంలో, చుట్టుపక్కల స్వచ్చందంగా వచ్చే కాయ ధాన్యాలు మరియు కలుపు మొక్కలను తొలగించండి.
  • బఠానీలు లేదా చిక్కుడు బీన్స్ ప్రత్యామ్నాయ అతిధులుగా ఉన్నందున వాటిని నాటవద్దు.
  • మొక్కల అవశేషాలను పాతిపెట్టకండి, ఎందుకంటే ఇవి ఫంగస్‌ను తరువాత పంటకు సంక్రమింప చేసే అవకాశం వుంది.
  • శిలీంధ్రం త్వరగా కుళ్ళిపోతున్నందున మొక్కల అవశేషాలను భూమిపైనే వదిలివేయండి.
  • వ్యాధికారక సూక్ష్మ జీవులకు అనుకూలంగా ఉన్నందున, పొలాన్ని దున్నడం మానెయ్యడం వంటి వ్యూహాలను మానుకోండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి