దానిమ్మ

దానిమ్మలో పక్షి కన్ను తెగులు

Glomerella cingulata

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • పసుపు రంగు వలయంతో కూడిన నల్లని మచ్చలు ఏర్పడతాయి.
  • తరువాత దశలో ఇవి ఆకు అంతటా విస్తరిస్తాయి.
  • ఆకులు ముందుగానే రాలిపోతాయి.
  • పొడిబారిన ఎర్రటి గోధుమ రంగు, నల్లని రంగు కోల్పోయిన పండ్లు.
  • తెగులు సోకిన కొమ్మలు మరియు శాఖలు పై బెరడు రాలిపోయి పైనుండి చనిపోవడం జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

దానిమ్మ

లక్షణాలు

ఫంగస్ దాడి చేసిన కణజాలములు దానిమ్మపై ఆంత్రాక్నోస్ వాతావరణాన్ని బట్టి విస్తృతమైన లక్షణాలను కలిగిస్తుంది. వివిధ రంగుల సూక్ష్మమైన పల్లపు మచ్చలు ఆకులు, కాండం, పువ్వులు లేదా పండ్లలో కనిపిస్తాయి. ఇవి తరచుగా ఎక్కువ లేదా తక్కువగా గుర్తించబడుతున్న పసుపు వలయముతో ఉంటాయి. ఈ మచ్చలు తరువాత విస్తరించి గాయాలు ఏర్పరుస్తాయి మరియు బ్లేడ్ల యొక్క ఒక ప్రధాన భాగం కవర్ చేస్తాయి. అవి పసుపు రంగులోకి మారుతాయి మరియు ఎదగకుండానే ముందుగానే రాలిపోతాయి. పండ్ల పైన మచ్చలు గోధుమ రంగు నుండి ముదురు గోధుమ రంగులో వుండి మొదట వృత్తాకారము లో వుండి తరువాత అవి పెరిగిన కొలది క్రమము తప్పుతాయి. పండు తరువాత మృదువుగా మారి విత్తన కవచములలో కుళ్ళు ప్రారంభము చెంది పండు బూడిదరంగు లేదా నలుపు రంగులోకి మారుతుంది, కానీ నీళ్ళగా వుండదు. ఆంథ్రాక్నోస్ కూడా కొమ్మలు మరియు శాఖలు దాడి చేసి అందువలన కాంకర్ చెంది ఉబ్బిన అంచులతో కూడి కణజాలములు వ్యాధిబారిన పడతాయి. బోదె యొక్క సంక్రమణము అప్పుడప్పుడూ గిడసబారిపోయి మరియు మరణము సంభవించ వచ్చును.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఆస్పెర్గిల్లస్ ఫ్లేవస్, హైపోక్రీ రూఫా, హైపోక్రియ రుఫా, హైపోనెక్త్రియ ట్యూబర్క్యులిఫార్మిస్ మరియు నెక్ట్రియెల్లా మెల్లెరీ వంటి శిలీంధ్రాలు, తెలిసిన జీవ నియంత్రణ ఏజెంట్లు. మొదటిది మాత్రమే నిజమైన విరోధి. మిగతావి పరాన్న జీవులు లేదా వ్యాధికారకాలు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి.పుష్పించే సమయము ప్రారంభమవుతున్నప్పుడు మరియు పర్యావరణ పరిస్థితులు ఫంగస్ కు అనుకూలముగా వున్నప్పుడు మొదటి నిరోధక స్ప్రేని చేయవచ్చును. అవసరమైతే అప్పుడు 15 రోజుల విరామముతో రెండుసార్లు స్ప్రే చేయాలి. ప్రాక్కోనజోల్, మాంకోజబ్, కార్బెండజిమ్ లేదా మాంకోజేబ్ మరియు కార్బెండజిమ్ లేదా ట్రైక్లైలాజోల్ వీటి కలయిక క్రియా శీలక పదార్థాలు. దానిమ్మపండుకు నిజముగా సంక్రమణము జరిగినది అని నిర్ధారణ చేసుకొన్న తరువాత మాత్రమే శిలీంధ్రాలు స్ప్రే చేయండి. నిర్దిష్ట సాంద్రీకరణలను అనుసరించడానికి మరియు నిరోధక చర్యలను నివారించడానికి వివిధ పద్ధతులతో శిలీంధ్రాలను ఉపయోగించడం ముఖ్యం.

దీనికి కారణమేమిటి?

గ్లోమేరెల్ల సింగులటా ఫంగస్ వలన ఈ లక్షణాలు కలుగుతాయి. శీతాకాలములో సంక్రమణము చెందిన మొక్క యొక్క అవశేషాలు నేల ఉపరితలములో లేక చుట్టి ఉంచబడిన పళ్ళలో ఉంటాయి. వసంత ఋతువులో దాని బీజాంశములు వర్షం చిమ్మడము ద్వారా లేదా గాలి ద్వారా వ్యాప్తి చెంది మరియు పొరుగు కొమ్మలు లేదా మొక్కలకు సోకవచ్చును. అత్యంత సులభముగా సంక్రమణము చెందే దశలు వికసించిన సమయము మరియు పండు అభివృద్ధి చెందే సమయము. చెట్టు ముళ్ళు, కీటకాలు మరియు జంతువులు కారణంగా సంక్రమణ ప్రక్రియకు అనుకూలంగా ఉంటాయి. తరచుగా వర్షపాతం, అధిక తేమ (50-80%) మరియు ఉష్ణోగ్రత 25-30 డిగ్రీ ఉష్ణోగ్రత ఫంగస్ జీవిత చక్రంకు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ, పొడి ఋతువులలో ఇది సాధారణంగా క్రియారహితంగా ఉంటుంది. కాంతి సంక్రమణము పండుకు సౌందర్య నష్టం కలిగించుతుంది మరియు దాని నిల్వ జీవితం తగ్గించగలదు. మామిడి, జామ, మరియు బొప్పాయి వంటి ఇతర అతిధేయులు ఉన్నాయి.


నివారణా చర్యలు

  • ధ్రువీకరించిన విధానాలను కొనుగోలు చేయండి.
  • ఆరోగ్యకరమైన మొక్కల పదార్థాన్ని ఉపయోగించండి.
  • మంచి గాలి మరియు సూర్య రశ్మి తగిలేటట్టు మొక్కల మధ్య తగినంత ఖాళీ ఉంచండి.
  • పొలంలో మంచి మురుగు నీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి.
  • ఓవర్ హెడ్ నీటిపారుదల పద్దతిని ఉపయోగించకండి.
  • ఆకులను విచ్చుకున్న తరువాత మరియు వసంతకాలపు వర్షాలు ఆగిపోయిన తరువాత ఎరువులు వేయండి.
  • దిగుబడిపై ప్రభావాన్ని నివారించడానికి మీ మొక్కలకు సరైన మోతాదులో ఎరువులను వేయండి.
  • పొలంలో కలుపు మొక్కలను తొలగించి పొలం పరిశుభ్రంగా వుండేటట్టు చూడండి.
  • పొలంలో పనిచేస్తున్నప్పుడు మొక్కలకు దెబ్బలు తగలకుండా చుడండి.
  • పుష్పాలు విచ్చుకునే సమయంలో మరియు పండ్లు వృద్ధిచెందే సమయంలో మొక్కలకు తెగుళ్లు సోకిన లక్షణాలకోసం చూడండి.
  • శీతాకాలంలో మొక్కలకు కత్తిరింపులు చేయండి.
  • మరియు ప్రూనింగ్ కోసం ఉపయోగించేపనిముట్లను శుభ్రంగా క్రిమిరహితంగా ఉంచండి.
  • మొక్కలు ఎదుగుతునప్పుడు రాలిన ఆకులు మరియు తెగులు సోకిన కొమ్మలు మరియు రెమ్మలను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి